E-Paper
Advertisement

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!
Advertisement

Lucky Bhaskar 2: సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా మంచి సక్సెస్ అయ్యింది అంటే తదుపరి ఆ సినిమాకు సీక్వెల్ సినిమా రావటం ఇటీవల కాలంలో ఒక ఆనవాయితీగా మారిపోయింది. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాల సీక్వెల్ షూటింగ్ పనులు జరుగుతున్నాయి. ఇలా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సీక్వెల్ సినిమాలలో లక్కీ భాస్కర్ సీక్వెల్ (Lucky Bhaskar Sequel)కూడా ఒకటి. దర్శకుడు వెంకీ అట్లూరి(Venky Atluri) డైరెక్షన్ లో దుల్కర్ సల్మాన్(Dulquer Salman), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudary) జంటగా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

త్వరలోనే లక్కీ భాస్కర్ 2..

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో సీక్వెల్ సినిమా గురించి కూడా పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి అయితే ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని చిత్ర బృందం క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే తాజాగా డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమా సీక్వెల్ కి సంబంధించి మరొక బిగ్ అప్డేట్ వెల్లడించారు. దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఐయామ్ గేమ్’ (I’m Game) ప్రమోషన్లలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ వెంకీ అట్లూరితో కలిసి ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు.

భాస్కర్ గానే గుర్తు పడుతున్నారు..

Advertisement

ఈ ఇంటర్వ్యూలో భాగంగా ‘ఐయామ్ గేమ్’ సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలను ముచ్చటించారు అనంతరం డైరెక్టర్ వెంకీ అట్లూరి మాట్లాడుతూ అతి త్వరలోనే లక్కీ భాస్కర్ 2 షూటింగ్ ప్రారంభం కాబోతుందని ఈ విషయంలో తాను ప్రామిస్ చేస్తున్నాను అంటూ తెలియచేశారు. తాను కూడా ఈ సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని దుల్కర్ సల్మాన్ తెలియజేశారు. లక్కీ భాస్కర్ సినిమా చేసిన తర్వాత తాను బాంగ్లాదేశ్, జపాన్, టిబెట్ వంటి ప్రాంతాలకు వెళ్లిన అక్కడ నన్ను చూసి వెంటనే మొబైల్ తీసి లక్కీ భాస్కర్ సినిమా గురించి సెర్చ్ చేసి భాస్కర్ మీరే కదా అంటూ అడుగుతున్నారని దుల్కర్ తెలిపారు.

Advertisement

లక్కీ భాస్కర్ 2 సినిమా కోసం ఎదురు చూస్తున్నానని దుల్కర్ తెలియజేశారు అయితే ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ పూర్తి అవగానే లక్కీ భాస్కర్ 2 పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దుల్కర్ నటించిన ఐయామ్ గేమ్ సినిమా సెప్టెంబర్ 3 వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. ఇక వెంకీ అట్లూరి విషయానికి వస్తే ఇటీవల ఈయన హీరో సూర్యతో కలిసి విశ్వనాథ్ అండ్ సన్స్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే.

Also Read: రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

Related News

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

సాహో ప్రపంచంలోకి ఓజీ..? ఏం ప్లాన్ చేస్తున్నావ్ సుజిత్ ?

మీరే నాకు స్ఫూర్తి… బాబాయ్ కు అబ్బాయ్ విషెస్!

ఒంటిమీద బట్టలు లాగేసి ఘోరంగా అవమానించారు – స్టార్ కమెడియన్ ఎమోషనల్!

Big Stories

Advertisement
×