E-Paper
Advertisement

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్
Advertisement

Dark Comedy Crime Thriller on OTT : డివోర్స్ తర్వాత తన జీవితాన్ని మళ్లీ సెట్ చేసుకోవాలని చూస్తున్న తల్లి… ఓ రాత్రి ఆన్‌లైన్‌లో ఓ హింసాత్మక ఘటనను ప్రత్యక్షంగా చూసేస్తే ? అది ఓ నేరాన్ని చూడడంతో ఆగకుండా, బ్లాక్‌మెయిల్, మర్డర్, సీక్రెట్స్, యూత్ సాకర్ ప్రపంచంలోకి ఆమెను లాగితే ? తన కస్టడీ సమస్యలు, వ్యక్తిగత గందరగోళం మధ్య అసలు నిజాన్ని తెలుసుకోవడానికి ఆమె స్వయంగా ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే ? ఇలాంటి డార్క్ కామెడీ, క్రైమ్, థ్రిల్, ఎమోషన్ కలిసిన సిరీస్ Maximum Pleasure Guaranteed. ఆన్‌లైన్‌ లో చూసిన ఆ ఘటన వెనుక ఎవరు ఉన్నారు ? పాలాను ఎందుకు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు ? ఈ గేమ్‌ లో ఆమె కుటుంబం ఎలా చిక్కుకుంది ? అనే స్టోరీపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

పౌలా సాండర్స్ కొత్తగా విడాకులు తీసుకున్న తల్లి. తన కూతురి కస్టడీ విషయంలో మాజీ భర్త కార్ల్‌ తో సమస్యలు ఎదుర్కొంటూనే, తన జీవితానికి కొత్త అర్థం వెతుక్కుంటుంది. అదే సమయంలో ఆమె ఓ ఆన్‌లైన్ క్యామ్‌ బాయ్‌ తో సన్నిహితంగా మాట్లాడుతుంటుంది. ఒక రోజు ఆ ఆన్‌ లైన్ సెషన్‌ లో ఉండగానే పౌలా ఓ హింసాత్మక నేరాన్ని చూస్తుంది. మొదట అది తనకు సంబంధం లేని ఘటనలా అనిపించినా, ఆ దృశ్యం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది.

Advertisement

ఆ ఘటన తర్వాత పౌలా బ్లాక్‌మెయిల్‌ కు గురవుతుంది. ఎవరు తనను టార్గెట్ చేస్తున్నారో అర్థం కాకపోయినా, నిజం తెలుసుకోవాలనే పట్టుదలతో ఆమె స్వయంగా విచారణ మొదలు పెడుతుంది. ఆమె వ్యక్తిగత జీవితం, మాజీ భర్తతో ఉన్న సంబంధం, కూతురి కస్టడీ సమస్యలు కూడా ఈ ప్రమాదకరమైన గేమ్‌ లో భాగమవుతాయి. యూత్ సాకర్ ప్రపంచం కూడా కథలోకి వస్తుంది.

ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నది ఎవరు ? తాను చూసిన నేరం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి ? ఈ మొత్తం వ్యవహారానికి తన కుటుంబానికి ఉన్న సంబంధం ఏమిటి ? చివరికి పౌలా నిజాన్ని బయటపెట్టి తన కుటుంబాన్ని కాపాడుకోగలదా ? అనేదే సిరీస్‌ లో చూసి ఫీల్ అవ్వాల్సిన సీట్ ఎడ్జ్ థ్రిల్.

Advertisement

Also Read : కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

తెలుగులో స్ట్రీమింగ్ ?

డేవిడ్ జే. రోసెన్ రూపొందించిన ‘మ్యాగ్జిమమ్ ప్లెజర్ గ్యారంటీడ్’ లో టటియానా మస్లానీ, జేక్ జాన్సన్, డాలీ డి లియోన్, బ్రాండన్ ఫ్లిన్, ముర్రే బార్ట్లెట్, జెస్సీ హోడ్జెస్, చార్లీ హాల్ తదితరులు నటించారు. 10 ఎపిసోడ్ల ఈ డార్క్ కామెడీ థ్రిల్లర్ మే 20న Apple TVలో ప్రీమియర్ అయి, జూలై 15న సీజన్ 1 ముగిసింది. ఇది TV-MA రేటింగ్‌తో రూపొందిన అడల్ట్ కంటెంట్. బ్లాక్‌మెయిల్, క్రైమ్, లైంగిక అంశాలు, హింసతో కూడిన డార్క్ కామెడీ కావడంతో ఈ సిరీస్ పెద్దలకు మాత్రమే. క్రైమ్, డార్క్ కామెడీ, మైండ్ గేమ్స్, బోల్డ్ అడల్ట్ డ్రామా, వరుస ట్విస్టులు ఉన్న మంచి థ్రిల్లర్ కోసం వెతుకుతుంటే ఈ సిరీస్ బెస్ట్ ఆప్షన్.

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×