E-Paper
Advertisement

చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ టికెట్ ఎవరికి?.. రేసులో ఉన్న టాప్ నేతలు వీరే!

చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ టికెట్ ఎవరికి?.. రేసులో ఉన్న టాప్ నేతలు వీరే!
Advertisement

Chilakaluripet Politics: చిలకలూరి పేట మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని జనరల్ మహిళ కేటగిరీకి కేటాయించారు. టిడిపి తరపున టికెట్ ఆశిస్తోన్న వారు పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావును ఆశ్రయిస్తున్నారు.ఆయన్ను ప్రసన్నం చేసుకోడానికి ఆశావహులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.ఛైర్మన్ పీఠంపై ఆశలు పెట్టుకున్నవారిలో కొమ్మినేని సుష్మ, మద్దిబోయిన ఇందిర,పఠాన్ ఇఫ్పా పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.ఇక వైసీపీ తరపున మాజీ మంత్రి విడదల రజని తోటికోడలు విడదల స్ఫూర్తి రేసులో ముందంజలో ఉన్నారు.అటు పత్తి పాటి పుల్లారావు..ఇటు విడదల రజనీ తమ తమ శిబిరాల్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు.

వైసీపీ హయాంలో..

టిడ్కో ఇళ్లు, రహదారులు, సాగునీటి ప్రాజెక్టులకు కూటమి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోందని పత్తిపాటి పుల్లారావు జనంలోకి తీసుకుపోడానికి సమాయత్తమయ్యారు. వైసీపీ హయాంలో విధ్వంసం జరిగిందని ఎండగడుతూ ప్రచారాన్ని ముందుకు తీసుకుపోవాలని నిర్ణయించారు.గత ఎన్నికల తర్వాత చాలా సీనియర్ అయినా పత్తిపాటికి మంత్రి పదవి దక్కలేదు. అయినా ఈ ఎన్నికల్లో కూటమి ఘన విజయంలో కీలక పాత్ర పోషించాలని పత్తిపాటి నిశ్చయంగా ఉన్నట్లు చెబుతున్నారు.ఇక వైసీపీ తరపున ప్రచారాన్ని ముందుకు తీసుకుపోనున్న విడదల రజని 2019 నుండి 2024 మధ్య కాలంలో జగన్ మోహన్ రెడ్డి పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ జనం మనసులు గెలుచుకోవాలని భావిస్తున్నారు.

లోకల్ వార్..

Advertisement

పత్తిపాటి పుల్లారావు-విడదల రజని పరస్పర ఆరోపణలు విమర్శలతో లోకల్ వార్ ఆసక్తికరంగా సాగడం ఖాయమంటున్నారు రాజకీయ పరిశీలకులు. తాము చేసిన ప్రగతే తమని గెలిపిస్తుందని టిడిపి ధీమాగా ఉంది.

Also read: సీజేపీ నిరసనకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. వ్యాపారుల పిటిషన్ కొట్టివేత.. పోలీసులకు కీలక ఆదేశాలు!

Tags

Related News

ఏపీ ఎన్నికల చరిత్రలోనే ఎన్నడూ లేని విచిత్రం.. ఒకే గ్రామం నుంచి జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నిక!

సీజేపీ నేతల అరెస్టును ఖండిస్తూ.. ఎక్స్‌లో వైఎస్ జగన్ సంచలన ట్వీట్..?

జగన్‌తో పొత్తు ఎలా? అంటూ మాధవ్ ప్రశ్న, ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్య

వివేకా హత్య కేసు సాయంత్రానికి కొత్త మలుపు, అవినాష్ అరెస్టుకు సంకేతాలు! ఇవాళ విచారణకు

ఏపీలో స్థానిక ఎన్నికల ఫైట్.. పత్తా లేని వైసీపీ, జోష్ లేక డీలా పడుతున్న కేడర్

లోకల్ బాడీ ఎన్నికలపై విజయసాయిరెడ్డి పలుకులు, రూలింగ్ పార్టీకి అనుకూలం, పవన్‌పై కూడా

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు, కూటమిలో సీట్లు సర్దుబాటు.. 4:1 ఫార్ములాలో జనసేన-బీజేపీ, మిగతా సీట్లలో టీడీపీ

Big Stories

Advertisement
×