E-Paper
Advertisement

Nirmala Sitharaman: డిజిటల్ అరెస్ట్‌ ట్రాప్.. నిర్మలా సీతారామన్‌ ఫోర్జరీ సంతకంతో వృద్ధురాలికి రూ. 99 లక్షలు టోపీ!

Nirmala Sitharaman: డిజిటల్ అరెస్ట్‌ ట్రాప్.. నిర్మలా సీతారామన్‌ ఫోర్జరీ సంతకంతో వృద్ధురాలికి రూ. 99 లక్షలు టోపీ!
Advertisement
Nirmala Sitharaman: దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలో రెచ్చిపోతున్నారు. ‘డిజిటల్ అరెస్ట్’ (Digital Arrest) అనే సరికొత్త మోసంతో సామాన్యులను భయభ్రాంతులకు గురిచేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. తాజాగా పుణెకు చెందిన 62 ఏళ్ల రిటైర్డ్ ఎల్ఐసీ అధికారిణి ఈ వలలో చిక్కుకున్నారు. ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, ఆమెను ‘డిజిటల్ అరెస్ట్’ చేశామని నమ్మించి, ఏకంగా రూ. 99 లక్షలు దోచుకున్నారు. ఈ సంచలన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణెకి చెందిన బాధితురాలికి (62) ఇటీవల ‘డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ’ ప్రతినిధిగా పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆమె ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌ను మోసపూరిత లావాదేవీల కోసం దుర్వినియోగం చేశారని, తీవ్రమైన కేసులో ఇరుక్కున్నారని నమ్మబలికాడు.

బాధితురాలు ఆందోళన చెందుతున్న సమయంలోనే, ‘జార్జ్ మాథ్యూ’ అనే సీనియర్ పోలీసు అధికారిగా మరో వ్యక్తి వీడియో కాల్ చేశాడు. ఆమెపై మనీలాండరింగ్ కేసు నమోదు చేశామని, వెంటనే బ్యాంకు ఖాతాలన్నీ స్తంభింపజేస్తామని హెచ్చరించాడు. ఈ నేరాలకు గాను ఏకంగా కేంద్ర ఆర్థిక శాఖ నుంచి అరెస్ట్ వారెంట్ జారీ అయిందంటూ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నకిలీ సంతకం (Nirmala Sitharaman’s signature dupe) ఉన్న వారెంట్‌ను వాట్సాప్‌లో పంపాడు.

Advertisement

Read Also: Telegram:టెలిగ్రామ్‌పై భారత ప్రభుత్వం ఉక్కుపాదం.. అక్రమాలకు అడ్డాగా మారిందన్న ఆరోపణలపై దర్యాప్తు!

అక్రమ కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆమెను ‘డిజిటల్‌ అరెస్ట్‌’ చేశామని, దర్యాప్తు అధికారి నిఘాలో ఉండాలని, వాట్సాప్ కాల్‌ను అస్సలు కట్ చేయకూడదని షరతు విధించాడు. ఈ కేసు నుంచి బయటపడాలంటే, ధ్రువీకరణ కోసం తన వద్ద ఉన్న నిధులన్నింటినీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఖాతాలకు బదిలీ చేయాలని ఆదేశించాడు. శిక్ష పడుతుందన్న భయంతో ఆందోళన చెందిన ఆ వృద్ధురాలు, నేరగాళ్లు చెప్పినట్లుగా వివిధ ఖాతాలకు విడతలవారీగా రూ. 99 లక్షలు బదిలీ చేసింది.

Advertisement

డబ్బు మొత్తం బదిలీ అయ్యాక, నిందితుడి నంబర్ స్విచ్ ఆఫ్ రావడంతో తాను మోసపోయానని గ్రహించి, బాధితురాలు పుణె సిటీ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు, డబ్బు బదిలీ అయిన బ్యాంకు ఖాతాలను గుర్తించి, వాటిని స్తంభింపజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×