Anchor Sravanthi: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది లేడీ యాంకర్లుగా కొనసాగుతూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఒకానొక సమయంలో యాంకర్ అంటే ఉదయభాను ఝాన్సీ సుమా కనకాల వంటి వారి పేర్లు మాత్రమే వినపడేవి కానీ ఇటీవల కాలంలో ఎంతోమంది యాంకర్లుగా కొనసాగుతూ బిజీగా ఉన్నారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతూ ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న వారిలో స్రవంతి చొక్కారపు ఒకరు. సినిమాలపై ఆసక్తితో అనంతపురంలో జన్మించిన ఈమె హైదరాబాద్ వెళ్లి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ యాంకర్ గా స్థిరపడ్డారు.
స్రవంతి యూట్యూబ్ ఛానల్ యాంకర్ గా ఎంతో మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ వచ్చారు అనంతరం ఈమె తెలుగు బిగ్ బాస్ కార్యక్రమంలో అవకాశాన్ని అందుకొని ఎంతో ఫేమస్ అయ్యారు. ఇక ఇటీవల కాలంలో టాలీవుడ్ సినిమా ఏదైనా విడుదల అవుతుంది అంటే కచ్చితంగా ఆ కార్యక్రమంలో స్రవంతి ఉండాల్సిందేనని చెప్పాలి. ఇలా సినిమా ఈవెంట్లతో కెరియర్ పరంగా స్రవంతి ఎంతో బిజీగా ఉన్నారు . ఇకపోతే తాజాగా ప్రముఖ దర్శకుడు శివానిర్వాన(Shiva Nirvana) స్రవంతి గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
తాజాగా మారెమ్మ(Maremma) సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది .ఈ కార్యక్రమంలో భాగంగా దర్శకుడు శివానిర్వాన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి స్రవంతి యాంకర్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శివానిర్వాన మాట్లాడుతూ.. స్రవంతి గారు యాంకర్ గా ఏదైనా ఒక సినిమా ఈవెంట్ చేసింది అంటే ఆ సినిమా సూపర్ సక్సెస్ అయినట్లే అంటూ ఆమెపై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇలా స్రవంతి ఉంటే సినిమా హిట్ అంటూ కామెంట్లు చేయడంతో అభిమానులు ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. యాంకర్ గా ఇండస్ట్రీలో సుమ క్రేజ్ తగ్గిందా? అందుకే ఆమెకు అవకాశాలు తగ్గి స్రవంతికి సినిమా ఈవెంట్ అవకాశాలు వస్తున్నాయా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. సుమ కనకాల కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతూ మంచి సక్సెస్ అయ్యారు ఒకానొక సమయంలో సుమ డేట్స్ చూసుకొని మరి దర్శక నిర్మాతలు తమ ఈవెంట్లను ప్లాన్ చేసుకునేవారు అంటే సుమ క్రేజ్ ఎలా ఉండేదో స్పష్టం అవుతుంది. ఇటీవల సుమ కనకాలకు పోటీగా స్రవంతి కూడా సినిమా ఈవెంట్లు చేస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా రవితేజ హీరోగా నటించిన ఇరుముడి సినిమా ఈవెంట్ కు కూడ స్రవంతి యాంకర్ గా వ్యవహరించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలవడంతో డైరెక్టర్ శివ నిర్మాణ స్రవంతిని ఉద్దేశించి అలా మాట్లాడారని తెలుస్తుంది అలాగే మారెమ్మ సినిమా టీం కూడా సక్సెస్ కావాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
Also Read: లెనిన్ హిట్.. మెగా హీరోతో ఛాన్స్ కొట్టేసిన భాగ్య శ్రీ?