E-Paper
Advertisement

Agniveer Vayu: అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు అప్లై చేశారా..? ఈ అర్హత ఉంటే చాలు..!

Agniveer Vayu: అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు అప్లై చేశారా..? ఈ అర్హత ఉంటే చాలు..!
Advertisement

నిరుద్యోగ అభ్యర్ధులకు ఇది శుభవార్త.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరాలనుకునే యువతకు అయితే గోల్డెన్ ఛాన్స్.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) అగ్నిపథ్ స్కీం కింద భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అగ్నివీర్ వాయు (01/2027) బ్యాచ్ నియామకాల కోసం అర్హులైన అవివాహిత పురుష మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దేశసేవ చేయాలనే తపన కలిగిన యువతకు ఇది గొప్ప అవకాశం. ఆసక్తి గల వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.

విద్యార్హత: 

Advertisement

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. సైన్స్ విభాగంలో దరఖాస్తు చేసే వారు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులు కలిగి ఉండాలి. సైన్స్ కాకుండా ఇతర గ్రూపులు చదివిన వారు సైతం దరఖాస్తుకు అర్హులు అవుతారు.

వీటితో పాటు మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్ వంటి విభాగాల్లో మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తి చేసిన వారు కూడా పోటీ పడవచ్చు. అభ్యర్థులకు నిర్దిష్ట శారీరక దారుఢ్యం వైద్య ప్రమాణాలు తప్పనిసరి.

Advertisement

వయస్సు: 

అభ్యర్థులు 2006 జనవరి 1 నుంచి 2009 జులై 1 మధ్య జన్మించి ఉండాలి. శారీరక ప్రమాణాల విషయానికి వస్తే పురుషులు మహిళలు కనీసం 152 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. ఈశాన్య రాష్ట్రాలు ఉత్తరాఖండ్‌లోని కొండ ప్రాంతాలకు చెందిన మహిళా అభ్యర్థులకు ఐదు సెంటీమీటర్ల సడలింపు ఉంటుంది. వీరు 147 సెంటీమీటర్ల ఎత్తు ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగ ఎంపిక విధానం: 

మొత్తం మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. మొదటి దశలో కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చూపిన వారికి రెండో దశలో ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ అడాప్టబిలిటీ టెస్టులు ఉంటాయి. చివరి దశలో మెడికల్ ఫిట్‌నెస్ పరీక్షలు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది జాబితా ప్రకటిస్తారు. పారదర్శకమైన పద్ధతిలో అభ్యర్థుల సామర్థ్యాన్ని బట్టి నియామకాలు జరుగుతాయి.

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 550 రూపాయలతో పాటు అదనంగా జీఎస్‌టీ ఛార్జీలు చెల్లించాలి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి 2026 మార్చి 10 వరకు గడువు ఉంది. ఆన్‌లైన్ పరీక్షలు మార్చి 30 లేదా 31 తేదీల్లో మొదలవుతాయి. అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే తమ దరఖాస్తులను సమర్పించడం బెటర్..

దరఖాస్తుకు చివరి తేది: మార్చి 31

అఫీషియల్ వెబ్ సైట్: CSC Recruitment: నిరుద్యోగులకు శుభవార్త.. ఆధార్ సూపర్ వైజర్ ఉద్యోగాలు, ఈ అర్హత ఉంటే జాబ్ వచ్చేస్తది..!

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×