E-Paper
Advertisement

ఫ్యామిలీ ఆడియన్స్ తో కలిసి చూసే సినిమా ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్: వైష్ణవి చైతన్య

ఫ్యామిలీ ఆడియన్స్ తో కలిసి చూసే సినిమా ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్: వైష్ణవి చైతన్య
Advertisement

Epic -First Semester: వైష్ణవి చైతన్య ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలలో  నటించిన తాజా చిత్రం “ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్”(Epic -First Semester). ఈ సినిమా సెప్టెంబర్ 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) కూడా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వైష్ణవి చైతన్య ఈ సినిమా గురించి ఈ సినిమాలో ఆమె నటిస్తున్న కడలి పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎపిక్ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో ఆనంద్ నటించిన ఆదిత్య పాత్ర చాలా సాఫ్ట్ గా ఉంటుందని జీవితంలో ఎదురైన అనుభవాల నుంచి ఆదిత్య ఏం నేర్చుకుంటాడు అనేది ఆసక్తికరంగా ఉంటుందని తెలిపారు..

ప్రతి ఒక్కరిలోనూ కడలి పాత్ర ఉంటుంది..

ఇక వైష్ణవి నటించిన కడలి(Kadali) పాత్ర గురించి కూడా మాట్లాడుతూ కడలి పాత్ర ఒక స్ట్రాంగ్ అమ్మాయి. తనకోసం తాను నిలబడే అమ్మాయి ప్రతి విషయంలోనూ క్లారిటీ ఉండే అమ్మాయి కడలి అంటూ చెప్పుకోవచ్చారు. ఇక కడలి పాత్ర గురించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలోనూ ఈ పాత్ర ఉంటుంది కానీ కుటుంబం వల్ల లేదంటే సమాజం వల్లనో మనలో దాగి ఉన్న కడలి అని వెర్షన్ లోపలే ఉండిపోతుంది. అయితే జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో వారి కోసం వారు నిలబడాలి. అందుకే నాకు కడలి పాత్ర బాగా దగ్గర అయిందని తెలిపారు.

ఎపిక్ చూసేటప్పుడు బేబీ గుర్తుకు రాకపోతే సక్సెస్ అయినట్టే..

Advertisement

ఇక బేబీ సినిమాలో కూడా వైష్ణవి చైతన్య ఆనంద్ దేవరకొండ కలిసి నటించిన సంగతి తెలిసిందే. బేబీ ఎపిక్ సినిమాలు రెండు ఒకటేనా అనే ప్రశ్న ఎదురవడంతో వైష్ణవి చైతన్య సమాధానం చెబుతూ బేబీ, ఎపిక్ సినిమాలు రెండు దేనికవి ప్రత్యేకమైనవని తెలిపారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు బేబీ గుర్తుకు రాకపోతే కచ్చితంగా మేము విజయం సాధించినట్టేనని వైష్ణవి చైతన్య తెలిపారు. ఈ సినిమా ఉన్న ప్రత్యేకత గురించి ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్క లవ్ స్టోరీ లోను ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది .అలాగే ఎపిక్ సినిమాలో కూడా ప్రత్యేకత ఉందని భిన్నమైన దారులు భిన్న మనస్తత్వాలున్న ఇద్దరు ఒకే చోటకు చదువుకోవడానికి వెళ్తే వారి ప్రయాణం ఎలా సాగింది అనేది ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్న అని తెలిపారు.

ఫ్యామిలీ ఆడియన్స్ చూసే సినిమా ఎపిక్..

ఈ సినిమా చేసిన తర్వాత నేను ఒక విషయం నేర్చుకున్నాను అని తెలిపారు. ఇదివరకు ఏదైనా ఒక విషయం గురించి బయటకు మాట్లాడాలి అంటే కాస్త భయం ఉండేది కానీ కడలి పాత్రలో నటించిన తర్వాత ముందు మనల్ని మనం నమ్మాలి మనం కాన్ఫిడెన్స్ గా ఉండాలి అనే విషయాన్ని నేర్చుకున్నానని తెలిపారు. ఈ సినిమాలో కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నాయి ఫ్యామిలీతో చూసే సినిమా కాదు అని ఇప్పటికే చాలామంది అంటున్నారు ఈ విషయం గురించి కూడా వైష్ణవి చైతన్య మాట్లాడుతూ కచ్చితంగా ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ తో కలిసి చూసే సినిమా అని తెలిపారు. డైరెక్టర్ ఆదిత్య ఈ సినిమాకు ఏది అవసరమో అది చూపిస్తూనే ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా దృష్టిలో ఉంచుకొని ఇబ్బందికర సన్నివేశాలు లేకుండా సినిమా చేశారని ఈ సందర్భంగా వైష్ణవి చైతన్య ఎ పిక్ సినిమా గురించి, కడలి పాత్ర గురించి తెలిపారు.

Advertisement

Also Read: ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

Related News

ముద్దు సీన్ ఉంటే అడల్ట్ సినిమా అవుతుందా? ట్రోలర్స్ కు నాగ వంశీ కౌంటర్!

నోరా ఫతేహికి బిగ్ షాక్.. రూ.3 కోట్ల పరువు నష్టం దావా వేసిన ప్రముఖ సంస్థ!

బోయపాటి సెంటిమెంట్‌కు తమిళ బ్రదర్స్ నో?

త్రిషకు అండగా కంగనా.. ఉదయ్ నిధి స్టాలిన్ కు గట్టి కౌంటర్!

మరో మల్టీప్లెక్స్ ప్లానింగ్ లో రౌడీ హీరో..విస్తరిస్తున్న సినీ సామ్రాజ్యం!

ఢిల్లీ భవన ప్రమాదంపై సోనూసూద్ డిమాండ్!

కైపెక్కించే ఫోజులతో విష్ణుప్రియ కిర్రాక్ లుక్.. ఫోటోస్ వైరల్!

Big Stories

Advertisement
×