E-Paper
Advertisement

Ustaad Bhagat Singh : హరీష్ శంకర్ డాక్టరువా డైరెక్టర్ వా? పల్స్ అంత కరెక్ట్ గా పట్టుకున్నావ్? 

Ustaad Bhagat Singh : హరీష్ శంకర్ డాక్టరువా డైరెక్టర్ వా? పల్స్ అంత కరెక్ట్ గా పట్టుకున్నావ్? 
Advertisement

Ustaad Bhagat Singh : కొంతమంది మనుషులు కొందరిని ఎంతలా ఇష్టపడతారు అనేదానికి కొలమానం ఉండదు. చాలామంది హీరోలకి అభిమానులు ఉండటం అనేది సాధారణం. కానీ పవన్ కళ్యాణ్ కు హరీష్ శంకర్ అభిమాని అవ్వడం మాత్రం ప్రత్యేకం. హరీష్ ఎంతమందితో సినిమా చేసినా కూడా హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా అంటే మాత్రం అదే నెక్స్ట్ లెవెల్. ఒక రీమేక్ సినిమా పవన్ కళ్యాణ్ తో చేసిన కూడా రికార్డులు క్రియేట్ చేయడం అనేది హరీష్ శంకర్ కు చెల్లింది.

ఊరికే కొన్ని డైలాగులు రాయడం వేరు కానీ ఒక స్టార్ హీరో బాడీ లాంగ్వేజ్ కి రియల్ క్యారెక్టర్ కి సరిపడా డైలాగ్స్ రాయడం అనేది మామూలు విషయం కాదు. గబ్బర్ సింగ్ సినిమా టైంలో ఆ సినిమా విడుదల అవడానికి అంటే ముందు “నాకు కొంచెం తిక్కుంది దానికి ఒక లెక్క ఉంది” అనేది కరెక్ట్ గా పవన్ కళ్యాణ్ కి సరిపోయింది. చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులకి హరీష్ అంటే ప్రత్యేకమైన ఇష్టం ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు కళ్యాణ్ ను ఎలా చూడాలి అనుకుంటారు అంతకుమించి ఒక మెట్టు ఎక్కువగానే చూపించడం హరీష్ కు అలవాటైపోయింది.

డాక్టరువా డైరెక్టర్ వా?

Advertisement

పవన్ కళ్యాణ్ కు సినిమా మీద ఒకప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ ఇప్పుడు లేదు అనేది కొన్నిసార్లు స్పష్టం అవుతూ వచ్చింది. ఒకప్పుడు ఎడిట్ రూమ్ లో దాదాపు 18 గంటల పాటు కూర్చొని యాక్షన్ సీక్వెన్సెస్ ను మార్తాండ్ కె వెంకటేష్ తో ఎడిట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అంత ప్యాషన్ ఇప్పుడు కళ్యాణ్ కి సినిమాల మీద ఉంది అంటే లేదనే ఖచ్చితంగా చెప్పాలి.

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఒళ్ళు హూనం చేసుకొని ఫ్లోర్ మూమెంట్లు వేయాల్సిన అవసరం లేదు. కానీ ఎనర్జీతో డాన్స్ చేస్తే అదే పవన్ కళ్యాణ్ అభిమానులకు సరిపోతుంది. ఇక కొద్దిసేపటికి క్రితమే విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ మాత్రం కంప్లీట్ ఫుల్ మెయిల్స్ అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ లోన్ ఎనర్జీని పర్ఫెక్ట్ గా బయటకు తీశాడు హరీష్ అని అర్థమయిపోతుంది.

Advertisement

అయితే పవన్ కళ్యాణ్ అభిమానుల పల్స్ కరెక్ట్ గా పట్టుకున్నాడు కాబట్టి అసలు హరీష్ అనేవాడు డైరెక్టర్ ఆ లేకపోతే డాక్టర్ అనే డౌట్స్ కూడా రావడం సహజంగా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఆ రేంజ్ లో డాన్స్ చేశాడు అంటే ఖచ్చితంగా హరీష్ కళ్యాణ్ కాళ్లు పట్టేసుకున్నాడేమో అని డౌట్ కూడా వస్తుంది.

మరోసారి భుక్తాయాసం ఖాయం 

హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ స్పీచ్ ఎప్పటికీ కూడా హైలెట్. ఆ సినిమా విడుదల కంటే ముందు హరీష్ మాట్లాడిన మాటలు చాలామందికి మంచి కిక్ ఇచ్చాయి. పంచభూతాలు లాగే పవర్ స్టార్ క్రేజ్ కూడా శాశ్వతం అని హరీష్ అప్పట్లో చెప్పిన మాటలు ఒక కమర్షియల్ సినిమాలో హీరో ఎలివేషన్ కంటే కూడా గొప్పవి.

కేవలం స్పీచ్ తోనే హై ఇచ్చాడు. ఆకలితో ఉన్న వాళ్ళు గబ్బర్ సింగ్ సినిమా చూసి భుక్తాయాసం బయటకు వెళ్తారు అని అప్పట్లో హరీష్ చెప్పినట్లు అది మరోసారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో కూడా ప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. ఈ పాట చూసిన తర్వాత సినిమా మీద అంచనాలు ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Also Read: Anil Ravipudi : మెగాస్టార్ మన శంకర్ వరప్రసాద్ లో వెంకటేష్ పాత్ర ఇదే క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×