Lalit Modi : సాధారణంగా ప్రస్తుతం ప్రో కబడ్డీ లీగ్ 2025 (PKL 2025) సీజన్ కొనసాగుతుంది. తొలి మ్యాచ్ తెలుగు టైటాన్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ తలపడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ ఓటమి పాలైంది. పీకేఎల్ 2025లో వైజాగ్, జైపూర్, చెన్నై, ఢిల్లీ నాలుగు నగరాల్లోని వేదికల్లో మ్యాచ్ లు జరుగనున్నాయి. ప్రో కబడ్డీ 2018 తరువాత తొలిసారి వైజాగ్ పోర్ట్ సిటీకి తిరిగి రావడం విశేషం. మరోవైపు ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీ ప్రో కబడ్డీ పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా చాలా కమర్షియల్ గా ఆలోచించే లలిత్ మోడీ ఐపీఎల్ ద్వారా భారీ లాభాలు వస్తాయని భావించి ఐపీఎల్ తీసుకొచ్చాడు. మరోవైపు ఇప్పుడు ఫుట్ బాల్ కంటే కూడా కబడ్డీ కి భారీ క్రేజ్ ఉందని తన బిజినెస్ మైండ్ తో చెప్పాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : Mornie Morkel : పాకిస్తాన్ వీక్నెస్ మాకు తెలుసు.. వాళ్లను చావు దెబ్బ కొడతాం… టీమిండియా కోచ్ వార్నింగ్
దీంతో ఫుట్ బాల్ ఆడితే ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంటుంది. కేవలం ఇండియాలో బిజినెస్ కోసం ఫుట్ బాల్ వేస్ట్.. కబడ్డీ బెస్ట్ అని లలిత్ మోడీ పేర్కొనడం గమనార్హం. దీంతో లలిత్ మోడీ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లలిత్ మోడీ మాటలు పట్టుకుంటే.. టీమిండియా ఫుట్ బాల్ లో ఎన్నటికీ రాణించదు. టీమిండియా ఫుట్ బాల్ లో ఇప్పటికే చాలా వీక్ గా ఉంది. మళ్లీ ఫుట్ బాల్ కంటే కబడ్డీనే బెటర్ అని.. గత ఏడాది ఫుట్ బాల్ ఐఎస్ఎల్ ని 110 మిలియన్ల మంది వీక్షిస్తే.. అదే ప్రో కబడ్డీ ని 330 మిలియన్ల మంది వీక్షించారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐపీఎల్ తరువాత ఇండియాలో అంతటి క్రేజ్ దక్కించుకుంది కేవలం ప్రో కబడ్డీ లీగ్ మాత్రమే. ఫుట్ బాల్ కి క్రేజ్ చాలా తగ్గిందని పేర్కొనడం గమనార్హం.
ప్రస్తుతం ప్రో కబడ్డీ లీగ్ కొనసాగుతోంది. ఇందులో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. అయితే వీటిలో ప్రస్తుతం పాయింట్ల పట్టిక ముంబై జట్టు 6 పాయింట్లతో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. ముంబై మొత్తం 4 మ్యాచ్ లు ఆడగా.. ఒక మ్యాచ్ లో ఓడిపోయింది. పుణె 5 మ్యాచ్ లకు 3 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. 6 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీ 3 మ్యాచ్ లకు 3 గెలిచింది. 6 పాయింట్లతో థర్డ్ ప్లేస్ లో ఉంది. హైదరాబాద్ 4 మ్యాచ్ లకు 2 మ్యాచ్ ల్లో విజయం సాధించి 4 పాయింట్లతో నాలుగో స్తానంలో కొనసాగుతోంది. యూపీ 4 పాయింట్లు, హర్యానా 04, బెంగళూరు 4, జైపూర్ 2, పాట్నా 2, బెంగాళ్ 2, తమిళనాడు 2 పాయింట్లతో 11వ స్థానంలో.. గుజరాత్ 2 పాయింట్లతో చిట్టచివరి స్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్ లో ఇంకా క్రేజ్ పెరుగుతోంది ప్రో కబడ్డీ లీగ్ కి మంచి ఆదరణ లభిస్తోంది.