Kollywood Hero : ప్రేమ ఎప్పుడు ఎవరి మధ్య పుడుతుందో చెప్పడం కష్టమే. ఆ ఇద్దరి మధ్య ఎదురైన పరిస్థితులను బట్టి వాళ్ళ మధ్య ప్రేమ పుడుతుంది. సినీ ఇండస్ట్రీలో సినీ తారల మధ్య పుట్టే ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎంతోమంది స్టార్ హీరోలు, హీరోయిన్లు ప్రేమలో పడి వాళ్ళ బంధాన్ని పెళ్లి వరకు తీసుకెళ్తున్నారు. కొందరు మాత్రం కొద్ది రోజులు కలిసి ఉండి ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకొని ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఈ రోజుల్లో ఇలాంటి ప్రేమలు కామన్ కానీ అప్పట్లో హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటే ఖచ్చితంగా పెళ్లి పీటల వరకు వెళ్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకునే తమిళ హీరో కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆయన ప్రేమ నుంచి పెళ్లి వరకు అన్ని ట్విస్టులే అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఆయన లవ్ స్టోరీ గురించి ఒకసారి మనం తెలుసుకుందాం..
తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా పరిచయాల అవసరం లేదు.. ప్రత్యేకమైన పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు. ఈయన నటించిన అపరిచితుడు, ఐ సినిమాలు ఇప్పటికీ కళ్ళ ముందు కదులుతూనే ఉంటాయి. సినిమాల కోసం ఆయన పడే కష్టం అంతా ఇంతా కాదు. అందులో ప్రత్యేకంగా కనిపించేందుకు ఆయన ఎన్నో కసరత్తులు చేస్తూ వస్తుంటాడు. అయితే ఈ మధ్య పెద్దగా హిట్ సినిమాలు అయితే ఈ హీరో ఖాతాలో పడలేదు. ఇక ఇటీవలే ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన తన లవ్ స్టోరీ గురించి బయట పెట్టాడు. ఫిట్నెస్ కోచ్గా వచ్చిన అమ్మాయితో ప్రేమలో పడినట్లు చెప్పాడు. ఆ తర్వాత క్యాస్ట్ వేరైనా సరే ఇద్దరు ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. హిందూ క్రిస్టియన్ రెండు సాంప్రదాయాలలో రెండుసార్లు వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లి తర్వాత వెర్షనే వేరు. తాను నాకు తల్లి, భార్య.. నేనెప్పుడూ సినిమాలను మొదటి భార్యగా భావిస్తాను. ఆ విషయంలో ఎప్పుడూ శైలజ నాకు సపోర్ట్ చేస్తూ వచ్చింది. మా బంధం ఇప్పటికీ అలానే ఉండడానికి కారణం ఆమె నా మీద చూపిస్తున్న ప్రేమ నమ్మకం అని విక్రమన్నారు.
నేను సినిమా కోసం ఎంత పెద్ద రిస్క్ అయినా తీసుకుంటాను.. కొన్ని సినిమాలకు నేను చేసిన రిస్కు ప్రాణాలు మీద కూడా వచ్చేసింది. ఓ సందర్భంలో నాకు ఒక పెద్ద ప్రమాదం జరిగింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 23 ఆపరేషన్లు నాకు జరిగాయి. ఆ సమయంలో నేను చనిపోతానని అనుకున్నాను. శైలజ ధైర్యం నాకు ధైర్యాన్ని పెంచేసింది. ఆమె ఎల్లప్పుడూ నాకు మద్దతుగా నిలిచింది. ఆమె మనస్తత్వవేత్త.. ఎప్పుడూ అందరికీ సహాయం చేస్తుంది..
భార్యాభర్తల మధ్య ఎంత ప్రేమ ఉన్నా సరే ఏదో ఒక విషయంలో గొడవలు అనేవి జరుగుతాయి. కొన్నేళ్లుగా భార్యా భర్తల నడుమ తప్పులు ఉన్నాయని అర్థం చేసుకున్నామని కూడా చెప్పాడు. కానీ వివాహ బంధంలో చాలా తెలుసుకోవాలని అన్నారు. ప్రస్తుతం నా భార్య పిల్లలతో నేను సంతోషమైన జీవితాన్ని గడుపుతున్నాను అని విక్రమ్ ఆ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఆయనకు ఒక కుమార్తె ఒక కొడుకు. ఆయన కొడుకు కూడా ఈ మధ్య సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
Also Read : బిగ్ బాస్ 8వ వారం ఎలిమినేట్ అతనే..? ఓటింగ్ రివర్స్.. విన్నర్ ఎవరంటే..?
తెలుగులో విక్రమ్ మొదటి సినిమా దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన అక్క పెత్తనం చెల్లెలి కాపురం. ఇందులో రాజేంద్రప్రసాద్ స్నేహితుడి పాత్రలో నటించాడు విక్రమ్.. ప్రస్తుతం తమిళ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు.. ఈమధ్య ఈయన నటించిన సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వలేదు కానీ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం ఆయన ఓ రెండు ప్రాజెక్టులలో నటిస్తున్నట్లు టాక్..