E-Paper
Advertisement

2600 కోట్ల కలెక్షన్లు… 7.9 IMDb రేటింగ్… తెలుగులో అందుబాటులో ఉన్న ఆల్ టైమ్ క్లాసిక్ మిస్టరీ థ్రిల్లర్

2600 కోట్ల కలెక్షన్లు… 7.9 IMDb రేటింగ్… తెలుగులో అందుబాటులో ఉన్న ఆల్ టైమ్ క్లాసిక్ మిస్టరీ థ్రిల్లర్
Advertisement

Mystery Thriller: ఇంట్లో పుట్టినరోజు వేడుక… మరుసటి రోజు అదే ఇంట్లో కుటుంబ పెద్ద శవమై కనిపిస్తే ? ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిపై అనుమానం వస్తే ? పైగా పోలీసులు ఎంత దర్యాప్తు చేసినా అసలు హంతకుడు ఎవరో అంత ఈజీగా తేలకపోతే ? ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న కుటుంబ సభ్యుల మధ్య, అసలు నిజాన్ని బయటకు తీసేందుకు ఓ డిటెక్టివ్ రంగంలోకి దిగితే ? ఇలాంటి మైండ్ గేమ్స్, ఫ్యామిలీ సీక్రెట్స్, ఊహించని ట్విస్టులతో తెరకెక్కిన ఆల్ టైమ్ పాపులర్ మిస్టరీ థ్రిల్లర్ ‘Knives Out’. మరి హత్యకు గురైన వ్యక్తి ఎవరు ? అతన్ని చంపింది కుటుంబంలోనే ఉన్న వ్యక్తేనా ? డిటెక్టివ్ బెనాయిట్ బ్లాంక్ అసలు నిజాన్ని ఎలా బయట పెట్టాడు ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

ప్రముఖ క్రైమ్ నవలా రచయిత హార్లన్ త్రోంబే తన 85వ పుట్టినరోజును కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటాడు. ఆ రాత్రి అంతా సాధారణంగానే కనిపిస్తుంది. కానీ మరుసటి రోజు హార్లన్ తన ఎస్టేట్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయి కనిపిస్తాడు. మొదట ఇది ఆత్మహత్యలా కనిపించినా, కేసులోకి డిటెక్టివ్ బెనాయిట్ బ్లాంక్ ఎంట్రీ ఇవ్వడంతో అసలు ఆట మొదలవుతుంది.

Advertisement

హార్లన్ కుటుంబంలో ప్రతి ఒక్కరికీ అతనితో ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆస్తి, కుటుంబ గొడవలు, వ్యక్తిగత రహస్యాలు, డబ్బు ఇలా ఒక్కొక్కరి వెనుక ఒక్కో కారణం దాగి ఉంటుంది. బ్లాంక్ ఒక్కొక్కరినీ ప్రశ్నిస్తూ వెళ్లే కొద్దీ, బయటికి ఎంతో సంతోషంగా కనిపించే కుటుంబం లోపల ఎంత గందరగోళంగా ఉందో బయట పడుతుంది. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే… పోలీసులు అనుకుంటున్నట్టుగా ఇది సాధారణ హత్య కేసు కాదు.

హార్లన్ మరణానికి ముందు జరిగిన ప్రతి చిన్న సంఘటనకు ఏదో ఒక లింక్ ఉంటుంది. ఎవరు నిజం చెబుతున్నారు ? ఎవరు అబద్ధం చెబుతున్నారు ? హార్లన్ చివరి రోజుల్లో ఏం జరిగింది ? అతని మరణం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి ? ఇలాఅ చివరి వరకు అనుమానాలను పెంచుతూ వెళ్లే ఈ కథలో అసలు హంతకుడు ఎవరో తెలుసుకోవడమే ప్రధాన థ్రిల్.

తెలుగులో అందుబాటులో ఉందా?

Advertisement

రియాన్ జాన్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డేనియల్ క్రేగ్, క్రిస్ ఎవాన్స్, అనా డి ఆర్మాస్, జామీ లీ కర్టిస్, టోనీ కొల్లెట్, మైఖేల్ షానన్, డాన్ జాన్సన్, క్రిస్టోఫర్ ప్లమ్మర్ తదితరులు నటించారు. సినిమా రన్‌టైమ్ సుమారు 2 గంటల 10 నిమిషాలు. 2019లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుని, సుమారు 312.9 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. అంటే 2600 కోట్లు అన్నమాట. ప్రస్తుతం IMDbలో 7.9 రేటింగ్‌తో కొనసాగుతోంది. ప్రస్తుతం భారత్‌లో Amazon Prime Videoలో అందుబాటులో ఉంది. కానీ తెలుగు వెర్షన్ మాత్రం అందుబాటులో లేదు. మర్డర్ మిస్టరీ, డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్, ఫ్యామిలీ సీక్రెట్స్, ఊహించని ట్విస్టులు ఉన్న ఈ మూవీ ఇప్పటికీ తప్పకుండా చూడాల్సిన క్లాసిక్ మిస్టరీ థ్రిల్లర్.

Read Also: నామోషీగా భావిస్తే జీవితం నాశనమే… గ్రౌండ్‌లో చెమట కాదు రక్తం చిందేలా పోరాటం

Related News

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

కాలేజీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ కలకలం… గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీతో అడ్డం తిరిగే కథ… క్రైమ్‌, కామెడీ కలిసిన మలయాళ మూవీ

జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

Big Stories

Advertisement
×