E-Paper
Advertisement

HBD Prerna Arora: ప్రొడ్యూసర్ ప్రేరణ అరోరా బర్త్ డే స్పెషల్ ..మరో పాన్ ఇండియా సినిమా ప్రకటన!

HBD Prerna Arora: ప్రొడ్యూసర్ ప్రేరణ అరోరా బర్త్ డే స్పెషల్ ..మరో పాన్ ఇండియా సినిమా ప్రకటన!
Advertisement

HBD Prerna Arora: సినిమాలు అంటే ఎంతో ఆసక్తితో నిరంతరం ఇండస్ట్రీలోకి ఎంతోమంది కొత్త నటీనటులు, దర్శక నిర్మాతలు అడుగుపెడుతూ ఉంటారు. ఇలా సినిమాలపై మక్కువతో సినిమా ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. ఇక సినిమా ఇండస్ట్రీలో కేవలం అబ్బాయిలు మాత్రమే కాకుండా అమ్మాయిలు కూడా తమదైన శైలిలోనే రాణిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా నిర్మాణ రంగంలో కూడా ఎంతో మంది మహిళలు మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో మహిళా నిర్మాతగా కొనసాగుతూ మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో “ప్రేరణ అరోరా” (Prerana Arora)ఒకరు.

నిర్మాత ప్రేరణ పుట్టినరోజు ప్రత్యేకం…

ప్రేరణ అరోరా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన రుస్తమ్, జటాధరా(Jatadhara) వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇక నేడు నిర్మాత ప్రేరణ అరోరా పుట్టినరోజు(Birthday) జరుపుకుంటున్న నేపథ్యంలో ఈమెకు సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ప్రేరణ పుట్టినరోజు సందర్భంగా ఈమెకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లు వెతుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రేరణ తదుపరి సినిమాకి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

జీ స్టూడియోస్ తో పాన్ ఇండియా సినిమా..

Advertisement

ఇప్పటివరకు ప్రేరణ నిర్మాతగా రుస్తమ్, జటాధరా సినిమాలకు నిర్మాతక వ్యవహరించారు అయితే తాజాగా ఈమె జి స్టూడియోస్ తో కలిసి తమ తదుపరి పాన్ ఇండియా సినిమాని చేయబోతున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఈ సినిమాని అధికారికగా ప్రకటించారు. ఇక ఈమె జీ సంస్థలో కలిసి చేయబోతున్న మూడవ సినిమా కావటం విశేషం. ఇక ఈ సినిమాకు ఉమేష్ కుమార్ బన్సాలి, శివన్ నారంగ్, ప్రేరణ సంయుక్తంగా నిర్మిస్తుండగా ఈ చిత్రానికి కీర్తన్ సహ నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. ఇలా ప్రేరణ నిర్మాణ సారథ్యంలో మరో పాన్ ఇండియా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిన పలువురు ఈమెకు అభినందనలు తెలియజేస్తున్నారు.

అమెజాన్ ప్రైమ్ లో జటాధర..

Advertisement

ఇక ప్రేరణ ఇదివరకు రుస్తమ్, టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్ మాన్, పరీ వంటి సినిమాలతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. ఇలా నార్త్ సౌత్ అని తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఇండస్ట్రీలో నిర్మాతగా మంచి ఆదరణ సొంతం చేసుకోవటమే కాకుండా ఎంతోమందికి స్ఫూర్తిగా కూడా నిలిచారు. ప్రేరణ నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జటాధర సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమవుతూ టాప్ చార్ట్స్ లో ట్రెండింగ్ అవుతుంది. ఈ సినిమాలో ప్రముఖ టాలీవుడ్ హీరో సుదర్ బాబు హీరోగా నటించిన బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్ వంటి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు.

Also Read: Kaantha OTT: ఇట్స్ అఫీషియల్ కాంత ఓటీటీ రిలీజ్ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Related News

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్కడైనా సక్సెస్ అయ్యేనా?

అరుదైన ఘనత సాధించిన రష్మిక మందన్న!

అన్నపూర్ణ స్టూడియోస్ పై అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×