E-Paper
Advertisement

Messi In Hyderabad: ఉప్పల్ లో మెస్సీ మేనియా.. ఫ్రెండ్లీ మ్యాచ్ లో పుల్ హీట్

Messi In Hyderabad: ఉప్పల్ లో మెస్సీ మేనియా.. ఫ్రెండ్లీ మ్యాచ్ లో పుల్ హీట్
Advertisement

Messi In Hyderabad: అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియానికి చేరుకోవడంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. ఎన్నాళ్లగానో అభిమాన ప్లేయర్ ను స్వయంగా చూడాలనుకున్న కోరిక నెరవేరడంతో అభిమానులు అరుపులు, కేకలతో హంగామా చేశారు. ఉప్పల్ స్టేడియంలో మెస్సీ పేరు మారుమోగింది.

గోల్ కొట్టిన సీఎం

మెస్సీ ‘గోట్‌ టూర్‌ ఆఫ్‌ ఇండియా’ కొనసాగుతోంది. గోట్‌ కప్‌ పేరుతో ఉప్పల్‌ స్టేడియంలో ఎగ్జిబిషన్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మెస్సీ, సీఎం రేవంత్‌ రెడ్డి జట్ల మధ్య ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్‌ జరిగింది. సింగరేణి ఆర్‌ఆర్‌ టీమ్‌ తరఫున సీఎం రేవంత్‌రెడ్డి గోల్‌ చేశారు. మెస్సీ రెండో గోల్స్‌ కొట్టాడు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు ఇరు జట్లతో కలిసి మెస్సీ, సీఎం రేవంత్‌ ఫొటోలు దిగారు. ఫుట్ బాల్ పై ఆటోగ్రాఫ్ పెట్టి గ్యాలరీలోని అభిమానులకు కిక్‌ చేసి గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ ను రాహుల్‌ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కుమారుడు, కుమార్తె వీక్షించారు.

Advertisement

అంతకు ముందు ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన మెస్సీకి అభిమానులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకున్న మెస్సీ, పలువురు అతిథులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

అతిథులతో మెస్సీ మీట్

ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో మెస్సీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఫొటో సెషన్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని మెస్సీతో మాట్లాడారు.

Advertisement

హై వోల్టేజ్ ఫుట్‌బాల్ మ్యాచ్

అనంతరం మెస్సీ నేరుగా ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఫుట్ బాల్ దిగ్గజాన్ని చూసేందుకు అభిమానులు భారీగా తరలిరావడంతో స్టేడియం కిక్కిరిసిపోయింది. ‘మెస్సీ జెర్సీ నంబర్ 10’ ధరించిన అభిమానులు ఉప్పల్ స్టేడియాన్ని నీలి-తెలుపు రంగుల కలయికగా మార్చేశారు.

Also Read: CM Revanth vs Lionel Messi: మెస్సీకి ఝ‌ల‌క్‌..రాగానే గోల్ గొట్టిన సీఎం రేవంత్ రెడ్డి

మెస్సీ మ్యాచ్ చూసేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ , కుమార్తె అర్హ ఉప్పల్ స్టేడియానికి వచ్చారు. తమ స్నేహితులతో కలిసి వచ్చిన వారు స్టేడియం కెమెరాల కంట పడ్డారు.

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×