E-Paper
Advertisement

Bellamkonda Sreenivas: గ్రాండ్‌గా కావ్య రెడ్డి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రోకా వేడుక.. త్వరలోనే పెళ్లి!

Bellamkonda Sreenivas: గ్రాండ్‌గా కావ్య రెడ్డి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రోకా వేడుక.. త్వరలోనే పెళ్లి!
Advertisement

Bellamkonda Sreenivas: టాలీవుడ్‌లో ప్రస్తుతం పెళ్లిళ్ల హవా నడుస్తోంది. రీసెంట్‌గానే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత అల్లు శిరీష్ తన ప్రేయసి నయనిక వివాహం చేసుకుని, ఆయన కూడా బ్యాచ్‌లర్ లైఫ్‌కి ముగింపు ఇచ్చేశారు. అల్లు శిరీష్ వివాహం అనంతరం.. ఇప్పుడు టాలీవుడ్‌కు చెందిన మరో హీరో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. వాస్తవానికి అల్లు శిరీష్ మ్యారేజ్ రోజే, ఈ హీరో పెళ్లి వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఆ హీరో మరెవరో కాదు మాస్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas). అవును, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే తన ప్రేయసి కావ్య రెడ్డిని వివాహం చేసుకోబోతున్నారు. వారి వివాహానికి సంబంధించిన ప్రాసెస్ కూడా మొదలైంది. బెల్లంకొండ శ్రీనివాస్‌ (Bellamkonda Sai Sreenivas), కావ్య రెడ్డి (Kavya Reddy)ల రోకా (Roka) వేడుక‌ను ఇరు ఫ్యామిలీ పెద్దలు గ్రాండ్‌గా నిర్వహించారు.

Also Read- Chiyaan Vikram: అపరిచితుడు సినిమా నన్ను చాలా ఇబ్బంది పెట్టింది.. విక్రమ్ కీలక వ్యాఖ్యలు..!

రోకా ఫంక్షన్ ఫొటోలు వైరల్

Advertisement

పెళ్లి నిమిత్తం జరిగే నిశ్చితార్థానికి ముందు జరిగే వేడుకను ‘రోకా’ వేడుక అంటారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పసుపు, కుంకుమల వేడుక అని కూడా దీనిని పిలుస్తారు. ఈ రోకా వేడుక ఇరు కుటుంబాల సమక్షంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. రోకా వేడుక కావ్య రెడ్డి నివాసంలో గ్రాండ్‌గా జరిగింది. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకకు, ఇప్పటి వరకు బెల్లంకొండ శ్రీనివాస్‌లో సినిమాలు చేసిన దర్శకనిర్మాతలే కాకుండా, టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అందులో దర్శకులు బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని.. నిర్మాతలు శిరీష్, సాహు గారపాటి, రామ్ ఆచంట, మిర్యాల రవీందర్ రెడ్డి, నాగ వంశీ, కేకే రాధామోహన్, ధీరజ్ మొగిలినేని.. హీరోయిన్ సంయుక్త తదితరులు ఉన్నారు.

Also Read- Lechindi Mahila Lokam: ట్రైలర్ వచ్చేసింది.. లాయర్ ‘పుష్ప’గా మంచు లక్ష్మి అరాచకం

పెళ్లి ఎప్పుడంటే?

Advertisement

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డిల నిశ్చితార్థపు వేడుకను కూడా గ్రాండ్‌గా నిర్వహించేందుకు బెల్లంకొండ ఫ్యామిలీ ప్లాన్ చేస్తోంది. త్వరలోనే ఈ ఎంగేజ్‌మెంట్ డేట్ అలాగే మ్యారేజ్ డేట్‌లను అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది ద్వితీయార్థంలో లేదంటే ఏడాది చివరిలో వివాహం జరిగే అవకాశం ఉంది. శ్రీనివాస్ ప్రస్తుతం తాను నటిస్తున్న సినిమాల షూటింగ్ పూర్తయిన తర్వాతే పెళ్లి పీటలు ఎక్కాలని నిర్ణయించుకున్నట్లుగా ఇండస్టీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. చాలా గ్యాప్ తర్వాత ఇటీవల వచ్చిన ‘కిష్కింధపురి’ చిత్రంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ‘టైసన్ నాయుడు’తో పాటు ‘హైందవ’ అనే చిత్రాల్లో నటిస్తున్నారు.

Also Read- Vijay Deverakonda: ఏంటీ, విజయ్ మ్యారేజ్ హేటరా.. మరి పెళ్లి ఎలా.. నిర్మాత విస్తుపోయే నిజాలు!

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×