Lechindi Mahila Lokam: బ్రిహస్పతి ఎంటర్‌టైన్‌మెంట్స్, అప్పారెంట్లీ సినిమా, స్టోరీ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘లేచింది మహిళాలోకం’ (Lechindi Mahila Lokam). దర్శకద్వయం అర్జున్-కార్తిక్ రూపొందించిన ఈ చిత్రానికి హైమ రాజశేఖర్, శ్వేత మహి, నిరోష నవీన్ సంయుక్తంగా నిర్మించారు. మంచు లక్ష్మి (Manchu Lakshmi), శ్రీరామ చంద్ర, అనన్య నాగళ్ల, హరితేజ, హేమ, సుప్రిత, శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా సన్‌స్టూడియో యూఎఫ్‌ఓతో కలిసి గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తోంది. మార్చి 26న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో మేకర్స్ చిత్ర ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ (Lechindi Mahila Lokam Trailer) ఎలా ఉందంటే..
Also Read- Vijay Deverakonda: ఏంటీ, విజయ్ మ్యారేజ్ హేటరా.. మరి పెళ్లి ఎలా.. నిర్మాత విస్తుపోయే నిజాలు!
కొత్తగా పెళ్లయిన ఒక జంట మధ్య చిన్న చిన్న విషయాలకే విబేధాలు రావడం.. వాటికి ఆజ్యం పోసేలా పక్కింటివాళ్లు తమ మాటలతో పొల్యూట్ చేయడం.. ఈ క్రమంలో జరిగే పరిణామాలు ఒకవైపు.. థ్రిల్‌కు గురి చేస్తూనే మరోవైపు కడుపుబ్బా నవ్వించేలా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ప్రస్తుత సమాజానికి చాలా రిలేటెడ్‌గా ఈ సినిమా రూపుదిద్దుకున్నట్లుగా ఈ ట్రైలర్ తెలియజేస్తుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దర్శకద్వయం అర్జున్-కార్తిక్ ఈ సినిమాను హిలేరియస్‌గా రూపొందించారనే విషయాన్ని ట్రైలర్‌లోని ప్రతి షాట్ స్పష్టం చేస్తుంది. కొత్తగా పెళ్లయిన జంటగా ఇందులో శ్రీరామ చంద్ర, అనన్య నాగళ్ల నటించారు. వారి మధ్య చిన్న చిన్న విభేదాలు వస్తే, వాటికి మరింత ఆజ్యం పోస్తూ.. ఇద్దరికీ విడాకులు ఇచ్చేంత వరకు ఇరుగు పొరుగు వారు ప్రవర్తించడం ఇందులో చూపించారు.
ప్రస్తుతం సమాజంలో కూడా అదే జరుగుతున్న విషయం తెలియంది కాదు. ఎవరైనా భార్యభర్తలు కొట్టాడుకుంటుంటే, మనకెందుకులే అని అసలు పట్టించుకోకుండా, ఎవరి పని వారు చూసుకునే టైప్ కొందరైతే, వారి మధ్య మరింతగా విభేదాలు సృష్టించి ఆనందం పొందేవారు మరో టైపు. వీరిద్దరూ కాకుండా, ఇద్దరినీ విడగొట్టాలని చూసే వారు ఇంకో టైపు. ఆ ఇంకో టైపు పాత్రలోనే మంచు లక్ష్మి ఇందులో నటించారు. ‘లాయర్ పుష్ప’గా ఆమె ఎంట్రీ, తన తండ్రి డైలాగ్‌పై పంచ్, చివరిలో తన డిక్షన్‌కు సంబంధించిన పంచ్.. మొత్తం బాగా పేలాయి. హేమ, హరితేజ సుప్రిత, శ్రద్ధాదాస్ కూడా ఇందులో కీలక పాత్రలు పోషించినట్లుగా ఈ ట్రైలర్‌లో చూపించారు. టెక్నికల్‌గా అంత గొప్పగా ఏం లేకపోయినా, ఎంటర్‌టైన్‌మెంట్‌కు మాత్రం లోటుండదని ఈ ట్రైలర్ తెలియజేస్తుంది. మరి మహిళల భవిష్యత్ ఏంటో తెలియాలంటే మాత్రం మార్చి 26 వరకు వెయిట్ చేయాల్సిందే.
Also Read- Madhavi Latha: మగాళ్లపై మరోసారి రెచ్చిపోయిన మాధవీలత.. రె*ట్ట వేయడానికి కూడా పనికిరారంటూ!