దువ్వాడ శ్రీనివాస్ – మాధురి. ఈ జంట ఎక్కడికెళ్లినా, ఏం చేసినా అందరి కళ్లూ వీరిపైనే ఉంటాయి. తాజాగా దువ్వాడ మాధురి తమ ఇన్ స్టా పేజ్ లో ఓ పోస్ట్ పెట్టరు. దువ్వాడ శ్రీనివాస్ కి ఆమె తులాభారం వేయించారు. ఆయన బరువుకి సరితూగేలా ఆవు నెయ్యి, బెల్లంను త్రాసులో ఉంచి వాటిని స్వామివారికి సమర్పించారు. అయితే ఈ తులాభారం ఏ ఆలయంలో జరిగిందనే విషయాన్ని ఆమె బహిర్గతం చేయలేదు. శ్రీవారి ఆలయం అనే పేరు మాత్రం వెనక కపడతుతోంది. తులాభారం వీడియోని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత దువ్వాడ తులాభారం అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు వైరల్ గా మారిపోయింది.
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
వామ్మో.. అవి కామెంట్లా?
భార్య, పిల్లలకు దూరంగా దివ్వెల మాధురితో కలసి ఉంటున్న దువ్వాడ శ్రీనివాస్ తప్పు చేశారా, ఒప్పు చేశారా అనే విషయం పక్కనపెడితే.. సోషల్ మీడియాలో మాత్రం ఆయనకు ఓ రేంజ్ లో క్రేజ్ వచ్చేసింది. దివ్వెల మాధురి దొరకడం ఆయన అదృష్టం అంటూ చాలామంది మెసేజ్ లు పెడుతున్నారు. ఆ జంట చూడముచ్చటగా ఉందని, దువ్వాడకు ఆమె దొరకడం తమకు జలసీగా ఉందని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ కామెంట్లకు దువ్వాడ కానీ, మాధురి కానీ ఎవరూ రియాక్ట్ కావడంలేదు. మొత్తానికి వీరిద్దరిపై వచ్చే కామెంట్లు మాత్రం ఆసక్తిగా ఉంటున్నాయి. ఈ ప్రపంచంలో ఎవరితో సంబంధం లేకుండా సంతోషంగా ఉన్న జంట వీరేనని అంటున్నారు నెటిజన్లు.
వైరల్ మాధురి
ఆమధ్య దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆ సమయంలో తిరుమాడ వీధుల్లో వారు ఫొటోషూట్ చేయించుకోవడం వివాదాస్పదమైంది. ఆ తర్వాత కూడా ఆ జంట ఏమాత్రం తగ్గడంలేదు. విహార యాత్రలు, తీర్థయాత్రలకు వెళ్తూ ఆ ఫొటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ ఆనందిస్తున్నారు. ఈ క్రమంలో దువ్వాడకు జరిగిన తులాభారం ఎపిసోడ్ తాజాగా హైలైట్ అవుతోంది. దివ్వెల మాధురికి పోటీగా చాలామంది ఆ వీడియోని ఎడిట్ చేసి తమ వ్యక్తిగత ఖాతాల్లో పోస్ట్ చేస్తున్నారు. తులాభారానికి సంబంధించిన వివిధ పాటల్ని సింక్ చేస్తూ ఆ వీడియోని వైరల్ చేస్తున్నారు.
రాజకీయం సంగతేంటి?
దివ్వెల మాధురితో తనకున్న సంబంధాన్ని బహిర్గతం చేసిన దువ్వాడ శ్రీనివాస్ పార్టీకే కాదు, ప్రజలకి కూడా దూరమయ్యారని తెలుస్తోంది. గతంలో లాగా ఆయన ప్రజల్లోకి పెద్దగా వెళ్లడం లేదు, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి అంతగా ఆసక్తి చూపిస్తున్నట్టు లేదు. మాధురి వెంట విహార యాత్రలకు, ప్రైవేట్ ఫంక్షన్లకు మాత్రం తప్పనిసరిగా వెళ్తున్నారు దువ్వాడ. ఎమ్మెల్సీగా ఉన్న ఆయన పబ్లిక్ లైఫ్ కంటే, ప్రైవేట్ లైఫే ఎక్కువ వార్తల్లోకెక్కుతోంది. ఇది ఆయన రాజకీయ భవిష్యత్తుకి మంచిదా కాదా అనేది ఆయనే డిసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి. మరోవైపు దివ్వెల మాధురి కూడా రాజకీయ అరంగేట్రం చేసే అవకాశం ఉందని అంటున్నారు. దువ్వాడ రాజకీయ వారసురాలిగా ఆమె తెరపైకి వచ్చే వార్తల్ని కూడా కొట్టిపారేయలేం.