Bigg Boss Lahari : సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంటున్న ముద్దుగుమ్మలు ఈమధ్య బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తూ తమ ఆటతో, మాటతో అలాగే అందాలతో బుల్లితెర ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఎంతోమంది సోషల్ మీడియా ద్వారా మంచి ఫాలోయింగ్ సంపాదించుకొని బిగ్ బాస్ లోకి అడుగుపెడుతున్నారు. అలాంటి ముద్దుగుమ్మల్లో లహరి షారీ కూడా ఒకరు. ఎక్కువ మంది జనాలు ఈమె ఎంట్రీ ఎప్పుడు ఉంటుందని ఎదురుచూశారు. ఈమె అందం అభినయంతో కుర్రకారుకు మతి పోగొట్టేసింది.. అలాంటి అమ్మడు బిగ్బాస్ తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ హాట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది.. సినిమాలలో పెద్దగా కనిపించలేదు కానీ సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటూనే లక్షలు సంపాదిస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి లహరి నెలకు ఎంత సంపాదిస్తుందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..
బిగ్ బాస్ ద్వారా ఎంతో మంది అమ్మాయిలకు మంచి క్రేజ్ క్రేజ్ దక్కింది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న అమ్మాయిలకు బిగ్ బాస్ లో అవకాశం వస్తుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా ఎంతోమంది సెలబ్రిటీగా మారిపోయారు. అలాంటి వారిలో ఈ లహరి షారీ ఒకరు.. ఈమె హీరోయిన్ మెటీరియల్. కానీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమా అవకాశాలు వచ్చిన సరే పెద్దగా వాటిని పట్టించుకోలేదని తెలుస్తుంది. అంతేకాదు ఈమధ్య తన గ్లామర్ గేట్లు ఎత్తేసింది. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అబ్బాయిలని ఆకట్టుకుంటుంది. తన అందం అభినయంతో ఈమె రోజురోజుకీ సోషల్ మీడియా యూత్ ఐకాన్ లాగా మారిపోతుంది. ఆమె షేర్ చేసే ఫోటోలకు డిమాండ్ కూడా ఎక్కువే.. అయితే సోషల్ మీడియాలో లహరి నెలకు దాదాపు 10 లక్షల పైగానే సంపాదిస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇదైతే హాట్ టాపిక్ గా మారింది.. ఒక హీరోయిన్ కన్నా ఎక్కువగా సంపాదిస్తుంది అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు.
లహరి షారి రియల్ లైఫ్ విషయానికొస్తే.. ఈ అమ్మడు తెలుగు రాష్ట్రల్లోనే పుట్టి పెరిగింది. మోడల్ అవ్వాలన్నా తన కోరికతో మోడలింగ్ లోకి అడుగుపెట్టి ఆ తర్వాత జర్నలిజం చేసింది. తన మాటతీరుతో అందరినీ కట్టిపడేసింది. నటిగా పలు సినిమాలలో నటించి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు వేయించుకుంది. టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాలో ఒక డాక్టర్ పాత్రలో ఏమి కనిపించింది. సుమంత్ హీరోగా వచ్చిన మళ్లీ రావా, తేజ సజ్జ జాంబి రెడ్డి సినిమాలలో కూడా నటించింది.. వీటితోపాటుగా మరికొన్ని సినిమాలలో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ మధ్య సినిమాలలో పెద్దగా కనిపించలేదు కానీ వెకేషన్ లోకి వెళ్తూ అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తుంది.. ఆమె దిగిన హాట్ ఫోటోలు క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి..
Also Read : ‘గోదావరి’ సూర్య ఏం చదివాడో తెలుసా..?