E-Paper
Advertisement

AP Council Session-2026: మండలిలో ఏం జరిగింది? షాకైన వైసీపీ, వ్యూహం చూస్తారంటూ మంత్రి వ్యాఖ్య

AP Council Session-2026: మండలిలో ఏం జరిగింది? షాకైన వైసీపీ, వ్యూహం చూస్తారంటూ మంత్రి వ్యాఖ్య
Advertisement

AP Council Session-2026: మండలిలో కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వైసీపీ సభ్యులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలో కొందరు సభ్యులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఫలితంగా వైసీపీ సభ్యుల ఇచ్చిన వాయిదా తీర్మానాలను మండలి ఛైర్మన్ మోషేన్‌రాజు తిరస్కరించారు. ఈ క్రమంలో మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.

మండలిలో ఏం జరిగింది? షాకైన వైసీపీ సభ్యులు

Advertisement

ఏపీలో మండలి సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. అధికార-విపక్షాలు ఎవరికి వారు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ పైచేయి సాధించే ప్రయత్నం చేస్తున్నారు. బుధవారం మండలిలో వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరించారు మండలి ఛైర్మన్ మోషేన్ రాజు. వాయిదా తీర్మానాలు తిరస్కరణతో ఒక్కసారిగా మండలిలో గందరగోళం నెలకొంది.

ఛైర్మన్ నిర్ణయంతో వైసీపీ సభ్యులు షాకయ్యారు. ఒక్కసారి తిరస్కరించిన వాయిదా తీర్మానాన్నిమరోసారి ఇచ్చేందుకు వీల్లేదని మండలి ఛైర్మన్ తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో రెండు వాయిదా తీర్మానాలను తిరస్కరించినట్టు వివరించారు.  హౌస్ ఆర్డర్‌లో పెట్టిన తర్వాత క్వశ్చన్ అవర్ నడుపుదామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఈ క్రమంలో సభలో సభ్యులు ఆందోళన చేయడంతో సభను ఛైర్మన్ వాయిదా వేశారు.

Advertisement

అసెంబ్లీ లాబీల్లో మంత్రి లోకేష్ చిట్ చాట్.. మీరు చూస్తారంటూ వ్యాఖ్య

మండలి వాయిదా తర్వాత అసెంబ్లీ లాబీల్లో మంత్రి నారా లోకేష్ మీడియాతో చిట్ చాట్ చేశారు. మండలిలో వైసీపీ ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ, ఆ పార్టీ నేతలపై పట్టు కోల్పోయారని అన్నారు. ఒకే పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్సీలు వేర్వేరుగా వాయిదా తీర్మానాలు ఇచ్చారన్నారు.

ఒకరు లడ్డూ కల్తీపై చర్చకు అడిగితే.. మరొకరు ఇందాపూర్ డెయిరీపై చర్చ అడిగారని గుర్తు చేశారు. వారి కొట్లాటలో ఎవరు పైచేయి సాధిస్తారో మాకు ఆసక్తిగా ఉందన్నారు. సభలో మా వ్యూహమేంటో మీరు చూస్తారంటూ చెప్పుకొచ్చారు సదరు మంత్రి లోకేష్.  దీంతో సభ ప్రారంభంలో వాయిదా పడింది.

ALSO READ: మదనపల్లిలో చిన్నారి ఘటన.. నిందితుడు కులవర్థన్ మృతి

Related News

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. వైసీపీ దూరమంటూ పెద్దిరెడ్డి ప్రకటన, షాకైన కేడర్

సిగ్గు లేని రాజకీయాలు ఇంకెంత కాలం.. కాక్రోచ్‌కు వైసీపీ మద్దతు, టీడీపీ అలా అంటూ సాయిరెడ్డి కామెంట్స్

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీ కొన్న రెండు ట్రావెల్ బస్సులు.. నంద్యాల జిల్లాలో ఘటన

Big Stories

Advertisement
×