E-Paper
Advertisement

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు
Advertisement

Divyavani:దివ్యవాణి.. ‘పెళ్లి పుస్తకం’ సినిమాతో తెలుగు ఆడియన్స్ గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్న ఈ వెటరన్ బ్యూటీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్ లో ఎదురైన కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. సినిమా షూటింగ్స్ సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మాట్లాడుతూ అప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా దర్శకుడు దాసరి నారాయణరావు గారి సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటన గురించి ఆమె చెప్పిన విషయాలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

తన కెరీర్ మొదట్లో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నానని, దాసరి నారాయణరావు గారి సినిమా షూటింగ్ కోసం ఉదయం 7 గంటలకే రావాలని చెప్పడంతో ఆమె పొద్దున్నే లేచి రెడీ అయ్యానని, కానీ అసలు ఆ టైమ్ లో నాకు షూటింగ్ లేదనే విషయం తెలీడంతో ఇబ్బంది పడ్డానని,అయితే మొదటగా ఒక సమయం చెప్పి, తర్వాత ఆ విషయం అడిగితే అలా చెప్పలేదని అనడంతో చాలా బాధ పడ్డానని దివ్యవాణి గుర్తుచేసుకున్నారు.

Advertisement

అయితే అప్పటికే దాసరి నారాయణరావు లాంటి పెద్ద దర్శకుడి సినిమా కావడంతో ఏదైనా సమస్య వస్తే ఎలా అని ఆందోళన చెందానని ఊటీలో జరిగిన షూటింగ్ సమయంలో ఇది జరిగిందని ఆనాటి రోజులని గుర్తు చేసుకున్నారు.ఆ తర్వాత దాసరి నారాయణరావు భార్య పద్మ గారిని కలిసి జరిగిన విషయమంతా వివరించానని దాంతో తనకి ధైర్యం చెప్పినట్లు తెలిపారు.

అయితే అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో పని చేయడం కొన్నిసార్లు చాలా కష్టంగా ఉండేదని ది ప్రొడక్షన్ టీమ్‌లోని కొందరి వల్ల నటీనటులకు ఇబ్బందులు ఎదురయ్యేవని తన అనుభవాన్ని పంచుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చాలావరకు మారిపోయాయని,ఇప్పుడొచ్చిన కొత్త తరం అంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారని రెండు తరాల మధ్య గల తేడాని చెప్పుకొచ్చారు.

Advertisement

దివ్యవాణి కెరీర్ విషయానికి వస్తే ముందుగా గుర్తొచ్చే సినిమా ‘పెళ్లి పుస్తకం’. బాపు దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్‌తో కలిసి ఆమె నటించిన ఈ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు, మాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి కూడా. ఇక ఈ సినిమా గురించిమాట్లాడుతూ అందులోని కొన్ని మాటలు తన జీవితంలో భాగమైపోయాయని మనిషి మంచివాడా, చెడ్డవాడా అనేది పరిస్థితులను బట్టి కూడా మారుతుందనే ఆలోచన తనను ఎప్పుడూ ఆలోచింపజేస్తుందని అన్నారు. ‘పెళ్లి పుస్తకం’లో రాజేంద్ర ప్రసాద్ చెప్పిన డైలాగ్ తనకు చాలా ఇష్టమని, జీవితంలో ఎన్నోసార్లు ఆ మాటలను గుర్తుచేసుకుంటానని వివరించారు.

బాపు గారితో పనిచేయడం కూడా తనకు మంచి అనుభవమని ఆయన ఎలా నటించమంటే అలా చేసేదాన్నని, కొన్నిసార్లు ఆయన చెప్పిన దానికంటే ఎక్కువగానే నటించేదాన్నని సరదాగా చెప్పుకొచ్చారు దివ్యవాణి.ఇక ఇప్పటికీ చాలామంది ఆ సినిమా గురించి, అందులోని పాటల గురించి తనతో మాట్లాడుతుంటారని అన్నారు.

కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటించినా, తన ప్రతిభకు తగ్గ పాత్రలు రాలేదనే అసంతృప్తి ఉందని, ‘మహానటి’ సినిమాలో నటించినప్పటికీ, తనకు నటిగా పూర్తి సంతృప్తినిచ్చే పాత్ర దక్కలేదని తెలిపారు.

ఇక రమ్యకృష్ణ గురించి మాట్లాడుతూ తను చాలా మంచి మనిషి అని, ఎంత పెద్ద స్టార్ అయినా గర్వం లేకుండా అందరితో కలిసిపోతారని చెప్పారు. ఆమెకు భక్తి మీద కూడా ఆసక్తి ఉందని, ఇతరుల పట్ల ఎంతో ఆప్యాయంగా ఉంటారని గుర్తుచేసుకున్నారు.

ప్రస్తుతం తన వయసుకు, అనుభవానికి తగ్గ మంచి పాత్రలు వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నానని ‘బాహుబలి’లో రమ్యకృష్ణ పోషించిన శివగామి తరహా పాత్రలు తనకు బాగా సరిపోతాయని కొందరు అంటుంటారని చెప్పుకొచ్చారు.

ALSO READ :ఇమ్రాన్ ఖాన్‌కు బిగ్ షాక్.. భారత్ వదిలి వెళ్లాల్సిందేనా?

Tags

Related News

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

రణబాలి విషయంలో నేను చెప్పిందే జరిగింది.. విజయ్ కామెంట్స్ వైరల్!

ఇమ్రాన్ ఖాన్‌కు బిగ్ షాక్.. భారత్ వదిలి వెళ్లాల్సిందేనా?

చిరంజీవితో మల్టీస్టారర్.. కీలక అప్డేట్ ఇచ్చిన నాగార్జున!

రణబాలి ఫస్ట్ ఛాయిస్ విజయ్ కాదా? ఎవరంటే?

మంగ్లీ ఎలాంటిది అంటే .. చరణ్ అర్జున్ ఎమోషనల్ కామెంట్స్

రిలీజ్ డేట్ చెప్పి వాయిదా వేస్తే ఎలా?ఆదర్శ కుటుంబం పై నాగార్జున కామెంట్స్!

Big Stories

Advertisement
×