Actress Tulasi Announced Retirement: నటి తులసి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలనటి కెరీర్ ప్రారంభించిన ఆమె ప్రస్తుతం స్టార్ హీరోహీరోయిన్లకు తల్లి పాత్రలతో మెప్పిస్తుంది. ప్రభాస్, రామ్ పోతినేని, అల్లు అర్జున్, కాజల్ వంటి స్టార్స్ కి తల్లిగా నటించి ఆకట్టుకుంటుంది. తెలుగులోనే కాదు తమిళ్ భాషలోనూ ఎన్నో చిత్రాల్లో నటించింది. బాలనటిగి సినీరంగ ప్రవేశం చేసిన తులసి.. హీరోయిన్ గానూ సినిమాలు చేసింది. ప్రస్తుతం తల్లి పాత్రలతో మంచి గుర్తింపు పొందిన ఆమె సడెన్ గా తన రిటైర్మెంట్ ప్రకటించడం ఫ్యాన్స్ నిరాశ పరుస్తోంది.
ప్రస్తుతం తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోహీరోయిన్లకు తల్లి పాత్రలు పోషిస్తున్న ఆమె.. తరచూ మూవీ ప్రమోషన్స్ వీడియోలు షేర్ చేస్తుంటుంది. ప్రస్తుతం ఆమె తెలుగులో ఆంధ్రా కింగ్ తాలుకా మూవీతో పాటు తమిళంలో రెండు మూడు సినిమాలు చేస్తుంది. వీటికి సంబంధించిన వీడియోలు వరుసగా షేర్ చేస్తున్న ఆమె నటిగా తన రిటైర్మెంట్ ఎప్పుడైన ఉండోచ్చంటూ తరచూ హింట్ ఇస్తూ వస్తుంది. గత కొన్ని రోజులుగా తరచూ తన రిటైర్మెంట్ గురించి ప్రస్తావిస్తున్న తులసి.. అకస్మాత్తుగా నిన్న అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసింది. హ్యాపీ రిటైర్మెంట్ అంటూ ఓ పోస్ట్ షేర్ చేసింది. ఈ సందర్భంగా తన నిర్ణయానికి కూడా కారణం కూడా వివరించింది.
Also Read: Priyanka Chopra: మహేష్, పృథ్వీరాజ్ తో సెల్ఫీ.. ‘వారణాసి‘ గురించి ఆసక్తికర అప్డేట్ ఇచ్చిన ప్రియాంక
‘షిరిడీ దర్షనం కొనసాగిస్తూ డిసెంబర్ 31న మరోసారి దర్శనానికి వెళ్తున్నాను. అయితే దీనితో నా పదవి విరమణ (నటన రిటైర్మెంట్) తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే సాయినాధతో ప్రశాంతంగా నా ప్రయాణాన్ని కొనసాగించాలని అనుకుంటున్నా. ఈ నా నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు గౌరవిస్తారని కోరుకుంటున్నా. జీవితాన్ని నేర్చుకోవడంలో నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అంటూ తన పోస్ట్ కి రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె ఫోస్ట్ వైరల్ అవుతుంది. తులసి నిర్ణయంపై ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం తల్లి పాత్రలతో ఆకట్టుకున్న ఆమెకు ఆఫర్స్ కూడా బాగానే వస్తున్నాయి. అలాంటి సయమలో ఆమె రిటైర్మెంట్ ప్రకటించడం ఫ్యాన్స్ బాధిస్తోంది. అయితే తులసి తన పోస్ట్ కి కామెంట్స్ సెక్షన్ డిసెబుల్ చేయడం గమనార్హం. కాగా 1967 జూన్ 20 జన్మించిన తులసి.. మూడు నెలల వయసులోనే తెలుగులో సినిమాల్లో ఆరంగేట్రం చేసింది. తన తల్లి దిగ్గజ నటి సావిత్రికి మంచి స్నేహితురాలు.
ఈ నేపథ్యంలో ఆమె నటించిన జీవిన తరంగాలు చిత్రంలో మూడు నెలల చిన్నారి ని ఊయలలో వేసే సన్నివేశం ఉండటంతో ఆ సన్నివేశం కోసం తులసి తల్లిని అడిగారట. అలా జీవిన తరంగాలు సినిమాలో తులసి చిన్నారిగా పరిచయం అయ్యింది. అలా బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత సీతామహాలక్ష్మి, శంకరభరణం, ముద్దమందారం వంటి చిత్రాల బాలనటగా నటించి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ చిత్రాల్లోనూ నటించింది. ఆ తర్వాత హీరోయిన్ మారిన తులసి కన్నడ డైరెక్టర్ శివమనిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత నటనకు బ్రేక్ తీసుకున్న ఆమె మణిరత్నం చిత్రాలకు డబ్బింగ్ చెప్పేది. అలా కొన్నిరోజులకు ‘ఎక్స్క్యూజ్ మీ’ అనే చిత్రంతో తల్లి పాత్రలతో రీఎంట్రీ ఇచ్చింది. 2003 నుంచి తల్లి పాత్రల్లో అలరిస్తువస్తున్న ఆమె ఈ ఏడాదితో సినిమాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పబోతుంది.