E-Paper
Advertisement

Top 20 News Today: రిజిస్ట్రేషన్ కార్యాలయంపై ఆకస్మిక దాడులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్తకు వరల్డ్ లీడర్ ఫర్ పీస్

Top 20 News Today: రిజిస్ట్రేషన్ కార్యాలయంపై ఆకస్మిక దాడులు,  ప్రముఖ ఆధ్యాత్మికవేత్తకు వరల్డ్ లీడర్ ఫర్ పీస్
Advertisement

1. పిఠాపురంలో నకిలీ నెయ్యి

కాకినాడ జిల్లా పిఠాపురంలో నకిలీ నెయ్యి కలకలం రేపింది. పిఠాపురం 9వ వార్డు మాధవనగర్‌లో పశువుల కొవ్వుతో నెయ్యి తయారు చేస్తున్నారని విశ్వ హైందవ పరిషత్ అధ్యక్షుడు దువ్వ వెంకటేశ్వరరావు సమాచారం ఇచ్చారు. అధికారులు స్పందించి తనిఖీలు నిర్వహించారు. ఈ నెయ్యిని పవిత్ర ఆలయాలకు సరఫరా చేస్తున్నట్లు దువ్వా తెలిపారు. మున్సిపల్ కమిషనర్‌కి ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆయన ఆరోపించారు.

Advertisement

2. సినిమాలోకి రీ ఎంట్రీ

మాజీ మంత్రి, నటి రోజా మళ్లీ సినిమాలోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. బాలచంద్రన్ దర్శకత్వంలో తమిళ సినిమా లెనిన్ పాండియన్‌లో సంతానం పాత్రలో ఆమె నటిస్తున్నారు. ఒకప్పుడు తెలుగు, తమిళ సినిమా ఇండస్ట్రీలో హీరోయి‌న్‌గా రోజా ఒక వెలుగు వెలిగారు. తర్వాత రాజకీయాల్లోకి అడుగుబెట్టాక సినిమాలకు స్వస్తి పలికారు.

Advertisement

3. టెంపుల్ టూరిజం హబ్

రాష్ట్రాన్ని టెంపుల్ టూరిజం హబ్‌గా మార్చాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమనన్నారు. మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. సకల దేవతల అనుగ్రహంతో రైతులకు మేలు జరిగితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఆయన అన్నారు. బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ నూతన ధర్మకర్తల మండల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పుల్లారావు పాల్గొన్నారు.

4. రిమాండ్ ఖైదీ పరార్

పోలీస్ స్టేషన్ నుంచి రిమాండ్ ఖైదీ పరారైన ఘనట కుమురంభీం జిల్లా తిర్యాని మండలంలో చోటుచేసుకుంది. మంత్రాల నెపంతో హనుమంతరావును గొడ్డలితో నరికి చంపిన నిందితుడు సీడం వినోద్ రెబ్బెన పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయినట్లు సమాచారం. పోలీసులు స్పందించకపోవడంపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

5. ఏసీబీ తనిఖీలు

గత ప్రభుత్వంలో జిల్లాలను అర్థరహితంగా చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఇప్పుడు పరిపాలనా సౌలభ్యం మేరకు రూట్‌మ్యాప్‌తో ఒక కొలిక్కి తెచ్చామని తెలిపారు. మరొక రెండు రోజుల్లో నివేదికను సీఎంకు అందిస్తామని, రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఏసీబీ తనిఖీలు నిర్వహించడం శుభపరిణామమని చెప్పారు.

6. ఉత్సవాల్లో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ

కార్తీక పౌర్ణమి సందర్భంగా బాసర గోదావరి నది తీరం ఆధ్యాత్మిక శోభతో వెలిగింది. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల ఉత్సవాలలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు గోదావరికి మహా హారతి, జ్వాలాతోరణం నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

7. స్థానికుల ర్యాలీ – హైడ్రా
మణికొండలోని వెంకటేశ్వర కాలనీలో తారామతి బారాదరి వరకు రోడ్డు నిర్మాణానికి అడ్డుగా ఉన్న ఆక్రమణలను ‘హైడ్రా’ తొలగించింది. దీంతో GHMC రోడ్డు పనులు ప్రారంభించింది. తమ చిరకాల వాంఛ నెరవేర్చినందుకు సంతోషించిన స్థానికులు ర్యాలీగా వచ్చి ‘థాంక్స్ టు హైడ్రా’ అంటూ కృతజ్ఞతలు తెలియజేశారు.

8. కార్తీక దీపోత్సవం

తెలంగాణలోని వనదుర్గామాత ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక దీపోత్సవం కన్నుల పండువగా జరిగింది. మహిళలు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అమ్మవారి పల్లకి సేవను నిర్వహించి.. మొక్కులు చెల్లించుకున్నారు.

9. నాగర్ కర్నూలులో దారుణం

నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. భర్త మల్లేష్ అదృశ్యం కావడంతో.. భార్య శిరీష కుటుంబసభ్యులు మల్లేష్ తల్లిదండ్రులు, తమ్ముడిపై గొడ్డలితో దాడి చేశారు. దాడిలో మల్లేష్ తండ్రి, తమ్ముడి పరిస్థితి విషమంగా ఉండగా, వారిని హైదరాబాద్ హాస్పిటల్‌కు తరలించారు.

10. అక్రమ వసూళ్లు

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఇసుక రేవులో ట్రిప్పుకు రూ.50 ఆసీలు, రూ.100 మెయింటెనెన్స్ పేరుతో అక్రమ వసూళ్లు పాల్పడుతున్నారు. లోడింగ్‌కు రూ.750-800 తీసుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక నాయకుడి కనుసన్నల్లోనే ఇసుకను పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.

11. కిటకిటలాడుతున్నభక్తులు

కార్తీక పౌర్ణమి సందర్భంగా తిరుపతి జిల్లాలోని శైవ ఆలయాలు కిటకిటలాడిపోతున్నాయి. తెల్లవారుజాముల నుంచే భక్తులు ఆలయానికి చేరుకొని దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. వీరికి తోడు అయ్యప్ప భక్తులు కూడా రావడంతో ఆలయాలు పోటెత్తాయి.

12. నకిలీ పోలీస్‌ను అరెస్ట్

మాజీమంత్రి కొడాలి నాని అనుచరుడు అరెస్ట్ అయ్యాడు. పోలీస్ అవతారం ఎత్తిన గంటా శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్‌ను అంటూ బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. పూజారులను సైతం కొడాలి నాని అనుచరుడు గంటా శ్రీనివాసరావు భయభ్రాంతులకు గురిచేశాడు. బాధితుల ఫిర్యాదుతో నకిలీ పోలీస్‌ను అరెస్ట్ చేశారు.

13. అత్యున్నత ఉద్యోగాలు.. నాగభూషణ్

యువతకు అత్యున్నత ఉద్యోగాలు కల్పించడం, వారిని గొప్ప పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా చేయడం లాంటి సమున్నత లక్ష్యాలతో ముందుకెళుతున్నామన్నారు విజ్ఞాన్‌ యూనివర్సిటీ వీసీ పీ.నాగభూషణ్‌. 2026–27 సంవత్సరానికి సంబంధించి నోటిఫికేషన్‌ను ఆయన విడుదల చేశారు. విద్యార్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

14. విద్యార్థి సూసైడ్

తూర్పు గోదావరి జిల్లాలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజానగరంలోని తిరుమల కాలేజ్ క్యాంపస్‌లో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థి హాస్టల్ రూమ్‌లో ఉరివేసుకుని.. సూసైడ్‌ చేసుకున్నాడు. విద్యార్థిని కాలేజీ యాజమాన్యం హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించినా.. ఫలితం లేదు. అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు.

15.రిజిస్ట్రేషన్ కార్యాలయంపై ఆకస్మిక దాడులు

ప్రకాశం జిల్లా ఒంగోలు రిజిస్ట్రేషన్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. కొంతమంది ఉద్యోగులు తమ జేబుల్లో ఉన్న నగదును బయటకు విసిరేయడంతో కొంతసేపు హడావుడికి దారితీసింది. ముప్పై వేల రూపాయలు నగదును ఉద్యోగులు కిటికీలో నుంచి బయటకు విసిరివేయగా ఆ నగదును అధికారులు స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు.

16. ప్రముఖ ఆధ్యాత్మికవేత్తకు వరల్డ్ లీడర్ ఫర్ పీస్

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుదేవ్ రవిశంకర్‌కు వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డు లభించింది. బోస్టన్ గ్లోబల్ ఫోరం, AI వరల్డ్ సొసైటీ ఆధ్వర్యంలో అమెరికాలోని బోస్టన్‌లో ఆయనను సన్మానించారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి, పరిరక్షణ, నాయకత్వ ప్రోత్సాహానికి, 180 దేశాలలో మానవతా ప్రభావానికి, AI యుగంలో నైతిక మార్గదర్శకత్వం చేసినందుకు ఆయనకు ఈ పురస్కారం దక్కింది.

17. కీలక అప్‌డేట్

ఇస్రో ఛైర్మన్ నారాయణన్ కీలక అప్‌డేట్ అందించారు. నాసా-ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేసిన నిసార్ ఉపగ్రహం నవంబర్ 7 నుంచి ఆపరేషన్‌లో రానుంది. ఈ ఉపగ్రహం భూమిపై మంచు కేంద్రాలను ప్రతీ 12 రోజులకు రెండుసార్లు పర్యవేక్షించింది. నిసార్‌లో ఉన్న ఎల్-బ్యాండ్, ఎస్-బ్యాండ్ సెన్సార్‌లు అడవులు, వ్యవసాయం, మంచు, తేమకు సంబంధించిన అసాధారణ డేటాను అందించనున్నాయి.

18. ప్రభుత్వం నిర్ణయంపై ఆందోళన

జమ్మూకాశ్మీర్ పాఠశాలల్లో వందేమాతరం తప్పనిసరి చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. అయితే దీనిని అక్కడి ముస్లిం మతం సంస్థలు వ్యతిరేకించాయి. ఎంఎంయూ ప్రభుత్వం నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేసింది.

19. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య వార్

ఛత్తీస్‌గడ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దులోని బీజాపూర్ జిల్లా అన్నారం అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో సుమారు ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఆ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

20. ఎన్టీఆర్ న్యూ లుక్

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమా కోసం ఎన్టీఆర్ కొత్త మేకోవర్‌లో కనిపించారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అలా స్టైలిష్‌గా నడుచుకుంటూ.. కెమెరా వైపు చూస్తు.. స్మైల్ ఇస్తూ మీసం తిప్పుతు కనిపించాడు.

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×