E-Paper
Advertisement

అన్ స్టాపబుల్ సీజన్ 5 ప్రారంభం.. పస్ట్ గెస్ట్ గా మెగాస్టార్?

అన్ స్టాపబుల్ సీజన్ 5 ప్రారంభం.. పస్ట్ గెస్ట్ గా మెగాస్టార్?
Advertisement

Unstoppable Season 5: నందమూరి బాలకృష్ణ సినీ నటుడిగా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈయన హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే బాలకృష్ణ హీరోగా మాత్రమే కాదు వ్యాఖ్యాతగా కూడా సూపర్ సక్సెస్ అందుకున్నారు. బాలకృష్ణ హోస్ట్ గా ఆహా(Aha) వేదికగా అన్ స్టాపబుల్(Unstoppable) అనే కార్యక్రమం ప్రసారమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాకుండా నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

అన్ స్టాపబుల్ సీజన్ 5..

ఇలా బాలకృష్ణ (Balakrishna)అన్ స్టాపబుల్ షో మంచి సక్సెస్ కావడంతో ఇతర ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో కూడా ఈ తరహా టాక్ షో లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో కూడా చిరంజీవి హోస్ట్ గా ఒక టాక్ షో రాబోతోంది అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఈ టాక్ షో గురించి ఎక్కడ అధికారక ప్రకటన వెలువబడలేదు. తాజాగా బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 5 కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటివరకు నాలుగు సీజన్లను ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షోలో సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా పాల్గొని సందడి చేశారు.

సీజన్ 5 ఫస్ట్ గెస్ట్ గా చిరు..

Advertisement

ఇలా నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తి కావడంతో మేకర్స్ ఐదవ సీజన్ ప్రసారానికి ఏర్పాటు సిద్ధం చేస్తున్నారు. ఈ మంగళవారం నుంచి సీజన్ 5 కి సంబంధించిన షూటింగ్ జరగబోతుందని సమాచారం. సీజన్ 5 ఫస్ట్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హాజరు కాబోతున్నారని ఇలా వీరిద్దరి కాంబోలో ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేలా బి.ఎస్ రవి ప్లాన్ చేశారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటివరకు ఐదు సీజన్లు పూర్తి అయినప్పటికీ చిరంజీవి మాత్రం ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. చిరంజీవి ఎపిసోడ్ కోసం అభిమానులందరూ కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఓకే వేదికపై బాలయ్య చిరు..

ఇలా బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో చిరంజీవి ఇప్పటివరకు సందడి చేయకపోవడంతో మెగా అభిమానులలో చిన్న నిరాశ ఉండేది కానీ సీజన్ 5 తో మెగా ఫాన్స్ కోరిక కూడా నెరవేరబోతుందని తెలుస్తుంది. మరి ఇదే కనుక నిజమైతే బాలకృష్ణ చిరంజీవి ఏ తరహా ప్రశ్నలు అడగబోతున్నారు అంటూ ఈ ఎపిసోడ్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ అన్ స్టాపబుల్ షో లో ఇప్పటివరకు ఎన్టీఆర్ కూడా హాజరు కాలేదు. బహుషా బాలకృష్ణ ఎన్టీఆర్ మధ్య ఉన్న విభేదాల కారణంగానే ఎన్టీఆర్ ఈ టాక్ షోకు దూరంగా ఉన్నారని తెలుస్తుంది. ఇక త్వరలోనే ఈ కార్యక్రమం సీజన్ ఫైవ్ కి సంబంధించి మరిన్ని వివరాలను ఆహా అధికారికంగా తెలియజేయబోతున్నారు.

Advertisement

Also Read: కృష్ణ మరణం మహేష్, నరేష్ మధ్య విభేదాలు.. నటుడు క్లారిటీ!

Related News

‘ఇరుముడి’ సక్సెస్… తల్లికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన మణెమ్మ..

ఇడుపు కాయితం పాట పై ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్!

ఘనంగా అర్జున్ చిన్న కూతురు పెళ్లి.. ఫోటోలు వైరల్!

కృష్ణ మరణం మహేష్, నరేష్ మధ్య విభేదాలు.. నటుడు క్లారిటీ!

రాజమౌళి నుంచి త్రివిక్రమ్ వరకు.. తనికెళ్ల భరణి చెప్పిన ఆసక్తికర విషయాలు!

రష్మికను అన్ ఫాలో చేసిన విజయ్ దేవరకొండ…తెర పైకి విడాకుల వార్తలు?

నాని ది ప్యారడైజ్ మూవీకి మహేష్ కొడుకు గౌతమ్ రేటింగ్..ఇంత దారుణమా?

Big Stories

Advertisement
×