BigTV English

AA22xA6 : అట్లీ-అల్లు అర్జున్ రేంజ్ సినిమా చేస్తా.. కొరియోగ్రాఫర్ ఓపెన్ ఛాలెంజ్

AA22xA6 : అట్లీ-అల్లు అర్జున్ రేంజ్ సినిమా చేస్తా.. కొరియోగ్రాఫర్ ఓపెన్ ఛాలెంజ్

AA22xA6 : ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీ నుంచి అదిరిపోయే సినిమాలు విడుదలవుతున్నాయి. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న సినిమా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న డ్రాగన్, అలానే అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న సినిమాలు మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఏ మేరకు సక్సెస్ సాధిస్తాయో ఎవరూ ఊహించలేరు. కొంతమంది ఊహకు కూడా అందడం లేదు. ఆ రేంజ్ లో ఈ సినిమాలను ప్లాన్ చేస్తున్నారు. ఈ తరుణంలో తాను కూడా ఆ రేంజ్ సినిమా చేస్తాను అని ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్ ఒక స్టేజ్ పైన స్టేట్మెంట్ ఇచ్చారు.


అతను మరెవరో కాదు బాబా మాస్టర్. డాన్సర్ గా కెరియర్ మొదలుపెట్టిన బాబా అద్భుతమైన కొరియోగ్రాఫర్ గా ఎదిగారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నారు. అంతేకాకుండా తెలుగు బిగ్ బాస్ షో కి కూడా ఎంట్రీ ఇచ్చి చాలామంది అభిమానులను సంపాదించుకున్నారు. బాబా మాస్టర్ ప్రస్తుతం సినిమా దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చే ప్లాన్లో ఉన్నారు. ఇదే విషయాన్ని రీసెంట్ గా జరిగిన ఒక తమిళ్ ఆడియో ఫంక్షన్ లో చెప్పారు.

 


అల్లు అర్జున్ అట్లీ రేంజ్ సినిమా చేస్తా 

కేపీవై బాలా నటించిన గాంధీ గ్లాస్సెస్ అనే సినిమా ఆడియో ఫంక్షన్ లో కొరియోగ్రాఫర్ బాబా మాస్టర్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాబా మాస్టర్ మాట్లాడుతూ “అల్లు అర్జున్ అట్లీ కలిసి ఒకటి చేస్తున్నారు. నేను ఐదు సంవత్సరాలు తర్వాత బాలతో ఆ రేంజ్ సినిమా చేస్తాను. ఒకవేళ జరగకపోతే, ఇది ఖచ్చితంగా జరుగుతుంది అది కూడా నేను స్టేజ్ పైన నిలుచును చెబుతున్నాను. మూడు సంవత్సరాలు తర్వాత నేను బాలతో కలిసి దర్శకుడుగా సినిమా చేస్తాను. ఇది కూడా జరుగుతుంది.

నేను చేయబోయే సినిమా మామూలుగా ఉండదు. సైంటిఫిక్ గా ఉంటుంది, అదొక అడ్వెంచర్ ఫిలిం, స్పైడర్ మాన్ మాస్క్ పెట్టుకొని బాలా మీకు కనిపిస్తారు. అందుకోసం నేను బాలాను అమెరికా తీసుకెళ్లి స్కాన్ చేయించి. ఇప్పుడు అట్లీ అల్లు అర్జున్ ఏదైతే చేస్తున్నారో నేను ఐదు సంవత్సరాల తర్వాత అదే మాదిరిగా చేస్తాను. అంటూ చెప్పుకొచ్చారు.

భాయ్ ఫ్యాన్స్ ఎలివేషన్స్ 

ఈ విషయం తెలియక చాలామంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న సినిమా గురించి బాబా మాస్టర్ ఎలివేషన్ ఇచ్చారు అని అనుకుంటున్నారు. వాస్తవానికి బాబా మాస్టారు మాట్లాడింది మాత్రం అట్లీ రేంజ్ సినిమా చేస్తాను అని. మొత్తానికి మనం ప్రస్తావిస్తున్న సినిమా ఆల్రెడీ సెప్టెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు సంబంధించిన ఈవెంట్ ఆగస్టు 28న జరిగింది.

Also Read: Sanjana Garlani : పాపం ఈ పిల్ల తెలియక బూతులు మాట్లాడేస్తుంది

Related News

KishkindPuri event :బెల్లంకొండ శ్రీనివాస్ కోసం ఆ ముగ్గురు దర్శకులు హాజరు

Karishma Kapoor: మాజీ భర్త ఆస్తుల కోసం పిల్లలతో కలిసి కరిష్మ బడా ప్లాన్.. రూ.30 వేల కోట్లంటే మాటలా?

Telugu Film Industry: ఒంటరైన ఆడియో సంస్థ అధినేత… ఆ ఇద్దరు బడా ప్రొడ్యూసర్లతో పూర్తిగా చెడిందా ?

Mouli: నీ లైఫ్ లో ఏమి అచీవ్మెంట్స్ రా బాబు, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రికార్డు కొట్టావు, ఇప్పుడు సక్సెస్ మీట్ కి ఫేవరెట్ హీరో

Megastar Chiranjeevi : ఏంటి బాసు ఇప్పటికీ నీ గ్రేసు, కొంపదీసి టైం ట్రావెల్ మిషన్ దొరికిందా?

The Conjuring-Last Rites: హర్రర్ సీన్స్ వస్తుంటే జోకులు.. ‘కంజూరింగ్’ మూవీ థియేటర్‌లో కొట్టుకున్న జంటలు!

×