E-Paper
Advertisement

రవితేజ తల్లిగా దివ్యవాణి.. చివరికి ఏమైందంటే!

రవితేజ తల్లిగా దివ్యవాణి.. చివరికి ఏమైందంటే!
Advertisement

Divyavani:ఒకప్పుడు తన అందం, అభినయంతో తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకున్న సీనియర్ హీరోయిన్ దివ్యవాణి.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ జర్నీకి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా మాస్ మహారాజా రవితేజ సినిమాలో తనకు వచ్చిన అవకాశం చివరకు ఎందుకు చేజారిపోయిందో బయటపెట్టారు.

14 ఏళ్ల వయసులోనే మేకప్ నేర్చుకున్న దివ్యవాణి!

Advertisement

దివ్యవాణి తన తొలి సినిమా అడవిలో అర్ధరాత్రి సమయంలోనే మేకప్‌పై ఆసక్తి పెంచుకున్నానని తెలిపారు.అప్పట్లో ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌కు మేకప్ వేసిన పీతాంబరం కుమారుడు అయిన గోపి దగ్గర మేకప్ వేయటాన్ని నేర్చుకున్నానని అలా అప్పట్లో చూసి నేర్చుకున్న అలవాటుతో 14 ఏళ్లు పూర్తయిన తర్వాత, 15వ ఏట నుంచి తన మేకప్ తానే వేసుకోవడం మొదలుపెట్టానని ఆనాటి రోజుల్ని గుర్తుచేసుకున్నారు.

రవితేజ సినిమాలో తల్లి పాత్ర.. చివరకు ఏమైంది?

Advertisement

ఇక ఇదే ఇంటర్వ్యూలో రవితేజ సినిమాకు సంబంధించిన విషయాన్ని బయటపెట్టారు. వల్లభనేని వంశీ నిర్మించిన టచ్ చేసి చూడు సినిమాలో తనకు రవితేజ తల్లి పాత్ర చేసే అవకాశం వచ్చిందని తెలిపారు.తనకి రవితేజ నటించిన ఇడియట్ సినిమా నుంచే ఆయనంటే తనకు ఎంతో ఇష్టమని, అయితే ఆయన కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో తనకు పెళ్లి కావడంతో ఆయనతో కలిసి నటించే అవకాశం రాలేదని చెప్పారు.

ఇక చాలా కాలం తర్వాత ఆయన సినిమాలో నటించే అవకాశం రావడంతో సంతోషించానని తెలిపారు. అయితే అప్పటికే రవితేజ డైట్ చేసి బాగా స్లిమ్‌గా తయారయ్యారని, దీంతో తనను తల్లిగా ఎలా చూపిస్తారని రవితేజ డౌట్ రైజ్ చేశారని చెప్పుకొచ్చార .

ఇక ఆ పాత్రకు తగినట్లుగా కనిపించేందుకు తెల్లటి జుట్టు పెట్టి మేకప్ కూడా చేశారని, అయినప్పటికీ తనను చూసిన తర్వాత, తల్లి పాత్రలో కంటే కలెక్టర్ పాత్రలో ఉన్నట్లు వాళ్ళు ఫీలవడం వల్ల ఆ అవకాశం చేజారిపోయిందని తెలిపారు.

ఇప్పటికీ సినిమాల్లో నటించేందుకు సిద్ధమే!

ప్రస్తుతం తాను సినిమాల్లో పెద్దగా నటించడం లేదని, కొన్ని పర్సనల్ పనుల కారణంగా కొంతకాలం గ్యాప్ ఇచ్చానని చెప్పారు. అయితే మంచి పాత్రలు వస్తే నటించేందుకు ఎప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు.

గతంలో సినీ పరిశ్రమలో కళాకారుల మధ్య కుటుంబ సభ్యుల్లాంటి అనుబంధం ఉండేదని, ఒక సినిమాలో ఒకరికి అవకాశం వస్తే మరో సినిమాలో ఇంకొకరికి అవకాశం కల్పిస్తూ అందరినీ గుర్తించేవారని ఆమె గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, తనలాంటి సీనియర్ నటీనటులకు తగిన పాత్రలు దొరకడం కొంత కష్టంగా మారిందని అభిప్రాయపడ్డారు.

రాజకీయాల వల్ల కూడా అవకాశాలు తగ్గాయా?

సినిమాలకు దూరం కావడానికి రాజకీయాలు కూడా ఒక కారణమై ఉండవచ్చని దివ్యవాణి అభిప్రాయపడ్డారు. తాను గతంలో టీడీపీలో ఉన్నానని, అక్కడ ఉన్న విషయాలను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి బయటకు వచ్చానని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నట్లు చెప్పారు.

రాజకీయాల్లోనూ, సినీ పరిశ్రమలోనూ కొందరిని మెప్పిస్తూ ముందుకు వెళ్లే విధానం ఉంటుందని, కానీ తనకు అలా వ్యవహరించడం రాదని అన్నారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటమే తన స్వభావమని, దానికే తాను విలువ ఇస్తానని స్పష్టం చేశారు.

సొంతంగా సినిమాలు చేసే ఆలోచన!

సినిమాల్లో అవకాశాల కోసం ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం ఇప్పుడు అంతగా లేదని సోషల్ మీడియా ద్వారా కళాకారులు ప్రేక్షకులకు చేరువయ్యే అవకాశం ఉందని చెప్పారు. తన సొంత సంస్థ డీవీ క్రియేషన్స్‌పై ‘వాయిస్ ఆఫ్ దివ్యవాణి’ పేరుతో కార్యక్రమాలు చేయడంతో పాటు, కొన్ని సినిమాలు నిర్మించే ఆలోచన కూడా ఉందని అన్నారు.

గతంలో సినిమా చేయాలంటే దర్శకులు, నిర్మాతల అవకాశాల కోసం ఎదురుచూడాల్సి వచ్చేదని, ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో తక్కువ ఖర్చుతోనూ సొంతంగా ప్రాజెక్టులు రూపొందించుకునే అవకాశం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

ఏది ఏమైనా రవితేజ సినిమాలో తల్లి పాత్రని అనుకోకుండా మిస్ చేసుకున్న దివ్యవాణి వచ్చే రోజుల్లో మరిన్ని మంచి సినిమాలలో నటించాలని కోరుకుందాం !

ALSO READ :ఘరానా మొగుడు ఛాన్స్ మిస్.. అసలు కారణం చెప్పిన దివ్యవాణి!

Tags

Related News

ఘరానా మొగుడు ఛాన్స్ మిస్.. అసలు కారణం చెప్పిన దివ్యవాణి!

నా బెడ్ రూమ్ లో దెయ్యాలున్నాయి…షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన హీరో!

నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం..

రూ .1000 కోట్ల కల.. జైలర్ 2తో కోలీవుడ్ చరిత్ర సృష్టిస్తుందా?

మళ్లీ ఆ స్థానానికి వెళ్లలేవు.. త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ పోస్ట్!

రజినీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. జైలర్ 3 పై అఫీషియల్ అప్డేట్!

భార్య అంటే ఉచితంగా వచ్చే పనిమనిషా?- అనుపమ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×