E-Paper
Advertisement

Allu Cinemas: అల్లు సినిమాస్ కు అద్భుతమైన రెస్పాన్స్… అదొక్కటే మైనస్ అయ్యిందా?

Allu Cinemas: అల్లు సినిమాస్ కు అద్భుతమైన రెస్పాన్స్… అదొక్కటే మైనస్ అయ్యిందా?
Advertisement

Allu cinemas : టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అల్లు కుటుంబానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఇప్పటికే మూడు తరాల అల్లు వారసులు ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఇక నాలుగో తరం కూడా ఇండస్ట్రీలోకి రావడానికి సిద్ధమవుతున్నారు. అల్లు కుటుంబం ఇండస్ట్రీలో తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కుటుంబం నుంచి హీరోలు నిర్మాతలుగా ఇండస్ట్రీలో స్థిరపడి ఎంతో మంచి విజయాలను అందుకున్నారు. ఇకపోతే ఇటీవల అల్లు స్టూడియోస్ కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక అల్లు కుటుంబానికి సంబంధించి ఒక థియేటర్ లేకపోవడమే వెలితిగా ఉండేది కానీ ఈ వెలితిని కూడా తీరిపోయిందని చెప్పాలి.

అతిపెద్ద స్క్రీన్ తో అల్లు సినిమాస్…

ఇటీవల కోకాపేటలో అల్లు సినిమాస్(Allu Cinemas) ను ఎంతో ఘనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులు మీదుగా ఈ అల్లు స్టూడియోస్ ప్రారంభించారు. ఇప్పటికే ఈ స్టూడియోలో సినిమాలు ప్రదర్శితం అవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రేక్షకులు ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయడం కోసం అక్కడికి వెళ్తున్నారు. మన ఏషియాలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్ కలిగిన ఏకైక థియేటర్ గా అల్లు సినిమాస్ పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకుంది. ఇక ఈ థియేటర్ అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేయబడిన సంగతి తెలిసిందే. ఇలా ఈ థియేటర్ లో సినిమాని ఎక్స్పీరియన్స్ చేసిన వారు ఈ సినిమా గురించి వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

ఓపెన్ ప్లేస్ పార్కింగ్ మైనస్ అయ్యిందా..

Advertisement

అల్లు సినిమాస్ లో అత్యాధునిక వసతులు, విశాలమైన స్క్రీన్లతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే, ఒకే ఒక సమస్య మైనస్ గా మారింది అంటూ ప్రేక్షకులు వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు. ఈ థియేటర్లో సినిమా ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ పార్కింగ్ మాత్రం మైనస్ గా మారిందని తెలుస్తుంది.వీకెండ్స్ తో సంబంధం లేకుండా రోజూ 200-300 కార్లతో పార్కింగ్ ఏరియా కిక్కిరిసిపోతోంది. పార్కింగ్ స్థలం పూర్తిగా ఓపెన్ ప్లేస్ అవడంతో ఎండకు వాహనాలను పార్కింగ్ చేయటం ఇబ్బందికరంగా మారింది.

అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఏర్పాటు చేయాలి..

Advertisement

ఇతర మల్టీప్లెక్స్ లలో మాదిరిగా అల్లు సినిమాస్ లో అండర్ గ్రౌండ్ పార్కింగ్ లేదా కనీసం పైన షెడ్లు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. ఇలా వాహనాల పార్కింగ్ కోసం అల్లు సినిమాస్ యాజమాన్యం చర్యలు చేపడితే ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో అద్భుతమైన థియేటర్ ఎక్స్పీరియన్స్ కల్పించిన వాళ్ళు అవుతారు అంటూ ఈ థియేటర్లో ఉన్న మైనస్ గురించి ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ గురించి ప్రేక్షకులు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి పార్కింగ్ విషయంపై యాజమాన్యం దృష్టిసారించి చర్యలు చేపడుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Sharwanand: రోహిత్ శర్మ బయోపిక్ లో శర్వానంద్.. అసలు విషయం బయటపెట్టిన హీరో!

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×