BigTV English
Advertisement

Vijay -Rashmika: ఎంగేజ్మెంట్ తర్వాత తొలిసారి ఒకే వేదికపై రష్మిక – విజయ్.. ఇప్పుడైనా ఓపెన్ అవ్వండి రా!

Vijay -Rashmika: ఎంగేజ్మెంట్ తర్వాత తొలిసారి ఒకే వేదికపై రష్మిక – విజయ్.. ఇప్పుడైనా ఓపెన్ అవ్వండి రా!

Vijay -Rashmika: విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్నా(Rashmika Mandanna) ఇద్దరు ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఈ జంట తమ ఎంగేజ్మెంట్ కి సంబంధించి అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. కానీ విజయ్ దేవరకొండ, రష్మిక ల టీం మాత్రం మీడియాకి ఈ న్యూస్ లీక్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఎంగేజ్మెంట్ గురించి స్పందించని ఈ జంట ఎంగేజ్మెంట్ తర్వాత మొదటిసారి ఒకే వేదికపై కనిపించబోతున్నారు. మరి అప్పుడైనా వీరు తమ ఎంగేజ్మెంట్ విషయాన్ని బయట పెడతారా అనేది ఇప్పుడు చూద్దాం..


ఎంగేజ్మెంట్ తర్వాత తొలిసారి ఒకే వేదికపై..

రష్మిక మందన్నా నటించిన తాజా మూవీ ది గర్ల్ ఫ్రెండ్ మరో 6 రోజుల్లో విడుదల కాబోతోంది. నవంబర్ 7న రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ మూవీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్స్ చేస్తూ సినిమాని తెగ ప్రమోట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండలు ఈ సినిమా కోసం ఒకే వేదికపై కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక రీసెంట్ గా అల్లు అరవింద్ ది గర్ల్ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో రష్మిక మందన్నాని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తూ రష్మిక అభిమానులందరూ ఫిదా అయ్యేలా ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పారు. అన్ని సెట్ అయితే ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విజయ్ దేవరకొండను చీఫ్ గెస్ట్ గా పిలుద్దాం అని చెప్పారు. అయితే అల్లు అరవింద్ చెప్పడం కాదు చేసి చూపించబోతున్నారని తెలుస్తోంది. అదేంటంటే ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను గ్రాండ్ గా చేయాలని మూవీ మేకర్స్ నిర్ణయించుకున్నారట. అయితే ఈ ఈవెంట్ కి నిజంగానే విజయ్ దేవరకొండను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించబోతున్నట్టు తెలుస్తోంది.

ALSO READ:The Raja Saab: ది రాజాసాబ్ బిజినెస్ పార్ట్నర్స్.. ఏ ఏరియాలో ఎవరంటే?


ఇప్పుడైనా ఓపెన్ అవుతారా?

అయితే ఈ మధ్యనే ఎంగేజ్మెంట్ జరిగినట్టు వార్తలు వినిపించిన నేపథ్యంలో రష్మిక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ కచ్చితంగా వస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఇద్దరు ఓకే వేదిక పైకి వస్తే ఖచ్చితంగా వారి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ప్రశ్న ఎదురవుతుంది.మరి ఈ ప్రశ్నకు రష్మిక,విజయ్ దేవరకొండలు ఏం సమాధానం ఇస్తారు? అనేది చూడాలి. ఏది ఏమైనప్పటికీ ఇద్దరు ఒకే వేదిక మీద కనిపించారంటే ఇక అభిమానులకి పండగే. అంతేకాదు వీరి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన విషయాన్ని కూడా స్టేజిపై అధికారికంగా అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. ఇక రీసెంట్ గానే రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో అందరికీ తెలిసిందే కదా అని విజయ్ దేవరకొండ తో ఉన్న రిలేషన్ ని కన్ఫర్మ్ చేసింది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ ఒకే వేదికపైకి వచ్చారంటే కచ్చితంగా తమకు ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని ఒప్పుకుంటారని తెలుస్తోంది.

ప్రేమ మొదలైంది అక్కడే..

రష్మిక, విజయ్ ల ఎంగేజ్మెంట్ వార్తలు వినిపించిన నెక్స్ట్ డే నుండే ఎంగేజ్మెంట్ రింగ్స్ తో కనిపిస్తున్నారు.. మరి చూడాలి రష్మిక విజయ్ దేవరకొండలు ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అయినా తమ ప్రేమ విషయాన్ని, ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని అభిమానుల ముందు ఒప్పుకుంటారా అనేది. ఇక రష్మిక, విజయ్ దేవరకొండల మధ్య బంధం ఏర్పడింది గీతగోవిందం సినిమా సమయంలో..ఈ సినిమా సమయంలోనే వీరి మధ్య రిలేషన్ ఏర్పడి అది కాస్త ప్రేమకి దారితీసింది.ఇక డియర్ కామ్రేడ్ సినిమా సమయంలో వీరి మధ్య ఉన్న బాండింగ్ మరింత ఎక్కువ అవ్వడంతో చాలా రోజుల నుండి సీక్రెట్ గా వీరు డేటింగ్ చేస్తున్నారు. అలా ఎట్టకేలకు ఈ ఏడాది అక్టోబర్ 4న విజయ్ దేవరకొండ ఇంట్లో అతికొద్ది మంది సన్నిహితుల మధ్య ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.

Related News

Allu Sirish -Nainika: అల్లు శిరీష్ నైనిక ప్రేమ వెనుక ఆ మెగా కపుల్ హస్తం ఉందా?సీక్రెట్ బయటపెట్టిన శిరీష్!

Lokesh Kanagaraj: హీరోయిన్ చేతిలో కం*డో*మ్.. హీరో గదిలో.. బోల్డ్ గా లోకి డీసీ టీజర్ !

Upasana -Ram Charan: పెద్ది పనులలో చరణ్ .. మిస్ అవుతున్న ఉపాసన..పోస్ట్ వైరల్!

Actor Rajasekhar: నాకు ఆ వ్యాధి ఉంది… బైకర్ మూవీ ఈవెంట్‌లో బాంబ్ పేల్చిన రాజశేఖర్

Sandeep Reddy Vanga: ఒక్కో డైరెక్టర్ దగ్గర రెండు టీమ్స్, ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యేలా ఉంది

Ram charan: గ్లోబల్ స్టార్‌ ట్యాగ్‌ను రిమూవ్ చేసిన రామ్ చరణ్… స్టార్స్ చూసి నేర్చుకోవాలి

Kalki Movie: ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్… మరో గౌరవం అందుకున్న ప్రభాస్ సినిమా!

Biker Glimpse : బైకర్ గ్లిమ్స్ రిలీజ్, అదరగొట్టిన శర్వా సక్సెస్ ఖాయమేనా?

Big Stories

×