E-Paper
Advertisement

Kantha Censor Review : ‘కాంత’ సెన్సార్ రివ్యూ.. దుల్కర్ ఆ ఒక్కటి చేసుంటే బాగుండేదా..?

Kantha Censor Review : ‘కాంత’ సెన్సార్ రివ్యూ.. దుల్కర్ ఆ ఒక్కటి చేసుంటే బాగుండేదా..?
Advertisement

Kantha Censor Review : సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుందన్న విషయం తెలిసిందే.. ఈమధ్య థియేటర్లోకి వస్తున్న స్టార్ హీరోలు సినిమాలన్నీ కూడా పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటుగా కలెక్షన్ల సునామి సృష్టిస్తున్నాయి. తెలుగు, తమిళ్ తో పాటు మలయాళ ఇండస్ట్రీలో కూడా అలాంటి క్రేజ్ ఉన్న హీరోలు ఉన్నారు. అందులో దుల్కర్ సల్మాన్ ఒకరు.. ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు..ఈ హీరో తాజాగా నటిస్తున్న మూవీ ‘కాంత’.. డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ డైరెక్షన్లో ఈ మూవీ తెరకెక్కుతుండగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే తెలుగు హీరో రానా కూడా ఇందులో నటిస్తున్నాడు. మరి కొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీ తాజాగా సెన్సార్ రివ్యూ ను పూర్తి చేసుకుంది. రివ్యూలో ఏముంది? మూవీ నిడివి ఎంత? వంటి వివరాలను ఒకసారి చూసేద్దాం..

“కాంత” సెన్సార్ రివ్యూ.. ఎలా ఉందంటే..?

దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘కాంత’.. ఈ సినిమాకి దుల్కర్,రానా ఇద్దరు నిర్మాతలుగా కూడా చేస్తున్నారు. అలా ఈ సినిమా మరికొద్ది గంటల్లో అంటే నవంబర్ 14న మన ముందుకు రాబోతుంది.. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ ని మొదలుపెట్టారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే పెరిగాయి. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఇందులో హీరో, డైరెక్టర్ మధ్య గొడవల పై స్టోరీ సాగుతుందని టాక్.. ఒకరి మీద ఒకరు పై చేయి సాధించడానికి ఎలాంటి ఎత్తులు వేశారు అనేది ఈ సినిమాలో చాలా క్లియర్ గా చూపించారు. రానా కూడా ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించునున్నాడు. ఈ మూవీ యు / ఎ సర్టిఫికెట్ ను అందుకుంది. 2.40 ల నిడివితో మూవీ ఉంటుంది.

Advertisement

Also Read :గర్ల్ ఫ్రెండ్ కి వెళ్తే హెల్మెట్ తీసుకెళ్లండి… అబ్బాయిలకు నిర్మాత వార్నింగ్..

దుల్కర్ చేసిన అతి పెద్ద మిస్టేక్ ఇదే.. 

ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే హీరో ఇంట్లో నుంచి ఎండింగ్ క్లైమాక్స్ వరకు అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలి. లేదంటే మాత్రం ఆ సినిమాకి ఎఫెక్ట్ బాగానే పడుతుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకి పర్ఫెక్షన్ ఇంపార్టెంట్ అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీకి కొన్ని మైనస్ లు కూడా ఉన్నాయట. సినిమాను విజువల్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన విధానం బాగుంది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాగా ఆకట్టుకునేలా ఉంది. కానీ క్లైమాక్స్ సీన్ మాత్రం డల్ గా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. భాగ్య శ్రీ బోర్ సే చాలా అద్భుతమైన నటన కనబరించిందని తెలుస్తుంది. సెన్సార్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి రేపు రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×