E-Paper
Advertisement

Dussehra 2026 : బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్.. దసరా రేసులో స్టార్ హీరోలు..

Dussehra 2026 : బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్.. దసరా రేసులో స్టార్ హీరోలు..
Advertisement

Dussehra 2026 : టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి పండగకు స్టార్ హీరోలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తూ ఉంటాయి.. ఈ ఏడాది సంక్రాంతి పండగకు బోలెడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి.. ఈసారి రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ ని సొంతం చేసుకుంది. అంతే కాదు భారీగా కలెక్షన్లు కూడా వసూలు చేసి సరికొత్త రికార్డును బ్రేక్ చేశాయి. ఇప్పుడు అందరి ఫోకస్ దసరా పండగ పై పడింది.. ఈ పండుగకు చాలా సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి.. మరి ఈ దసరా పండగకి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరోల మధ్య పోటీ ఉండబోతుందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

దసరా బరిలో స్టార్ హీరోల సినిమాలు…

ఈ ఏడాది నవరాత్రులకు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి స్టార్ హీరోల చిత్రాలు పోటీపడుతున్నాయి.. అప్పుడే పండగ రేసు మొదలైంది.. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అందరూ కూడా దసరా బరిలో పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్నారు.. ఏ హీరో సినిమా ఎప్పుడు రాబోతుందో ఒకసారి మనం చూసేద్దాం…

NBK111..

Advertisement

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలయ్య, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రాబోతున్న NBK111 చిత్రం దసరాకు విడుదల అయ్యేందుకు రెడీ అవుతుందని తెలుస్తుంది. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.. త్వరలోనే ఈ మూవీ టైటిల్ని కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.. ఏమైనా కూడా బాలయ్య సినిమా కోసం నందమూరి అభిమానులు వెయిట్ చేస్తున్నారు..

ఫౌజీ..

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఫౌజీ చిత్రం కూడా దసరా కానుకగా రిలీజ్ కాబోతుంది.. అక్టోబర్ 16న ఈ మూవీ ప్రేక్షకులను పలకరించబోతుంది.. సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహించగా, ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది.

ఏమో ఏమో ఇది..

Advertisement

రోషన్ మేక తన తర్వాతి చిత్రం ఏమో ఏమో ఇది తో దసరాకు సందడి చేయబోతున్నారు.. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ మూవీ రాబోతుంది..

Also Read : వివాదంలో స్టార్ హీరో..బడా డైరెక్టర్ స్ట్రాంగ్ కౌంటర్..!

ఈ చిత్రాలతో పాటుగా మరికొన్ని సినిమాలు రాబోతున్నాయి. అయితే ఇప్పటివరకు దసరాకు రిలీజ్ అవుతున్న సినిమాలు ఇంకా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయలేదు.. కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ నటిస్తున్న ‘శేయోన్‘ కూడా అక్టోబర్ రేసులో ఉంది. కమల్ హాసన్ నిర్మాణంలో ఈ మూవీ రాబోతుంది. మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు కూడా దసరా రిలీజ్ వైపు మొగ్గు చూపుతున్నాయి.. ఈ దసరా రేసులో ఏ మూవీ ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.. ఏది ఏమైనా కూడా ఈ ఏడాది మాత్రం స్టార్ హీరోల నుంచి వరుసగా సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి.. ఈ సినిమాలను చూసి ఎందుకు జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

Related News

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఆ రూమర్స్ కు చెక్..

మమిత బైజుకు ఏమైంది..? సినిమాలకు గుడ్ బై..?

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

Big Stories

Advertisement
×