E-Paper
Advertisement

Thalaivar173: షాకింగ్ ట్విస్ట్.. రజిని సినిమా నుంచి తప్పుకున్న డైరెక్టర్ సుందర్ ..ఏమైందంటే?

Thalaivar173: షాకింగ్ ట్విస్ట్.. రజిని సినిమా నుంచి తప్పుకున్న డైరెక్టర్ సుందర్ ..ఏమైందంటే?
Advertisement

Thalaivar 173: ఇటీవల కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి బిగ్ అనౌన్స్మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. గత కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న రజనీకాంత్(Rajinikanth) కమల్ హాసన్(Kamal Hassan) కాంబినేషన్లో సినిమా రాబోతోందని గత కొద్దిరోజులుగా వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలు నిజమేనంటూ చిత్రబృందం అధికారకంగా వెల్లడించారు. రజనీకాంత్ తన 173 వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాని ప్రముఖ నటుడు కమల్ హాసన్ తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మించబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఇక ఈ సినిమాకు సుందర్ సి(Sundar.c) దర్శకుడిగా వ్యవహరించబోతున్నారని తెలియజేశారు.

వ్యక్తిగత విషయాలే కారణమా?

ఇలా తలైవర్ 173 (Thailavar 173)సినిమాని అధికారకంగా ప్రకటించిన నేపథ్యంలో రజనీకాంత్ కమల్ హాసన్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకుంటుందని అందరూ భావిస్తున్న నేపథ్యంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఈ సినిమా నుంచి డైరెక్టర్ సుందర్ తప్పుకున్న నేపథ్యంలో ఈయన అధికారకంగా వెల్లడించారు. ఇలా సినిమా షూటింగ్ మొదలవ్వకుండానే అంతరాయాలు ఏర్పడటంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే సినిమా ప్రకటించిన వారంలోగా డైరెక్టర్ ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి గల కారణాలు ఏంటి అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే సుందర్ పూర్తిగా తన వ్యక్తిగత, అనివార్య కారణాల వల్లనే ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు.

తదుపరి డైరెక్టర్ ఎవరు?

Advertisement

ఇలా సుందర్ చిత్ర బృందానికి ఊహించని షాక్ ఇచ్చారనే చెప్పాలి. ఇక ఈయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో మరి ఈ బిగ్ ప్రాజెక్ట్ ఎవరు హ్యాండిల్ చేయబోతున్నారు. తదుపరి డైరెక్టర్ ఎవరు అనే విషయాలు తెలియాల్సి ఉంది. నటుడు రజనీకాంత్ ఇటీవల లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటించిన కూలీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా విడుదలకు ముందు భారీ స్థాయిలో అంచనాలు ఉండేది కానీ విడుదలైన తర్వాత ప్రేక్షకుల అంచనాలను చేరుకోవడంలో పూర్తిగా విఫలమైంది.

Advertisement

ఈ సినిమా తర్వాత రజనీకాంత్ కమల్ హాసన్ నిర్మాణంలో మరో ప్రాజెక్టును ప్రకటించారు అయితే ప్రస్తుతం రజనీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న జైలర్ 2 సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకోనుంది. ఇక ఈ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ తో మరో సినిమాకు రజనీకాంత్ కమిట్ అవుతారంటూ వార్తలు వచ్చాయి కానీ లోకేష్ యాక్షన్ కథను నేరేట్ చేయడంతో అది నచ్చని రజినీకాంత్ కమల్ హాసన్ నిర్మాణంలో సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ సినిమా ప్రకటించిన కొద్ది రోజులకే ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటుండడంతో అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమాకు తదుపరి ఎవరు దర్శకత్వం వహించబోతున్నారు అనే విషయాలు తెలియాలి అంటే చిత్ర బృందం స్పందించాల్సి ఉంది.

Also Read: James cameron: గ్లోబ్ ట్రాటర్ .. చీఫ్ గెస్ట్ గా హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ ..

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×