Punganur Clashes: అన్నమయ్య జిల్లా పుంగనూరులో తెరపైకి వచ్చిన ఈ సీను ఏపీ రాజకీయాల్లో ప్రకంపలను రేపింది. నామినేషన్ సెంటర్ లోకి దూసుకొచ్చిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కారు తమను ఢీకొట్టిందని టీడీపీ వాళ్లు, కాదు కాదు వాళ్లే మాపై దాడి చేశారంటూ వైసీపీ వాళ్లు పరస్పర ఆరోపణలు చేసుకోవడం.. దాడులకు దిగడం.. వాహనాల ధ్వంసం. వెరసి పరిస్థితి రచ్చగా మారింది. చివరకు పోలీసులు ఎంపీ భారీ బందోబస్తుతో బయటకు తీసుకెళ్లారు.
కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి?
వైసీపీ అభ్యర్ధులు నామినేషన్లు వేయకుండా టీడీపీ అడ్డుకుంటోందని ఆరోపించారు ఎంపీ మిథున్ రెడ్డి. పుంగనూరు ఘటనపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు, ఎంపీకే సెక్యూరిటీ లేకపోతే.. కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారాయన. పుంగనూరు ఘటన వెనక టీడీపీ అగ్రనాయకత్వం హస్తం ఉందని ఆరోపించారు వైసీపీ మాజీ ఎంపీ భరత్, ఎన్నికల కమిషన్ తక్షణమే జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
వాహనాలు ధ్వంసం..
పుంగనూరుకు ధీటుగా రాయచోటిలోనూ టీడీపీ -వైసీపీ వర్గాలు పరస్పర దాడులకు దిగాయి. వైసీపీ ఆఫీస్ దగ్గర వాహనాలు ధ్వంసం కావడం.. కొన్ని వాహనాలకు నిప్పంటుకోవడంతో టెన్షన్ మరింత పెరిగింది. దీనిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి.. శ్రీకాంత్‌రెడ్డికి ఓపెన్ చాలెంజ్ విసిరారు. తాను పోలీసులను బెదిరించినట్లు నిరూపిస్తే బహిరంగ క్షమాపణ చెప్పేందుకు రెడీ అన్నారు. రాజంపేటలో స్వతంత్ర అభ్యర్థి రేణుక నామినేసన్ వెళ్తుండగా కొందరు ఆమెను అడ్డుకున్నారు. నామినేషన్ పత్రాలను , సర్టిఫికెట్లను లాక్కొని చింపేశారని వాపోయారామె.
మళ్లీ ఫ్యాక్షన్ పాలిటిక్స్..
నామినేసన్ల తొలి రోజే దాడులు ప్రతిదాడులు హోరెత్తాయి. వైసీపీ మళ్లీ ఫ్యాక్షన్ పాలిటిక్స్‌ను తెరపైకి తెస్తుందని ఆరోపించారు టీడీపీ నేత NVSN వర్మ. ఇక పుంగనూరు ఘటనపై బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ సంచలన కామెంట్స్ చేశారు. నామినేషన్ల సందర్భంగా వైసీపీ దాడులకు పాల్పడిందంటూ టీడీపీ నేతల బృందం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికలు సజావుగా సాగేలా పారామిలటిరీ బలగాలను దించాలని కోరారు. పుంగనూరు, రాయచోటి ఘటనలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు మాజీ ఏఐజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి.
Tags

Share