E-Paper
Advertisement

Hyundai Discounts: హ్యుందాయ్ మార్చి డిస్కౌంట్స్, ఆ కారుపై ఏకంగా రూ.95 వేల బెనిఫిట్స్!

Hyundai Discounts: హ్యుందాయ్ మార్చి డిస్కౌంట్స్, ఆ కారుపై ఏకంగా రూ.95 వేల బెనిఫిట్స్!

Hyundai Discounts March 2026: హ్యుందాయ్ మోటార్ ఇండియా మార్చి 2026కు సంబంధించి అదిరిపోయే తగ్గింపులు అందుబాటులోకి తీసుకొచ్చింది. క్రెటా ఎన్ లైన్,  ఐయోనిక్ 5 మినహా, ఈ నెలలో అన్ని కార్ల మీద తగ్గింపులను ప్రకటించింది. రూ.5,000 నుంచి రూ.95,000 వరకు బెనిఫిట్స్ ను అందిస్తుంది. మోడల్‌ మీద ఆధారపడి, క్యాష్ డిస్కౌంట్, నవరాత్రి బుకింగ్ డిస్కౌంట్,  స్క్రాపేజ్, అప్‌ గ్రేడ్ బోనస్ తో పాటు ప్రైడ్ ఆఫ్ ఇండియా ఆఫర్ ను అందిస్తుంది.

⦿ హ్యుందాయ్ వెర్నా: రూ.95,000 వరకు

హ్యుందాయ్ వెర్నాపై అత్యధికంగా రూ.95,000 వరకు బెనిఫిట్స్ అందిసతుదంఇ. ఆఫర్లలో రూ.40,000 క్యాష్ డిస్కౌంట్, రూ.10,000 నవరాత్రి బుకింగ్ బోనస్, రూ.35,000 స్క్రాపేజ్ బోనస్, ప్రైడ్ ఆఫ్ ఇండియా పథకం కింద అదనంగా రూ.10,000 తగ్గింపు అందిస్తుంది. ఈ కారు ధర రూ. 10.80 లక్షల నుంచి రూ. 17.13 లక్షల మధ్య ఉంటుంది.

⦿ హ్యుందాయ్ అల్కాజార్: రూ. 70,000 వరకు

మార్చిలో హ్యుందాయ్ అల్కాజార్ మొత్తం రూ. 70,000 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో రూ. 30,000 నగదు తగ్గింపు, రూ. 10,000 నవరాత్రి బుకింగ్ బోనస్, రూ. 30,000 స్క్రాపేజ్ బోనస్ ఉన్నాయి.  అల్కాజార్ ధర రూ. 14.50 లక్షల నుంచి రూ. 21.21 లక్షల వరకు ఉంటుంది.

⦿ హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్: రూ. 55,000 వరకు

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌ను తీసుకునే కొనుగోలుదారులు రూ. 15,000 నగదు తగ్గింపు, రూ. 10,000 నవరాత్రి బుకింగ్ బోనస్, రూ. 30,000 అప్‌గ్రేడ్ డిస్కౌంట్‌తో సహా మొత్తం రూ. 55,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఈ కారు ధర రూ. 18.02 లక్షల నుంచి ప్రారంభమై రూ. 24.70 లక్షల వరకు ఉంటుంది.

⦿ హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్: రూ. 53,000 వరకు

హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్‌ పై  రూ. 53,000 వరకు తగ్గింపు లభిస్తుంది. రూ. 20,000 నగదు తగ్గింపు, రూ. 10,000 నవరాత్రి బుకింగ్ బోనస్, రూ. 20,000 స్క్రాపేజ్ బోనస్, ప్రైడ్ ఆఫ్ ఇండియా పథకం కింద అదనంగా రూ. 3,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ కారు ధర రూ. 5.55 లక్షల నుండి రూ. 7.92 లక్షల వరకు ఉంది.

⦿ హ్యుందాయ్ i20, i20 N లైన్: రూ. 48,000 వరకు

హ్యుందాయ్ i20, i20 N లైన్ రెండూ రూ. 48,000 వరకు తగ్గింపులు అందుకుంటున్నాయి. వీటిలో రూ. 15,000 నగదు తగ్గింపు, రూ. 10,000 నవరాత్రి బుకింగ్ బోనస్, రూ. 20,000 స్క్రాపేజ్ బోనస్, ప్రైడ్ ఆఫ్ ఇండియా పథకం కింద రూ. 3,000 తగ్గింపు లభిస్తుంది.

⦿హ్యుందాయ్ ఎక్స్‌ టర్: రూ.43,000 వరకు

హ్యుందాయ్ ఎక్స్‌ టర్ మొత్తం రూ.43,000 వరకు తగ్గింపును అందుకుంటుంది. వీటిలో రూ.15,000 నగదు తగ్గింపు, రూ.10,000 నవరాత్రి బుకింగ్ బోనస్, రూ.15,000 స్క్రాపేజ్ బోనస్, ప్రైడ్ ఆఫ్ ఇండియా పథకం కింద రూ.3,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఎక్స్‌ టర్ ధరలు రూ.5.74 లక్షల నుంచిప్రారంభమై రూ.9.61 లక్షల వరకు ఉంటాయి.

ఇక హ్యుందాయ్ క్రెటాపై రూ. 40,000, హ్యుందాయ్ ఆరాపై రూ. 10,000, హ్యుందాయ్ వెన్యూ, వెన్యూ N లైన్ పై రూ. 5,000 వరకు తగ్గింపును అందిస్తుంది.

Read Also: చేతులు కలిపిన సుజుకి మోటార్ సైకిల్ ఇండియా, రాయల్ బ్రదర్స్‌.. ప్లాన్ మామూలుగా లేదుగా!

Related News

కొత్త కారు కంటే పాత SUVలకే ఎక్కువ క్రేజ్.. భారత మార్కెట్లో కొత్త ట్రెండ్!

జూపిటర్ CNG To అపాచీ RR 450.. టీవీఎస్ నుంచి రాబోతున్న క్రేజీ మోడల్స్ ఇవే!

స్పీడ్‌ తో పాటు సేఫ్టీ కూడా కావాలా? అయితే ఈ కారు మీ కోసమే!

ఇది స్కూటరా? లేక టూరింగ్ మెషీనా? ప్రత్యేకతలు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

సిటీ రోడ్లకు పర్ఫెక్ట్ ఆటోమేటిక్ SUVలు ఇవే.. కొనేముందు ఈ లిస్ట్ చూడండి!

246 కి.మీ రేంజ్‌ తో కొత్త సిట్రోయెన్ eC3 ఫేస్‌లిఫ్ట్.. ఫీచర్లు చూస్తే అదిరిపోవాల్సిందే!

టాటా ఈవీలకు చైనా టెక్నాలజీ.. ఇండియన్ ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్‌ షేకవ్వక తప్పదా?

భారత ఆటో రంగంలో సరికొత్త అధ్యాయం.. ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాగన్ ఆర్ విడుదల!

Big Stories

×