E-Paper
Advertisement

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!
Advertisement

Bigg Boss 10:తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం ఊహించని మలుపులతో ఆడియన్స్ లో ఆసక్తిని కలిగిస్తోంది. తెలుగులో 9 సీజన్లు పూర్తికాగా, పదవ సీజన్ అప్పుడే 5 వారాలు పూర్తయింది . ఐదు వారాలకు గాను మొత్తం 6 మంది ఎలిమినేట్ అయ్యారు. ఇక ఆరవ వారం ఏకంగా 6 మంది నామినేషన్ లోకి వచ్చారు. ఇందులో ముగ్గురు సెలబ్రిటీలు (వర్షిణి, రాంప్రసాద్, వంశీ ) కాగా, మరో ముగ్గురు కామనర్స్ (శాలిని,అమన్, రోహిత్) వీరు నామినేషన్ లోకి వచ్చారు. ఇక ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయం మరింత ఉత్కంఠగా సాగుతోంది.

తారుమారైన ఓటింగ్..

ఇకపోతే నిన్న మొన్నటి వరకు వంశీ, వర్షిణి లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని అనుకున్నారు. కానీ మొన్న వంశీకి సింపతి ఎపిసోడ్ పడడంతో అనూహ్యంగా ఓటింగ్లో టాప్లోకి దూసుకొచ్చారు. పైగా మొదటి నుండి నెట్టింట పూర్తిగా నెగిటివిటీ మూట కట్టుకున్న శాలిని కూడా ఈసారి ఎలిమినేషన్ నుండి బయటపడినట్లు తెలుస్తోంది. అయితే ఈసారి యాంకర్ వర్షిని బయటకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో భారీ ఫాలోవర్లు ఉన్న ఈమె, యాంకర్ గా మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అయినప్పటికీ ఓటింగ్ లో ఈవారం ఊహించని విధంగా డేంజర్ జోన్ లో నిలబడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నిజానికి గత వారంలో కూడా ఆమె డేంజర్ జోన్ లోకి వెళ్ళినా.. వివిధ కారణాల వల్ల సేవ్ అవుతూ వచ్చింది.

Advertisement

also read:కావ్య మారన్ తో అనిరుధ్ పెళ్లి ఫిక్స్.. వారికి ప్రత్యేక ఆహ్వానం!

శాలిని సేఫ్.. వర్షిణి పై వేటు..

ముఖ్యంగా ఈసారి మాత్రం ఓటింగ్ శాతం లో బాగా వెనకబడిపోయి ఉండడం అభిమానులను కలవరపెడుతోంది. నిజానికి నిన్న జరిగిన ఎపిసోడ్లో తాను ఎలిమినేట్ అవుతానని చెప్పినా.. త్రిగుణ్ మాత్రం నువ్వు బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. నిన్నెలా హౌస్ నుండి పంపిస్తారు? అసలు ఇంత అందం లేని హౌస్ లో మేము ఎలా ఉండగలం.. అంటూ పులిహోర కలిపేశాడు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఓటింగ్లో వర్షిని లీస్టులో ఉండడం గమనార్హం. ఇక మరొకవైపు రోహిత్ ఓటింగ్ లో టాప్ లో కొనసాగుతుండగా.. మిగతా కంటెస్టెంట్ల మధ్య పోటీ గట్టిగానే నడుస్తోంది. దీంతో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే ఉత్కంఠ ప్రేక్షకులలో విపరీతంగా పెరిగింది.. మొత్తానికైతే పలు కారణాలవల్ల గత నాలుగు వారాల నుంచి ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటున్న వర్షిని ఈ వారం బయటకు రాక తప్పదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి చూద్దాం ఎవరు ఈ వారం హౌస్ నుండి బయటకు వస్తారో.

కెప్టెన్సీ పదవి ఎవరికి?

Advertisement

ఇక మరొకవైపు నిన్నటి ఎపిసోడ్లో జరిగిన వార్ లో ఎట్టకేలకు గేమ్ మొత్తాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని గ్రీన్ టీం ను విన్ చేసి కంటెండర్ షిప్ లో పోటీ పడడానికి అవకాశం కల్పించారు త్రిగుణ్ . దీంతో గోల్డ్ టీం తో ఆయనకు వ్యతిరేకత ఏర్పడింది. మరి నేటి ఎపిసోడ్లో ఎవరు కంటెండర్ షిప్ లో పోటీపడి కెప్టెన్సీ పదవిని దక్కించుకుంటారో చూడాలి.

Related News

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Big Stories

Advertisement
×