BigTV English
Advertisement

Allu Sirish – Nainika : అల్లు శిరీష్ కు కాబోయే భార్య బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..? బాగా సౌండ్ పార్టీనే..

Allu Sirish – Nainika : అల్లు శిరీష్ కు కాబోయే భార్య బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..? బాగా సౌండ్ పార్టీనే..

Allu Sirish – Nainika : టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ రెండో కుమారుడు అల్లు శిరీష్ తను ప్రేమించిన అమ్మాయితో నిన్న గ్రాండ్గా నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈయన నైనిక అనే అమ్మాయితో గత కొద్ది రోజులుగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లికి సిద్ధమాయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు. మీరు ఎంగేజ్మెంట్ లో అల్లు ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యామిలీ కూడా సందడి చేశారు. అల్లు శిరీష్, నైనికల ఎంగేజ్మెంట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అయితే అల్లు శిరీష్ చేసుకోబోతున్న ఈ నైనిక రెడ్డి ఎవరు అన్నది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అసలు ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఆస్తుల వివరాల గురించి నెటిజన్లు గూగుల్లో తెగ వెతికేస్తున్నారు.. ఆ వివరాలను మనం తెలుసుకుందాం..


 అల్లు శిరీష్ – నైనికల ఎంగేజ్మెంట్.. 

తెలుగు ఇండస్ట్రీలో బడా నిర్మాతలలో ఒకరు అల్లు అరవింద్.. ఈయన కుమారుడు అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.. రెండవ కుమారుడు అల్లు శిరీష్.. ఈయన హీరోగా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించాడు. అయితే ఆ సినిమాలు ఏవి కూడా ఆయనకు అనుకున్న బ్లాక్ బస్టర్ హిట్ ను అందించలేదు. రీసెంట్ గా బడ్డీ మూవీలో నటించాడు.. ఆ తర్వాత సినిమాలలో కనిపించలేదు. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అంటూ వార్తలు వినిపించాయి. అనుకున్నట్లుగానే మొత్తానికి ఆయన ప్రేమించిన అమ్మాయితో వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నాడు.. నిన్న సాయంత్రం శిరీష్ – నైనిక రెడ్డిల ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. అతి త్వరలోనే పెళ్లి డేట్ ని అనౌన్స్ చేసే అవకాశం కూడా ఉంది.

Also Read : ఫిట్ నెస్ కోచ్ తో హీరో ప్రేమాయణం.. లైఫ్ లో ఊహించని ట్విస్టులు..


నైనిక బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..? 

అల్లు శిరీష్ కు కాబోయే అమ్మాయి నైనిక రెడ్డి తెలంగాణ అమ్మాయి. ఈమె పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాద్ లోనే అని తెలుస్తుంది. ఈమె తండ్రి రియల్ ఎస్టేట్ బిజినెస్ లో అగ్రగామి, అంతే కాకుండా అనేక వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతూ కోట్లు సంపాదిస్తున్నారు. అల్లు ఫ్యామిలీ కి మొదటి నుండి మంచి సన్నిహితుడు. అల్లు శిరీష్ కి నైనికా ఆయన సినిమాల్లోకి రాక ముందు నుంచే పరిచయం అట.. అప్పుడు ఫ్రెండ్స్ గా ఉండేవారట. పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరి ప్రేమను కొద్ది రోజులపాటు డేటింగుగా మార్చుకున్నట్లు టాక్.. ఇక తమ ప్రేమ గురించి ఇంట్లో చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఇక ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పి ఇరు పెద్దల అంగీకారంతో నిన్న ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు. గతంలో అల్లు శిరీష్ ఓ హీరోయిన్ తో రిలేషన్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి.. అవి కేవలం రూమర్స్ అని తెలుస్తుంది. ఇక అల్లు శిరీష్ నైనికల పెళ్లి జనవరి లేదా ఫిబ్రవరిలో జరగబోతుందని సమాచారం.. త్వరలోనే పెళ్లి డేట్ ని అనౌన్స్ చేయబోతున్నారని టాక్.

Related News

Baahubali: The Epic Collections: ‘బాహుబలి: ది ఎపిక్‌’ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. ఆ రికార్డ్స్ బ్రేక్

Tamannah bhatia: బ్రేకప్ పై తొలిసారి స్పందించిన తమన్నా.. ఏమన్నారంటే?

Vijay -Rashmika: ఎంగేజ్మెంట్ తర్వాత తొలిసారి ఒకే వేదికపై రష్మిక – విజయ్.. ఇప్పుడైనా ఓపెన్ అవ్వండి రా!

Shambhala Trailer: సైన్స్ కి శాస్త్రానికి మధ్య పోరు.. అదిరిపోయిన శంబాల ట్రైలర్

Champion Teaser : బ్రిటీష్ వాళ్లతో ఫుట్ బాల్… ఆకట్టుకుంటున్న ఛాంపియన్ టీజర్..

Prasanth Varma: ఇలా సైలెంట్ గా ఉంటే కుదరదు వర్మ.. నోరు విప్పాల్సిందే

Andhra King Taluka Shooting: ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ షూటింగ్ అప్డేట్.. అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్..!

Big Stories

×