Road Accident: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టడంతో.. ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. ఆత్మకూరు నుంచి హనుమకొండ వైపు వెళ్తున్న ఓ కారులో.. నలుగురు యువకులు ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కారు అతివేగంతో వెళ్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టాడు. దీంతో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జు అయుంది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరి తీవ్ర గాయాలు అయ్యాయి.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. కారు అదుపు తప్పడానికి అతివేగమే కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఇదిలా ఉంటే.. పాత ఇంటి గోడ కూలి ఇద్దరు మృతి చెందారు. మరికొందరు శిథిలాల క్రింద చిక్కుకున్నారు. ఈ ఘటన మహబూబ్ నగర్ పాత బస్టాండ్ సమీపంలో చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు.