E-Paper
Advertisement

హార్ట్ టచ్ ఫీలింగ్.. ఆకట్టుకుంటున్న దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్!

హార్ట్ టచ్ ఫీలింగ్.. ఆకట్టుకుంటున్న దుల్కర్ సల్మాన్  ‘ఆకాశంలో ఒక తార’ టీజర్!
Advertisement

Aakasamlo oka tara Teaser:దుల్కర్ సల్మాన్ (Dulquer Salman).. మలయాళ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. నేరుగా తెలుగులో సినిమాలు చేస్తూ ఆ చిత్రాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటూ.. తెలుగు హీరోగా ఆడియన్స్ హృదయాలలో చెరగని ముద్ర వేసుకుంటున్నారు. సీతారామం సినిమాతో భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న ఈయన ఆ తర్వాత లక్కీ భాస్కర్ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. మధ్యలో పలు చిత్రాలతో ఆకట్టుకున్న దుల్కర్ సల్మాన్.. ఇప్పుడు ‘ఆకాశంలో ఒక తార’ అనే హార్ట్ టచ్ ఫీలింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు.

ఆకాశంలో ఒక తార మూవీ నుండి టీజర్ రిలీజ్..

దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సాత్విక వీరవల్లి హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. నవంబర్ 20వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో శృతిహాసన్ తనదైన పర్ఫామెన్స్ తో ఆకట్టుకోబోతున్నారు. తాజాగా చిత్ర బృందం టీజర్ ను విడుదల చేసింది. “ఆమె కల.. అతడి నమ్మకం.. ఇది వారిద్దరి ప్రయాణం”.. అనే క్యాప్షన్ తో విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

టీజర్ ఎలా ఉందంటే?

Advertisement

తాజాగా విడుదల చేసిన టీజర్ విషయానికి వస్తే.. “మన కల్పన ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యింది. జిల్లా ఫస్ట్.. మన ఊరికి ఎంత మంచి పేరు తెచ్చిపెట్టిందయ్యా ” అని డైలాగ్ తో టీజర్ ప్రారంభించారు. దుల్కర్ వాయిస్ తో “అమ్ములు నువ్వు కష్టపడి చదువుతానంటే నేను చదివిస్తాను.. కాలేజీకి వెళ్తావా ?” అంటూ చెబుతున్నప్పుడు సాత్విక ఇంట్రడక్షన్ చూపించారు. ఈమె చాలా సాంప్రదాయంగా పల్లెటూరి అమ్మాయి గెటప్ లో చక్కగా ఒదిగిపోయింది. “కృష్ణ గారండి మీరు చాలా మంచివారండి” అంటూ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. “చదువుకొని ఏం సాధించాలి.. మీ ఊరి పొలిమేర కూడా దాటలేవు” అనే డైలాగు..” దాటుతాను సార్.. ఈ ఊరి పొలిమేర కాదు.. ఈ భూమి పొలిమేర ” అని చెప్పే డైలాగు ఆమె లక్ష్యాన్ని చూపించింది. “గమ్యాన్ని చేరేది మనం మాత్రమే కాదు కృష్ణ.. మనల్ని నమ్మి మన కలల్ని భుజాల మోసే వాళ్లు కూడా..”, ” కల కనడం గొప్ప..తన కలే లేకపోతే అసలు ఈ కృష్ణ అనే వాడు ఉన్నాడా?” అనే హార్ట్ టచ్ డైలాగ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

ALSO READ:ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

పాన్ ఇండియా భాషల్లో నవంబర్ 20న విడుదల..

Advertisement

ముఖ్యంగా కల్పన అంతరిక్ష మిషన్ లో పనిచేయడానికి కృష్ణ పడిన తపన, వేదన ఇందులో హైలెట్గా చూపించారు. మొత్తానికి అయితే టీజర్ తోనే సినిమాపై అంచనాలు భారీగా పెంచేశారు. మరి ఈ సినిమా నవంబర్ 20న థియేటర్లలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. జీవి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం లైట్ బాక్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్ ,మలయాళం, హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 20న థియేటర్లలోకి రానుంది.

Related News

ఇండస్ట్రీలో విషాదం.. మ్యూజిక్ డైరెక్టర్ ‘దేవా’ కన్నుమూత!

కావ్య మారన్ తో అనిరుధ్ పెళ్లి ఫిక్స్.. వారికి ప్రత్యేక ఆహ్వానం!

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

Big Stories

Advertisement
×