E-Paper
Advertisement

Aishwarya Rai: సత్య సాయి బాబా శతజయంతి వేడుకలు.. సందడి చేసిన ఐశ్వర్యరాయ్

Aishwarya Rai: సత్య సాయి బాబా శతజయంతి వేడుకలు.. సందడి చేసిన ఐశ్వర్యరాయ్
Advertisement

Aishwarya Rai: ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్(Aishwarya Rai Bachchan) తాజాగా సత్యసాయి జిల్లాలో సందడి చేశారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి (Puttaparthi)లో పుట్టపర్తిలోని సత్య సాయిబాబా (Sathya Sai Baba)శత జయంతి వేడుకలు(Centenary Celebration) ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఈ శత జయంతి వేడుకలలో భాగంగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ క్రమంలోని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి చేరుకున్నారు. ఐశ్వర్య రాయ్ సాయి కుల్వంత్ హాల్‌లోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మహా సమాధి వద్ద ప్రార్థనలు చేసి అనంతరం శత జయంతి వేడుకలలో పాల్గొన్నారు.

సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు..

సత్యసాయి శత జయంతి వేడుకలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ఈమె ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో కూడా సమావేశమయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతో మంది సెలబ్రిటీలు తరచూ పుట్టపర్తికి వెళ్లి సాయిబాబా సమాధిని దర్శించుకుంటున్న సంగతి తెలిసిందే.. విజయ్ దేవరకొండ తరచు పుట్టపర్తికి వెళ్లి సాయిబాబా సమాధిని దర్శిస్తూ ఉంటారు.

బాబా శతజయంతి వేడుకలలో ఐశ్వర్యరాయ్..

Advertisement

విజయ్ దేవరకొండ స్కూల్ మొత్తం పుట్టపర్తిలోనే పూర్తి అయిన సంగతి తెలిసిందే.. క్రమంలోనే పుట్టపర్తితో తనకు ఉన్న అనుబంధం కారణంగా తరచూ ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. ఇటీవల తన నిశ్చితార్థం జరిగిన వెంటనే విజయ్ దేవరకొండ పుట్టపర్తికి వచ్చిన సంగతి తెలిసిందే. అదే విధంగా నటి సాయి పల్లవి కూడా ప్రతి ఏడాది కొత్త సంవత్సరాన్ని పుట్టపర్తి లోనే జరుపుకుంటూ ఉంటారు.. ఇలా ఎంతోమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రిటీలు సత్యసాయి మహాసమాధిని దర్శించుకుంటూ ఉంటారు.

పుట్టపర్తిలో ఐశ్వర్య రాయ్ ప్రత్యేక ప్రార్థనలు..

Advertisement

ఇక సత్యసాయిబాబా శత జయంతి వేడుకలలో భాగంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే .ఈ కార్యక్రమంలో పలువురు కీలక నేతలు పాల్గొనబోతున్నారు. ఈ క్రమంలోనే ఐశ్వర్య రాయ్ కూడా సాయిబాబా శత జయంతి వేడుకలలో పాల్గొని మహా సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలను చేశారు. ఐశ్వర్య కెరియర్ విషయానికి వస్తే ఒకానొక సమయంలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నా ఈమె ఇటీవల పూర్తిగా సినిమాలను తగ్గించారనే చెప్పాలి. ఈమె ఇటీవల పొన్నియన్ సెల్వన్ అనే సినిమా ద్వారా చివరిగా సౌత్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత ఐశ్వర్యరాయ్ తదుపరి ఎలాంటి సినిమాలను ప్రకటించలేదు. సినిమాలకు దూరంగా ఉన్న ఈమె పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఈమె పెద్దగా యాక్టివ్ గా ఉండరనే చెప్పాలి.

Also Read: Director Radha Krishna: ప్రభాస్ డైరెక్టర్ ఇంట్లో విషాదం.. అంతా శూన్యం అంటూ ఎమోషనల్!

Related News

కన్నీటి పర్యంతమవుతున్న మహారాజా హీరోయిన్.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

Big Stories

Advertisement
×