Idupu Kayitham Movie: నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘ఇడుపు కాయితం’ (Idupukayitham). ఈ సినిమా డిసెంబర్ 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.. వంశీ రెడ్డి దొండపాటి(Vamsi Reddy Dindapati) దర్శకత్వంలో బన్నీ వాసు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించడంతో ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా నుంచి ఇటీవల ఒక సాంగ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఇలా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఈ పాటలో భాగంగా ఒక పెళ్లిలో పెద్ద ఎత్తున మందు తాగడం గురించి కొన్ని సన్నివేశాలను చూపించారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ నేపథ్యంలో సినిమాలు చేయటం బానే ఉంది కానీ తెలంగాణ అంటేనే మందు తాగడం అనే విధంగా సినిమా చేయడం ఏంటి అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ సినిమా సాంగ్ విషయంలో ఎదురైనటువంటి ఈ విమర్శలపై తాజాగా దర్శకుడు వేణు ఊడుగుల స్పందిస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమాలోని పాటలో కొన్ని సన్నివేశాలపై విమర్శలు రావడంతో ఆ సన్నివేశాలు గురించి వేణు ఊడుగుల(Venu Udugula) మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి పట్ల సరైన అవగాహన లేకుండా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా విమర్శలు చేయటం సరైనది కాదని డైరెక్టర్ వేణు తెలిపారు. నిజ జీవితాలను తెలంగాణ మట్టి వాసనను తెరపైకి తీసుకువచ్చే ఇలాంటి సినిమాలను ప్రోత్సహిస్తూ వాటికి అండగా నిలవాలని ఈయన కోరారు.ఒక సమాజపు సంస్కృతిని దాని ప్లేట్లలో, గ్లాసుల్లో వెతకకండి. దాని చరిత్రలో, శ్రమలో, కళల్లో, పోరాటాల్లో వెతకండి.
ఒక సమాజపు సంస్కృతిని దాని ప్లేట్లలో, గ్లాసుల్లో వెతకకండి. దాని చరిత్రలో, శ్రమలో, కళల్లో, పోరాటాల్లో వెతకండి. తెలంగాణను కించపరచడం సులువు. అర్థం చేసుకోవడానికి సంస్కారం, అధ్యయనం కావాలి. మన జీవితాల్ని, సంస్కృతుల్ని నిజాయితీగా తెరమీదకు తీసుకొచ్చే ఇడుపు కాయితం లాంటి సినిమాలను… pic.twitter.com/gBHXCeClK2
— v e n u u d u g u l a (@venuudugulafilm) October 25, 2026
తెలంగాణను కించపరచడం సులువు. అర్థం చేసుకోవడానికి సంస్కారం, అధ్యయనం కావాలి. మన జీవితాల్ని, సంస్కృతుల్ని నిజాయితీగా తెరమీదకు తీసుకొచ్చే ఇడుపు కాయితం లాంటి సినిమాలను ఆదరిద్దాం.సినిమా రిలీజ్ అయ్యాక నచ్చకపోతే విమర్శించండి. కానీ ఒక ప్రాంతపు అస్తిత్వాన్ని మీ అజ్ఞానంతో నిర్వచించకండి అంటూ ఈయన ఈ పాటపై విమర్శలు చేస్తున్న వారికి తనదైన శైలిలోనే కౌంటర్ ఇస్తూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించగా తెలంగాణ ఫోక్ డాన్సర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నాగదుర్గ హీరోయిన్ గా పరిచయం కాబోతున్నారు. ఇక ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. గతంలో ఈ సినిమా టైటిల్ కి సంబంధించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చలు జరిగిన సంగతి తెలిసిందే.
Also Read: అన్ స్టాపబుల్ సీజన్ 5 ప్రారంభం.. పస్ట్ గెస్ట్ గా మెగాస్టార్?