E-Paper
Advertisement

India A vs Oman A: ఏంట్రా దీని ఓవరాక్షన్.. టీమిండియా ప్లేయర్ కే బౌలింగ్ వేస్తోంది

India A vs Oman A: ఏంట్రా దీని ఓవరాక్షన్.. టీమిండియా ప్లేయర్ కే బౌలింగ్ వేస్తోంది
Advertisement

India A vs Oman A: ఆసియా కప్ 2025 రైజింగ్ టోర్నీలో భారత్ – ఏ సెమీఫైనల్ కి దూసుకెళ్లింది. దోహాలో జరిగిన గ్రూప్ – బి లో సెమిస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన భారత జట్టు ఓమన్ పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఓమన్ నిర్దేశించిన 136 పరుగుల లక్ష్యాన్ని భారత 17.5 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి.. ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.

Also Read: Ind vs sa: గంభీర్ మరో ప్రయోగం.. టీమిండియా ప్రాక్టీస్‌లో మిస్టరీ స్పిన్నర్‌.. ఇక దక్షిణాఫ్రికాకు చుక్కలే

Advertisement

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఒమన్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. ఒమన్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ హమ్మద్ మిర్జా 16 బంతుల్లో 32 పరుగులు చేసి ఆ జట్టుకు మంచి శుభారంబాన్ని అందించాడు. అనంతరం వసీమ్ అలీ 45 బంతుల్లో 54 పరుగులు చేసి ఓమన్ స్కోర్ ని ఓ మోస్తరుగా నిలిపాడు. భారత బౌలర్లలో సుయాష్ శర్మ 2, గుర్జప్ నీత్ సింగ్ 2 వికెట్స్ పడగొట్టారు.

అద్భుతంగా రాణించిన హర్ష్ దూబే:

136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు.. ప్రారంభంలోనే రెండు వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత ఆల్రౌండర్, సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు హర్ష్ దూబే 44 బంతుల్లో 53 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచి అద్భుతంగా రాణించాడు. ఇతడికి నమన్ ధీర్ {30} మంచి సహకారం లభించింది. అటు బౌలింగ్ లో కూడా ఒక వికెట్ పడగొట్టి అసాధారణ ప్రదర్శనతో భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు దూబే. తన బ్యాటింగ్ తో జట్టు గెలుపు దిశగా దూసుకు వెళ్లి.. చివరకు సెమి ఫైనల్ బర్త్ ని సొంతం చేసుకుంది. మొత్తంగా తన క్లాస్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. హర్ష్ దుబే ఐపీఎల్ లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున మూడు మ్యాచ్ లు ఆడి.. ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇతడిని 30 లక్షల కనీస ధరతో సన్రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకుంది.

దూబేతో ప్రాక్టీస్ చేసిన ఫ్యాన్:

Advertisement

ఓమన్ తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ ఫ్యాన్ తన సోషల్ మీడియాలో చేసిన ఓ సరదా పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దుబే బ్యాటింగ్ కి దిగబోయే సమయంలో ప్రాక్టీస్ చేశాడు. ఆ సమయంలో మైదానం బయట ప్రాక్టీస్ చేశాడు. అయితే స్టాండ్స్ లో ఉన్న ఓ లేడీ అభిమాని.. పైనుండి దూబేకి బౌలింగ్ వేసినట్లుగా, అతనితో ప్రాక్టీస్ చేయించినట్లుగా ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సుజిత.

Also Read: Shoaib Malik: నాలుగో పెళ్లి చేసుకుంటున్న పాకిస్తాన్ క్రికెటర్.. ముగ్గురికి విడాకులు?

ఈ వీడియోకి “ఎలా ఉంది నా బౌలింగ్..? దూబేకి ప్రాక్టీస్ చేపించాను. దీంతో హర్ష్ ఈ మ్యాచ్ లో 50 పరుగులు కొట్టి ఇండియాని సెమీఫైనల్ కి తీసుకువెళ్లాడు” అని రాసుకొచ్చింది. అయితే ఈ మ్యాచ్ తో దూబే ప్రదర్శనకు ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్న నేపథ్యంలో.. ఈ సరదా పోస్ట్ కూడా సోషల్ మీడియాలో హంగామా చేస్తుంది. ఈ వీడియో చూసిన క్రీడాభిమానులు ఫన్నీగా స్పందిస్తూ..” హర్ష్ దూబే ఫామ్ కి నువ్వే కారణమా..? అని కామెంట్స్ చేస్తున్నారు.

 

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Sujata Dahal (@sujita8104)

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×