Sanjana Garlani : ఎప్పుడు నుంచో ఎదురు చేస్తున్న తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 షో మొదలైపోయింది. ఈరోజు డే వన్, చాలామంది ఈరోజు వచ్చే ఎపిసోడ్ కోసం క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. నిన్ననే గెస్ట్ లందరూ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మొత్తం 14 మంది గెస్ట్లు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు. వాళ్లలో సంజన గర్లని ఒకరు.
పూరి జగన్నాధ దర్శకత్వంలో వచ్చిన బుజ్జిగాడు సినిమాలో త్రిష చెల్లి పాత్రలో కనిపించింది సంజన. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా ఊహించిన ఆ రేంజ్ సక్సెస్ అందుకోలేకపోయింది. పెద్దగా సంజనా కి కూడా పేరు రాలేదు. అయితే 2020లో సంజనా మీద ఒక డ్రగ్స్ కేస్ వచ్చిన విషయం తెలిసిందే.
ఇదే విషయాన్ని నిన్న బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా మరోసారి గుర్తు చేస్తూ బాధపడింది సంజన. ఇక్కడితోనే అందరికీ ఒక రకమైన నెగెటివిటీ ఈ అమ్మాయి మీద ఏర్పడింది. అనవసరంగా లేని టాపిక్ ను మళ్ళీ గుర్తు చేసి సింపతి కోసం ట్రై చేస్తుంది అని అనిపించుకుంది.
తెలియక బూతులు మాట్లాడుతుంది
మామూలుగా తెలుగు పూర్తిగా రాని వాళ్ళు తెలుగులో మాట్లాడే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి తరుణంలోనూ తెలిసే తెలియక బూతులు మాట్లాడుతుంటారు. ఇప్పుడు షోలో సంజన చేసేది అలానే అనిపిస్తుంది.
బిగ్ బాస్ ఇమ్మానుయేల్ కి కిందపడిన పేపర్ కటింగ్స్ అన్నీ కూడా క్లియర్ చేయమని ఒక టాస్క్ ఇచ్చారు. దానిని ఇమ్మానియేల్ చేస్తున్నాడు. అయితే 24 గంటలు ప్రచారం అయ్యే ఈ బిగ్ బాస్ హౌస్ లో ఒక వీడియో వైరల్ గా మారింది. ఇమ్మానుయేల్ నువ్వు ఇంకా తుడుస్తున్నావా అని అడగాలనుకుంది సంజన. కానీ దానికి బదులుగా ఇమ్మాను నువ్వు ఇంకా కు****స్తున్నావా.? అంటూ అడిగింది. ఇక ట్విట్టర్ యువత ఈ వీడియోను వైరల్ చేయడం మొదలుపెట్టారు.
ఇప్పుడు చాలా ఎండగా ఉంది ఎండ తగ్గిన తర్వాత ఆ పని చేసుకోవచ్చు కదా అని ఇమ్మానుయేల్ తో అంది. మంచినీళ్లు తాగావా అంటూ అడిగింది. మొత్తానికి ఆవిడ అడగడంలో కన్సర్న్ అయితే కొంతమేర కనిపించింది కానీ లాంగ్వేజ్ వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది.
Also Read: