E-Paper
Advertisement

Investment In Ap: ఏపీలో మరో పెద్ద పెట్టుబడి.. గూగుల్ తర్వాత ఆ కంపెనీదే, మంత్రి లోకేష్ ప్రకటన

Investment In Ap: ఏపీలో మరో పెద్ద పెట్టుబడి.. గూగుల్ తర్వాత ఆ కంపెనీదే, మంత్రి లోకేష్ ప్రకటన
Advertisement

Investment In Ap: ఏపీ అభివృద్ధికి సీఎం చంద్రబాబు ఒకవైపు.. మరోవైపు మంత్రి లోకేష్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ ఏడాదిలోపు మాగ్జిమమ్ పెట్టుబడులను రప్పించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో రూ. 82 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఓ కంపెనీ ముందుకొచ్చింది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ స్వయంగా వెల్లడించారు.

ఏపీలో భారీ పెట్టుబడి

Advertisement

ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ పెట్టుబడి రాబోతుందని ఐటీ మంత్రి నారా లోకేష్ గురువారం ఉదయం ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. రీన్యూ పవర్ రూ.82 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైనట్లు వెల్లడించారు. దాదాపు ఐదేళ్ల తర్వాత మళ్లీ ఆ కంపెనీ పెట్టుబడులు పెడుతోందన్నారు.

పునరుత్పత్తి విద్యుత్ రంగంలో భారీ ప్రాజెక్టులను రీ న్యూ పవర్ కంపెనీ నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. భారీ పెట్టుబడితో రీన్యూ పవర్ ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టనుంది. సోలార్ ఇంగాట్ , వాఫర్ తయారీ, గ్రీన్ హైడ్రోజన్, మాలిక్యూల్స్ ఉత్పత్తి వంటి రంగాల్లో పూర్తి స్థాయి పెట్టుబడులు పెట్టడం గర్వంగా ఉందని రాసుకొచ్చారు.

Advertisement

గూగుల్ తర్వాత ఆ కంపెనీదే

ఈ కంపెనీ ఏపీకి రావడం వెనుక మంత్రి లోకేష్ చేసిన కృషి అంతా ఇంతా కాదని అంటున్నారు. గూగుల్ తర్వాత ఆ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్న రెండో కంపెనీగా టీడీపీ నేతలు చెబుతున్నారు. గూగుల్ 87 వేల కోట్లు పైచిలుకు కాగా, రి న్యూ పవర్ రూ. 82 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనుంది.

క్లీన్ ఎనర్జీ, టెక్నాలజీ, తయారీ రంగాలలో ఒక ట్రిలియన్ డాలర్లు పెట్టుబడులను లక్ష్యంగా పెట్టుకుందని బుధవారం ఢిల్లీలో ఓ బిజినెస్ న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సదరు మంత్రి వెల్లడించారు. దీన్ని డబుల్ ఇంజిన్ బుల్లెట్ రైలు ప్రభుత్వం అని వర్ణించారు. గూగుల్ మొదలు క్వాంటం కంప్యూటింగ్ వరకు అన్ని రంగాలలో ఇప్పుడు పెట్టుబడులను ఆకర్షిస్తోందన్నారు.

ALSO READ:  విశాఖలో నాలుగు ఐటీ కంపెనీలకు మంత్రి లోకేష్ శంకుస్థాపన

ఏపీ అభివృద్ధికి మూడు అంశాలు కారణమని అందులో ప్రస్తావించారు. సరైన నాయకత్వం, ప్రభుత్వం వేగవంతమైన నిర్ణయాలు వంటివి ప్రధానమని తెలిపారు. రాష్ట్రం కొత్త LIFT పాలసీని రూపొందించింది, ఫార్చ్యూన్-500 కంపెనీలకు పోటీ ధరలకు భూమిని అందిస్తుందన్నారు. ఇప్పటికే TCS, కాగ్నిజెంట్ వంటి సంస్థలకు భూములు ఇచ్చినట్టు తెలిపారు.

 

Related News

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

జనసేన మున్సిపల్ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల.. విజయవాడ బరిలో వంగవీటి రాధాకృష్ణ

పల్నాడులో హైటెన్షన్‌.. వైసీపీ కీలక నేతల హౌస్‌ అరెస్ట్‌.. ఆంక్షలపై రాజకీయ దుమారం!

పుంగనూరులో రణరంగంగా మారిన నామినేషన్ల కేంద్రం.. గాల్లోకి కాల్పులు జరిపిన డీఎస్పీ?

బెంగళూరు టూ విజయవాడ.. రూ. 11 లక్షల డ్రగ్స్‌తో దొరికిపోయిన విద్యార్థిని..?

Big Stories

Advertisement
×