E-Paper
Advertisement

ఒకే బిల్డింగ్‌లో ఊరంతా.. ఈ వింత చూస్తే షాక్ అవ్వాల్సిందే!

ఒకే బిల్డింగ్‌లో ఊరంతా.. ఈ వింత చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Advertisement

Unique Town in The World: ఊరంటే బోలెడు ఇళ్లు ఉంటాయి. ఒక్కొక్కరు తమకు నచ్చినట్లుగా ఇళ్లను నిర్మించుకుంటారు. హ్యాపీగా ఉంటారు. కానీ, ఊరంతా ఒకే భవనంలో నివాసం ఉండటం ఎప్పుడైనా చూశారా? లేదంటే,  అమెరికాలోని అలస్కా రాష్ట్రంలో ఉన్న విటియర్ పట్టణం గురించి తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే అక్కడి ప్రజల జీవన విధానం మిగతా ప్రాంతాలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. తీవ్రమైన చలి, మంచు తుఫానులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో ప్రజలు బయటకు వెళ్లడం కూడా కొన్నిసార్లు కష్టంగా మారుతుంది. అందుకే అక్కడి ప్రజల కోసం ఒకే భవనం నిర్మించారు. అందులో దాదాపు మొత్తం పట్టణం నివాసం ఉంటుంది.

14 అంతస్తుల భవనమే ఓ పట్టణం!

విటియర్‌లోని బెగిచ్ టవర్ 14 అంతస్తుల్లో నిర్మించారు. ఈ ఒక్క భవనంలోనే పట్టణంలోని దాదాపు 250 మంది నివాసం ఉంటారు. ఒక అపార్ట్‌ మెంట్ లో ఇళ్లు మాత్రమే ఉంటాయి. కానీ, బెగిచ్ టవర్ మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ నివసించే వారికి రోజువారీ జీవితానికి అవసరమైన అనేక సౌకర్యాలు భవనంలోనే అందుబాటులో ఉంటాయి. సూపర్ మార్కెట్, పోస్టాఫీస్, హెల్త్ క్లినిక్, కార్యాలయాలులాంటి సౌకర్యాలు ఉన్నాయి. అంటే, ఇంటి నుంచి బయటకు వచ్చినా భవనం బయటకు వెళ్లకుండానే చాలావరకు పనులు పూర్తి చేసుకోవచ్చు. పిల్లలకు సంబంధించిన అవసరాలు, ఉద్యోగాలు, ఆరోగ్య సేవలు, నిత్యావసర వస్తువుల కొనుగోలు కూడా ఇందులోనే చేసుకోవచ్చు. దీంతో అక్కడి ప్రజల రోజువారీ జీవితం చాలా వరకు ఈ భవనం చుట్టూనే సాగుతుంది.

బయటకు వెళ్లడం ఎందుకు కష్టం?

Advertisement

అలస్కాలోని ఈ ప్రాంతంలో శీతాకాలం చాలా తీవ్రమైన పరిస్థితులు ఉంటాయి. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో పాటు మంచు తుఫానులు కూడా తరచూ ఇబ్బంది పెడుతుంటాయి. అలాంటి సమయంలో బయట ఎక్కువసేపు ఉండటం ప్రమాదకరంగా ఉంటుంది. ఈ కారణంగానే ఒకే భవనంలో ఎక్కువ సౌకర్యాలు ఏర్పాటు చేయడం అక్కడి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారింది. ముఖ్యంగా తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో అవసరమైన పనుల కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేస్తుంది.

బయట ప్రపంచంతో ఒకే మార్గం

బెగిచ్ టవర్‌కు మరో ఆసక్తికరమైన ప్రత్యేకత కూడా ఉంది. ఈ భవనానికి బయట ప్రపంచంతో అనుసంధానం చేసే ప్రధాన మార్గం ఒకే ఒక సొరంగం. ఈ సొరంగం ద్వారానే ప్రజలు బయటకు వెళ్లి, వస్తుంటారు. అంటే విటియర్ పట్టణ జీవితం ఎంతవరకు ఈ భవనం చుట్టూ కేంద్రీకృతమైందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

అపార్ట్‌ మెంట్ కాదు.. ఇండోర్ టౌన్!

Advertisement

బెగిచ్ టవర్‌ను సాధారణ అపార్ట్‌ మెంట్ భవనంగా చెప్పడం కంటే, ఒక చిన్న ఇండోర్ పట్టణంగా చెప్పడం కరెక్ట్ గా ఉంటుంది. ఒకే గొడుగు కింద ఇళ్లు, దుకాణాలు, వైద్య సదుపాయాలు, కార్యాలయాలు లాంటి అవసరమైన అన్ని సేవలు ఉండటం దీనికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ప్రకృతి ఎంత ఇబ్బందికరంగా ఉన్నా, దానికి తగ్గట్టుగా మనుషులు తమ జీవన విధానాన్ని ఎలా మార్చుకున్నారో చూపించే ఆసక్తికరమైన ఎగ్జాంపుల్ గా బెగిచ్ టవర్ ను చూపించవచ్చు.

Read Also: గాల్లో తేలే పుస్తకాలు.. చుట్టూ అద్దాల మాయ.. ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్న ఫ్యూచరిస్టిక్ లైబ్రరీ!

Tags

Related News

గాల్లో తేలే పుస్తకాలు.. చుట్టూ అద్దాల మాయ.. ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్న ఫ్యూచరిస్టిక్ లైబ్రరీ!

27 సార్లు గర్భం.. 69 మంది పిల్లలు.. ప్రపంచంలోనే ఎక్కువ మంది పిల్లల్ని కన్న తల్లి ఈమే!

క్లియోపాత్రా అందానికి ప్రపంచమే ఫిదా.. ఇంతకీ ఆమె సౌందర్య రహస్యం ఏంటో తెలుసా?

లాంగ్ హాలిడే అవసరం లేదు.. 2 రోజుల్లో వీకెండ్ ఎంజాయ్ చేయగల 7 బెస్ట్ డెస్టినేషన్స్

గోవా-ఢిల్లీ ఇండిగో విమానం.. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సమస్య, వెంటనే అత్యవసర ల్యాండింగ్

టిష్యూ పేపర్ ఎంత పని చేసింది? ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్, ఏం జరిగింది?

ఒకప్పుడు జైలు.. ఇప్పుడు లగ్జరీ హోటల్.. ఈ వింత ప్రదేశం ఎక్కడ ఉందంటే?

Big Stories

Advertisement
×