Dulquer Salmaan : పేరుకు మలయాళీ నటుడు అయినా కూడా తెలుగులో మంచి క్రేజ్ సాధించుకున్నాడు దుల్కర్ సల్మాన్. మహానటి సినిమాతో తెలుగులోకి ఎంటర్ అవ్వకముందే అతని సినిమాలను వెతుక్కుని మరీ చూసిన ఆడియన్స్ ఉన్నారు. మహానటి సినిమాలో జెమినీ గణేషన్ పాత్రలో కనిపించాడు దుల్కర్. అది నెగిటివ్ రోల్ అయినా కూడా చాలామందికి విపరీతంగా నచ్చేసాడు. ఆ పాత్రను నాగి డిజైన్ చేసిన విధానం అలాంటిది.
ఆ సినిమా తర్వాత తెలుగులో చేసిన రెండు సినిమాలు కూడా మంచి సక్సెస్ అయిపోయాయి. లక్కీ భాస్కర్ సినిమా కమర్షియల్ గా కూడా మంచి సక్సెస్ సాధించింది. ఇక ప్రస్తుతం కాంత అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇదివరకే సినిమా నుంచి విడుదలైన కంటెంట్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం తెలుగు దర్శకుడు పవన్ సాదినేనితో దుల్కర్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
పవన్ సాదినేని దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా ఆకాశంలో ఒక తార అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాను మార్చి 26న విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు. దీని గురించి ఇంకా అధికారక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఇదే డేట్ కి రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా విడుదల కానుంది. అలానే మరుసటి రోజు నాని నటిస్తున్న పారడైజ్ సినిమా విడుదల కానుంది.
ఈ రెండు సినిమాలు మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ రెండిటి మధ్యలో దుల్కర్ సినిమా రిలీజ్ అవ్వడం అనేది ఒక రిస్క్ పాయింట్. అయితే వీటిలో పారడైజ్ సినిమా పోస్ట్ పోన్ అవుతుంది అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. దాన్లో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది తెలియదు.
దుల్కర్ ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ కూడా తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్ అయిపోయాయి. ఇప్పుడు నాలుగు వచ్చిన మాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. అయితే అంత పోటీలో దుల్కర్ ముందుకు వస్తాడా లేకపోతే సినిమాను వాయిదా వేస్తాడా అని టాక్ కూడా ఆల్రెడీ ఇండస్ట్రీ వర్గాల్లో మొదలైపోయింది.
మరి కొంతమంది మాటలు ప్రకారం ఆ డేట్ కి వస్తాడు అనేది కేవలం ఊహాగానాలు మాత్రమే వస్తుందా రాదా అనేది ఇప్పట్లో తేలే విషయం కాదు అనేది కొంతమంది అభిప్రాయం. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యానర్లో వచ్చిన సినిమాలు మంచి సక్సెస్ సాధిస్తున్నాయి.
Also Read: Girija oak : ఆకస్మాత్తుగా వైరల్ అయిన మరాఠి బ్యూటీ, సందీప్ కిషన్ తో ఆ సీన్స్