Shivaji-Sanjana: నటుడు శివాజీ ప్రస్తుతం ఏ రేంజ్ లో హాట్ టాపిక్ అయ్యాడో తెలిసింది. గత కొన్ని రోజులుగా ఆయన పేరు మీడియా, సోషల్ మీడియాలో మారుమ్రోగుతుంది. హీరోయిన్ల డ్రెస్సింగ్పై ఆయన చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. తన తప్పిదానికి శివాజీ క్షమాపణలు చెప్పారు. అయినా ఈ వివాదం ఆగడం లేదు. క్షమాపణలు చెబుతూనే.. తన కామెంట్స్పై రియాక్ట్ అయిన అనసూయాకు చురకలు అట్టించాడు. ఇది కాస్తా చిలికిచిలికి గానవానగా మారింది. ఈ వివాదంపై అనసూయ వరుస పోస్ట్స్ చేస్తుంది. మరోవైపు శివాజీపై లీగన్ యాక్షన్ రెడీ అయ్యింది.
ఇప్పటికే వస్త్రాధారణపై కామెంట్స్ చేసి వివాదంలో నిలిచిన శివాజీ మరోసారి తన నోటివాటం చూపించాడు. బిగ్ బాస్ బజ్ లో సంజనని ఆంటీ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇంతకి అసలేం జరిగిందంటే.. నటుడు శివాజీ బిగ్ బాస్ 9 సీజన్ బజ్‌కి హోస్ట్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. బజ్ ఇంటర్య్వూలో కంటెస్టెంట్స్ ప్లస్, మైనస్లపై బల్లగుద్దినట్టుగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా వారి తప్పులపై నిక్కచ్చిగా మాట్లాడుతూ.. వారికి చుక్కలు చూపిస్తున్నాడు. ఇక టాప్ 5 కంటెస్టెంట్స్ అంత ఒకేరోజు బయటకు రావడం వారి బజ్ ఇంటర్య్వూలో ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు.
ఇప్పటికే విన్నర్ కళ్యాణ్, రన్నర్ తనూజ, టాప్ 3 డిమోన్ పవన్, టాప్ 4 ఇమ్మాన్యుయేల్‌ల బజ్ ఇంటర్య్వూ ఫుల్ వీడియో వచ్చేసింది. తాజాగా సంజనకి సంబంధించిన బజ్ ఇంటర్య్వూ ప్రొమోను విడుదల చేశారు. ఇందులో సంజనకి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. వచ్చిరాగానే ఆంటీ అంటూ సంజనాకి షాకిచ్చాడు. బిగ్ బాస్ చరిత్రలో ఏ ఆంటీ కూడాటాప్ 5 వరకు రాలేదు. అసలు మీరు ఊహించారా? అని ప్రశ్నించాడు. దీనికి సంజన అవును.. ఉంటాను అనుకున్న అని కాన్ఫిడెన్స్గా చెప్పింది. అసలేంటీ మీ కాన్పిడెన్స్ అనగానే.. నేను రాగానే 100 డ్రెస్లు ప్యాక్ చేసుకున్న అని చెప్పి శివాజీ షాకిచ్చింది.
ఆ తర్వాత సెఫ్ గేమ్, సెంటరాఫ్ అట్రాక్షన్ అవ్వాలనే కమెడియన్ మీ పక్కన పెట్టుకున్నారా? అని ప్రశ్నించగా.. సంజన షాకింగ్ గా చూసింది. ఆ తర్వాత హౌజ్లో తన హార్ట్ గెలిచినవాళ్లు.. హార్ట్ బ్రేక్ చేసినవాళ్లేవరంటూ పజిల్ పెట్టాడు. హౌజ్లోకి రావడానికి.. బయట తనపై నిందపడటానికి రెండింటికి లింక్ ఏంటి? అని శివాజీ ప్రశ్నించాడు. దీనికి ఆమె.. రేపు నా పిల్లలు స్కూల్ వెళ్లితే.. వాళ్ల తల్లిపేరు చెబితే.. 2020లో ఓ మిస్టేక్ చేసిన ఆమెనా అనకూడదు.. తెలుగు బిస్ బాస్ 9 సీజన్లో టాప్ 5 ఉంది.. ఆ సంజనా మీ అమ్మ అనాలి అంటూ ఆమె ఎమోషనల్ అయ్యింది. ఇక చివరిగా.. నువ్వు గ్రేట్ మదర్ అంటూ సంజనాకి కితాబిచ్చాడు శివాజీ.