E-Paper
Advertisement

Medchal Collector: ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ మను చౌదరి

Medchal Collector: ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ మను చౌదరి
Advertisement

Medchal Collector: స్వేచ్ఛ, బ్యూరో: ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు అందజేస్తూ జాప్యం లేకుండా సత్వరమే అర్జీలను పరిశీలించి పరిష్కరించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు మను చౌదరి (Manu Chaudhary) అధికారులను ఆదేశించారు. సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి అదనపు జిల్లా కలెక్టరు విజయేందర్ రెడ్డి, డిఆర్ఓ చంద్రావతిలతో కలిసి అదనపు కలెక్టరు (163) దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ సోమవారం హౌజింగ్ డిపార్టుమెంట్ కు అధిక సంఖ్యలో (58) దరఖాస్తులు వచ్చాయని అన్నారు.

Also Read:Muduchintalapalli Municipality: పన్నుల గణాంకాల్లో స్పష్టత లోపం.. ఆన్‌లైన్ లో ఒక లెక్క.. అధికారుల దగ్గర మరో లెక్క! 

నమ్మకాన్ని నిలబెట్టాలి

Advertisement

ఎంతో వ్యయ, ప్రయాసలకోర్చుకొని వారి సమస్యలను పరిష్కరిస్తామనే నమ్మకంతో ప్రజలు మన వద్దకు వస్తారని, వారి నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నదని అన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని దరఖాస్తుల పరిశీలనలో ఏలాంటి జాప్యం లేకుండా చూడాలని కలెక్టరు అన్నారు. అదేవిధంగా తిరస్కరించే దరఖాస్తుల గురించి తిరస్కరణకు గల కారణాలను తప్పనిసరిగా వివరంగా అర్జీదారులకు తెలియజేయాలని అధికారులకు సూచించారు. స్వీకరించిన దరఖాస్తులపై తీసుకున్న చర్యల వివరాలను ఆన్ లైన్ లో వెంట వెంట నమోదు చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టరు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Also Read: Meenakshi Chaudhary: బంగారం అంటే అమ్మాయి, అమ్మాయి అంటే బంగారం.. భలే చెప్పింది కదా!

Related News

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

Big Stories

Advertisement
×