E-Paper
Advertisement

ఇమ్రాన్ ఖాన్‌కు బిగ్ షాక్.. భారత్ వదిలి వెళ్లాల్సిందేనా?

ఇమ్రాన్ ఖాన్‌కు బిగ్ షాక్.. భారత్ వదిలి వెళ్లాల్సిందేనా?
Advertisement

Imran Khan OCI:ఇమ్రాన్ ఖాన్..ఒకప్పుడు రొమాంటిక్ హీరోగా బాలీవుడ్ లో మాంచి క్రేజ్ కొట్టేసిన ఈ స్టార్ కిడ్ తాజాగా ఓ కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు.. ‘జానే తు… యా జానే నా’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన కొంతకాలంగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించనప్పటికీ సామాజిక అంశాలపై రియాక్ట్ అవుతూనే ఉంటాడు.

ఇక ఈ క్రమంలోనే తాజాగా ఈ మధ్య ముంబైలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన ఒక రాజకీయ నిరసనలో ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్నాడు కూడా.అయితే ఇమ్రాన్ ఖాన్ కి అమెరికా పౌరసత్వం కలిగి ఉన్న OCI కార్డు ఉందని అతడు ధర్నాలో ఎలా పాల్గొంటాడు అంటూ బీజేపీ నాయకుడు కిరీట్ సోమయ్య కంపైంట్ చేశారు .దీంతో ఆయన ఇండియాలో ఉండటానికి వీలు లేదంటూ అక్టోబర్ 28లోగా ఇండియాని వదిలి వెళ్ళాలంటూ ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్స్ ఇమ్రాన్ ఖాన్ నోటీసులు ఇవ్వడం అటు బాలీవుడ్ తో పాటు ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో కూడా హాట్ టాపిక్ గా మారింది. దీంతో అసలు ఇమ్రాన్ ఖాన్ వద్ద ఉన్న ఆ OCI కార్డు ఏంటి, వాళ్లకి అసలు ఎలాంటి హక్కులు ఉంటాయంటూ ఆరాలు తీస్తున్నారంతా.

Advertisement

OCI అంటే వర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని అర్థం. భారతీయ మూలాలు ఉన్న విదేశీ పౌరులకు భారత ప్రభుత్వం ఈ కార్డును అందిస్తుంది. దీనివల్ల ప్రతిసారీ వీసా తీసుకోనవసరం లేకుండా జీవితకాలం ఇండియాకు వచ్చి వెళ్లే సౌకర్యం ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఎంతకాలమైనా ఉండొచ్చు కూడా.ఇక విమాన ప్రయాణాలలో , టూరిజం ప్లేస్ లలో, మ్యూజియం వంటి వాటిల్లో ఎంట్రీ ఫీజుల విషయంలో ఇండియన్స్ తో పాటు సమానంగా డిస్కౌంట్ లభిస్తుంది.

ఇక ఇండియాలో అగ్రికల్చర్ ల్యాండ్స్ ,తోటలు వంటివి కాకుండా ఇళ్లు, స్థలాలు కొనే సౌకర్యం కూడా ఉంటుంది. అంతే కాకుండా డాక్టర్, నర్స్, ఫార్మసిస్ట్ వంటి కొన్ని జాబ్స్ చేయడానికి షరతులతో కూడిన పర్మిషన్ కూడా వీరికి దక్కుతుంది.అయితే ఈ OCI కార్డు ఉన్నంత మాత్రాన వారు ఇండియన్ సిటీజన్స్ అయిపోరు. వీరికి అసలు ఎలాంటి పొలిటికల్ రైట్స్ ఉండవు. ఇక రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, న్యాయమూర్తుల వంటి రాజ్యాంగ పదవులతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా వీరు పోటీచేయడానికి కుదరదు.

Advertisement

ఇక ఆర్టికల్ 19 ప్రకారం వీరు ఎలాంటి రాజకీయ నిరసనల్లో పాల్గొనవద్దు కూడా.ఇండియన్స్ లాగా ఈ హక్కులను వినియోగించుకోవడానికి వీల్లేదు. అయితే ఆర్టికల్ 21 ప్రకారం వారికి ఇక్కడ జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ రక్షణ మాత్రమే ఉంటాయి. గతంలో ఇలాగే 2020లో కలకత్తాలో CAA వ్యతిరేక నిరసనల్లో పోలాండ్ విద్యార్థి కామిల్ సిడ్చిన్స్కీ పాల్గొనగా అతడికి కేంద్రం ఇటువంటి నోటీసే ఇచ్చింది.అయితే నిరసనలో పాల్గొన్నంత మాత్రాన వెళ్లగొట్టలేమని కలకత్తా హైకోర్టు దాన్ని కొట్టేయడం గమనార్హం .

అయితే ప్రస్తుతం ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్, 2025 అమల్లో ఉంది.దాంతో ఇపుడు రూల్స్ మరింత స్ట్రిక్ట్ అయిపోయాయి.ఈ క్రమంలోనే అక్టోబర్ 28లోగా ఇండియాని వదిలి వెళ్ళాలని ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్స్ అంటుంటే దాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించాడు ఇమ్రాన్ .చూడాలి మరి ఈ కేసులో తీర్పు ఎవరి వైపు వస్తుందో !

ALSO READ :పాటలకు లక్షల్లో వ్యూస్.. కానీ సినిమా ఛాన్సులు మాత్రం ..చరణ్ అర్జున్ ఆవేదన!

Tags

Related News

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

రణబాలి విషయంలో నేను చెప్పిందే జరిగింది.. విజయ్ కామెంట్స్ వైరల్!

చిరంజీవితో మల్టీస్టారర్.. కీలక అప్డేట్ ఇచ్చిన నాగార్జున!

రణబాలి ఫస్ట్ ఛాయిస్ విజయ్ కాదా? ఎవరంటే?

మంగ్లీ ఎలాంటిది అంటే .. చరణ్ అర్జున్ ఎమోషనల్ కామెంట్స్

రిలీజ్ డేట్ చెప్పి వాయిదా వేస్తే ఎలా?ఆదర్శ కుటుంబం పై నాగార్జున కామెంట్స్!

వీకే నరేష్ విగ్గు ధర ఎంతో తెలుసా? ఒక ఫ్యామిలీ లగ్జరీగా బ్రతకొచ్చుగా?

Big Stories

Advertisement
×