James Cameron -SSMB 29: టాలీవుడ్ దర్శక ధీరుడు రుడు ఎస్ఎస్ రాజమౌళి(S.S.Rajamouli) ప్రస్తుతం మహేష్ బాబు(Mahesh Babu) సినిమా పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇకపోతే ఈ సినిమా టైటిల్ గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి. అయితే ఈ వార్తలకు పులిస్టాప్ పెట్టడం కోసం రాజమౌళి ఒక బిగ్ ఈవెంట్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. గ్లోబ్ ట్రాటర్(Glob Trotter) పేరుతో ఈ వేడుక ఎంతో ఘనంగా జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతున్నాయి.
ఇక ఈ కార్యక్రమానికి హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్(James Cameron) రాబోతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. టాలీవుడ్ సినిమా కోసం హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రావడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఈయన చేతుల మీదగానే ఈ సినిమా టైటిల్ కూడా రివీల్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన వరుస అప్డేట్స్ రాజమౌళి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదివరకే పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఇటీవల ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో నటించబోతోందంటూ ఆమె పాత్రకు సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేశారు.
చీర కట్టులో చేతిలో గన్ పట్టుకొని జేమ్స్ బాండ్ తరహాలో ఉన్నటువంటి ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ ఈవెంట్ లో భాగంగా మహేష్ బాబు పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమం నవంబర్ 15వ తేదీ సాయంత్రం 6 గంటలకు రామోజీ ఫిలిం సిటీలో ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది . ఇక ఈ కార్యక్రమం గురించి రాజమౌళి తాజాగా ఒక వీడియోని కూడా విడుదల చేశారు. కేవలం పాస్ ఉన్నవారికి మాత్రమే లోపలికి అనుమతి ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా ఈ వేడుకలో జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు.
జియో హాట్ స్టార్ కు స్ట్రీమింగ్ రైట్స్..
ఇక ఈ కార్యక్రమానికి మీడియాకు కూడా అనుమతి లేదనే సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈవెంట్ స్ట్రీమింగ్ హక్కులు జియో హాట్ స్టార్ కైవసం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమా ఒక అడ్వెంచరస్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి గ్లోబ్ ట్రాటర్ థీమ్ సాంగ్ విడుదల చేస్తూ రాజమౌళి మహేష్ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. సంచారి అంటూ సాగిపోయే ఈ పాటను శృతిహాసన్ ఆలపించడంతో ఈ పాట సోషల్ మీడియా ట్రెండింగ్ ఉంది. కేవలం ఒక్క ఈవెంట్ తోనే రాజమౌళి ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేశారు. ఇక ఈ సినిమాకు “వారణాసి” లేదా “సంచారి” అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై నవంబర్ 15వ తేదీ క్లారిటీ రానుంది.
Also Read: Peddi Movie: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్… తృట్టిలో తప్పించుకున్న పెద్ది టీం..