Bandari Poojitha:బండారి పూజిత ..సోషల్ మీడియాలో తనదైన ప్రాంక్స్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనింగ్ వీడియోస్ తో అలరిస్తున్న ఈ అమ్మాయి గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. బండారి పూజిత అఫీషియల్ అనే చానెల్ ని ఇప్పటి వరకు 2 మిలియన్లకి పైగా సబ్ స్క్రైబర్స్ పైగా ఫాలో అవుతున్నారంటే ఈ అమ్మాయికి ఎంతగా ఫాలోయింగ్ ఉందొ అర్థం చేసుకోవచ్చు.ఇక పూజితతో పాటు తన చెల్లి అక్షిత కూడా ఈ వీడియోలలో కనిపిస్తూ ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తుంది ,మరి నెట్టింట్లో ఇంత క్రేజ్ ఉన్న బండారి పూజిత అసలు నెలకి ఎంత సంపాదిస్తుందో ఒక సారి చూద్దాం.
చానల్ ద్వారా నెలకి 3 నుండి 4 లక్షల వరకు
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజిత, అక్షితలు మాట్లాడుతూ తాము చానల్ ద్వారా నెలకి 3 నుండి 4 లక్షల వరకు సంపాదిస్తున్నామని చెప్పడంతో షాక్ అవుతున్నారు నెటిజన్లు. ఎదో మాములుగా వీడియోలు తీస్తున్న అమ్మాయిలు ఒక కార్పోరేట్ ఎగ్జిక్యూటివ్ కి ఎక్కడా తగ్గకుండా ఈ రేంజ్ లో సపాదించడం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.అయితే వీళ్ళు రోజూ పడుతున్న కష్టానికి ఆ మాత్రం ప్రతిఫలం రావడంలో తప్పేమీ లేదు,దానికి వాళ్ళు అర్హులు కూడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
చిన్న స్మార్ట్ ఫోన్ తోనే వీడియోలు
బండారి పూజిత విషయానికి వస్తే తనకి చిన్నప్పటి నుండే వీడియోలు తీయడం,డాన్స్ లు చేయడం చాల ఇష్టమట. ఇక ఆమె ఇష్టాన్ని గమనించిన అన్న రాకేశ్ ఆమెని ఎంకరేజ్ చేయడంతో చిన్నగా యూట్యూబ్ ఛానెల్ పెట్టింది.అయితే మొదట్లో తన వద్ద ఎక్కువ సౌకర్యాలు ఏమీ లేకపోయినా ఉన్న చిన్న స్మార్ట్ ఫోన్ తోనే వీడియోలు తీయడం మెచ్చుకోవాల్సిన విషయం.
ఎక్కువగా పేరు తీసుకొచ్చిన డైలాగ్
ఇక మొదట్లో ఎక్కువగా రంగోలి డిజైన్స్ వీడియోలు పెడుతూ వచ్చిన పూజిత తర్వాత క్రమంగా డాన్స్ అలాగే ఫ్యామిలీ ఎంటర్ టైనింగ్ వీడియోలు పెడుతూ ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే ప్రయత్నం చేసింది.ఇక అది కాస్త పికప్ కాగానే బండారి పూజిత అఫీషియల్ అనే చానెల్ ని పెట్టింది పూజిత. ఇక పూజితకి ఎక్కువగా పేరు తీసుకొచ్చిన డైలాగ్ ఏదైనా ఉందటే అది కరోనా టైంలో కేసీఆర్ మీద చేసిన సర్ది డైలాగ్ వీడియోనే.ఇక అలా కొంచెం కొంచెం పాపులర్ అయిన పూజిత మెల్లిగా కుకింగ్ చేసే వీడియోలు , తన డాన్స్ వీడియోలతో ఆడియన్స్ ని అలరించింది.
అయితే తానూ మొదట్లో బాగా లావుగా ఉండటంతో తానూ చేసిన వీడియోలకి నెగెటివ్ కామెంట్స్ రావడంతో ఫీల్ అయ్యి కొన్ని రోజులు తన యూట్యూబ్ చానెల్ ని ఆపెసిందట పూజిత.ఇక మళ్ళీ కష్టపడి డైట్ చేసి సన్నగా అవడంతో తిరిగి మళ్ళీ వీడియోలు చేయడం మొదలుపెట్టింది.
ఒక డూప్లెక్స్ ఇల్లు కొని
ఇక తన తండ్రి టైలర్ కావడంటం తో చాలా కష్టాలు పడ్డాడట.ముఖ్యంగా పండగ పూట మాత్రమే బట్టలు కొనేవాడట.అది కూడా కుదిరితేనే.అయితే ఎన్ని కష్టాలు పడ్డా ఎక్కడా తన పిల్లలకి లోటులేకుండా పెంచడం విశేషం.ఇక తన తండ్రికి బీపీ షుగర్ ఉన్నాయని ,తన తల్లి బాగా ఉండాలని కోరుకుంటున్నామని ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.అంతేకాకుండా తనకి ఒక డూప్లెక్స్ ఇల్లు కొని తన ఫాదర్ ని అందులో కూర్చుబెట్టాలి అనే కల ఉందని,అది త్వరలోనే తీరాలని కోరుకుంటున్నాని చెప్పింది.ఏది ఏమైనా చిన్నగా మొదలైన పూజిత,అక్షితల ప్రయాణం ఇపుడు నెలకి 4 లక్షల రూపాయలు సంపాదించే వరకు చేరిందంటే వీరిద్దరు ఎంతో మందికి ఆదర్శమని చెప్పక తప్పదు.
ALSO READ :ఒక్క పాటతో ఓవర్‌నైట్ క్రేజ్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోక్ సాంగ్స్!