E-Paper
Advertisement

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?
Advertisement

అమెరికా, లండన్‌లో డాక్టర్ అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టం. రోగం వచ్చిన నెల, రెండు నెలల వరకు డాక్టర్ దర్శనం దొరకదు. అప్పటి వరకు వేచి చూడాల్సిన. ఒక వేళ డాక్టర్ అపాయిట్మెంట్ దొరికినా.. వారు చేసే ట్రీట్మెంట్‌కు వేసే బిల్లులు.. కొత్త రోగాలను సృష్టిస్తాయి. అందుకే, చాలామంది విదేశీయులు ఇండియాకు వచ్చే చికిత్స పొందుతూ ఉంటారు. అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పేందుకు తాజాగా ఓ ప్రవాస భారతీయుడు పోస్ట్ చేసిన ఈ వీడియోనే నిదర్శనం. అతడు పన్ను పీకించుకోడానికి డాక్టర్ వేసిన బిల్లుపై ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.

వామ్మో.. అంత బిల్లా?

నితిన్ మల్హోత్రా అమెరికాలో సుమారు 15 ఏళ్లుగా నివసిస్తున్నాడు. ఇటీవల అతడు తన పన్ను తీయించుకోవడం కోసం అమెరికాలో ఓ డాక్టర్‌ను సంప్రదించాడు. ఈ సందర్భంగా తనకు ఎదురైన అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. తన ఒక్క పన్ను తొలగించడం కోసం డాక్టర్ 2,500 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.2.37 లక్షలు) అవుతుందని చెప్పాడట. దీంతో షాకైన అతడు.. తన పదిహేనళ్ల అమెరికా అనుభవంలో ఎదుర్కొన్న చిత్రమైన పరిస్థితి ఇదేనంటూ ఓ రీల్ పోస్ట్ చేశాడు. అది కాస్త ఇప్పుడు వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇండియాలో రూ.15 వేలు నుంచి రూ.20 వేలకే..

Advertisement

అమెరికాలో ఒక పన్ను తీయించుకోడానికి రూ.2.37 లక్షలు పెట్టాల్సి వస్తుందని, అదే ఇండియాలో రూ.15 వేలు నుంచి రూ.20 వేలకే అయిపోతుందని నితిన్ పేర్కొన్నాడు. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. పాకిస్తాన్ వెళ్తే రూ.10కే పట్టకారుతో పీకి పన్ను చేతిలో పెడతారని కొందరు అంటుంటే.. తమ ఊర్లో రూ.500 ఫీజు చెల్లిస్తా చాలాని మరికొందరు అంటున్నారు. నాటు వైద్యంతో రూ.100కే పీకేస్తారని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇండియాలోని ఇతర నగరాల్లో రూ.3 వేలు నుంచి 4 వేలకే ప్రాసెస్ ఉంటుందని అంటున్నారు. అయితే, ఫిల్సింగ్, ఆర్టిఫిషికల్ టూత్ ఏర్పాటు కోసం అదనంగా చెల్లించాల్సి రావచ్చని అంటున్నారు.

https://www.instagram.com/reels/DcuYXYMseNe/

ఇండియాకే రావచ్చుగా..

Advertisement

అక్కడే ఉండి అంత చెల్లించే బదులు.. ఇండియా వచ్చి పీకించుకోవచ్చు కదా అని అనుకోవద్దు. ఇక్కడికి రానుపోను ఖర్చులు అందుకు రెట్టింపు అవుతాయి. అందుకే అమెరికాలో ఎంత ఖర్చయినా మౌనంగా భరించాలే. లేదా పక్కనే ఉన్న మెక్సికోకు అయినా వెళ్లాలి. అమెరికాతో పోల్చితే.. అక్కడ కూడా మెడికల్ ట్రీట్మెంట్ బిల్స్ తక్కువట. ఏది ఏమైనా ఇండియానే బెస్ట్ కదూ. ఇక్కడ దొరికే సౌకర్యాలు మరెక్కడా దొరకవు. అందుకే ఇండియాలో మెడికల్, వెల్‌నెస్ టూరిజానికి ఆధరణ పెరుగుతోంది.

Also Read: ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

Tags

Related News

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

ఉదయం ఫ్రెష్‌గా లేవాలంటే రాత్రి ఎప్పుడు పడుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు?

Big Stories

Advertisement
×