E-Paper
Advertisement

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన  సుస్మిత కొణిదెల !
Advertisement

Susmitha Konidela: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా సినిమా ఇండస్ట్రీలో వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్న మెగా కుటుంబ సభ్యులకు ఇటీవల పెద్ద ఎత్తున ఉన్నత పదవులు లభిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కొనసాగగా నాగబాబు ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా ఇటీవల బాధ్యతలు అందుకున్నారు. ఇకపోతే మెగా కుటుంబంలో నిర్మాతగా కొనసాగుతున్న సుస్మిత కొణిదెల (Susmitha Konidela)సైతం కీలక బాధ్యతలను చేపట్టిన సంగతి తెలిసిందే.

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డు..

సుస్మిత కొణిదెల ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక బాధ్యతలను చేపట్టింది. ఇంద్రకీలాద్రిలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డుకు ఈమెను ప్రత్యేక ఆహ్వానితునిగా(Special Invitee) ఎంపిక చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇలా సుస్మితకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విధమైనటువంటి కీలక బాధ్యతలను చేపట్టిన నేపథ్యంలో మెగా అభిమానులు ఈమెకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకు ఇలాంటి బాధ్యతలను అప్పగించడం పట్ల సుస్మిత స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు..

Advertisement

ఈ నేపథ్యంలోనే సుస్మిత తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఈ విషయంపై స్పందిస్తూ..” ఇంద్రకీలాద్రి లోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం ట్రస్టు బోర్డు కు నన్ను ప్రత్యేక ఆహ్వానితునిగా నామినేట్ చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాపై నమ్మకం ఉంచిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి మరియు దేవాదాయ శాఖ మంత్రి రాం నారాయణరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు . ఈ దైవిక బాధ్యతను నేను చాలా వినమ్రంగా స్వీకరిస్తున్నాను అత్యంత భక్తి శ్రద్దలతో దుర్గ అమ్మవారికి సేవ చేయటానికి అలాగే ఆలయ కార్యకలాపాలలో నా వంతు కృషి చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.శ్రీ మాత్రే నమః” అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Advertisement

ఈ విధంగా సుస్మిత కొణిదెల తనకు ఉన్నత పదవి ఇచ్చినందుకు ఏపీ ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక ఈమె ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ ద్వారా నిర్మాతగా మారి వరుస సినిమాలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వెబ్ సిరీస్ ల ద్వారా మంచి సక్సెస్ అందుకున్న సుస్మిత తన మొదటి సినిమా తన తండ్రి చిరంజీవితో చేసిన విషయం తెలిసిందే. మన శంకర్ వరప్రసాద్ సినిమాకు సుస్మిత నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

Also Read: నోరా ఫతేహికి బిగ్ షాక్.. రూ.3 కోట్ల పరువు నష్టం దావా వేసిన ప్రముఖ సంస్థ!

Related News

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Big Stories

Advertisement
×