E-Paper
Advertisement

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?
Advertisement

Faria Abdullah: తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ‘జాతి రత్నాలు’ సినిమాలో చిట్టి గా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి ఫరియా అబ్దుల్లా, తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన హాట్ వీడియోతో రచ్చ లేపుతోంది. ఇప్పటివరకు తన నటన, డాన్స్‌తో అలరించిన ఈ పొడుగు కాళ్ల సుందరి, ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచి నెటిజన్లను అవాక్కయ్యేలా చేస్తోంది. ఇక పచ్చని ప్రకృతి ఒడిలో వైట్ డ్రెస్‌లో ఆమె ఇచ్చిన కిల్లర్ పోజులు చూసి ఫ్యాన్స్ మతిపోతోంది. ప్రస్తుతం ఫరియా షేర్ చేసిన ఈ లేటెస్ట్ గ్లామరస్ వీడియో ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి..

వైట్ అవుట్‌ఫిట్‌లో హాట్ అవతార్ :

తాజా ఫోటోషూట్ కోసం ఫరియా అబ్దుల్లా వైట్ కలర్ డీప్ వీ-నెక్ వన్-పీస్ స్విమ్‌సూట్‌ను ఎంచుకుంది. నడుము భాగంలో మ్యాచింగ్ వైట్ బెల్ట్, వెనుక భాగంలో గాలికి ఎగిరే పారదర్శకమైన కేప్ లేయర్‌తో ఆమె ఒక దేవకన్యలా మెరిసిపోయింది. ఇక చెట్ల మధ్య ఉన్న ఒక వుడెన్ డెక్ పై నిలబడి ఆమె ఇచ్చిన పోజులు గ్లామర్ ప్రియులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

ఆసక్తికరమైన క్యాప్షన్‌తో రచ్చ:

Advertisement

వీడియోతో పాటు ఫరియా షేర్ చేసిన ఆసక్తికరమైన క్యాప్షన్ కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. “లైఫ్ ఊహించలేనిది.. కానీ నేను కూడా అంతే! ఇది విషయాలను న్యూట్రలైజ్ చేస్తుందా ఏంటి?” అంటూ సరదాగా రాసుకొచ్చింది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ “సో బ్యూటీ”, “ఆసమ్” అంటూ కామెంట్లతో రీల్ సెక్షన్‌ను ఊపేస్తున్నారు. మరికొందరైతే ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

‘జాతి రత్నాలు’ నుంచి నేటి వరకు ప్రయాణం:

హైదరాబాద్‌కు చెందిన ఈ థియేటర్ ఆర్టిస్ట్, ‘జాతి రత్నాలు’లో అడ్వకేట్ షామిలీ అలియాస్ చిట్టిగా టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’, ‘రావణాసుర’, ‘ఆ ఒక్కటీ అడక్కు’, ‘మత్తు వదలరా 2’ చిత్రాల్లో నటించడమే కాక, ‘కల్కి 2898 AD’ లోనూ మెరిసింది. గత ఏడాది గుర్రం పాపిరెడ్డి సినిమా తో హిట్ అందుకుంది. ఇక హిందీలో ‘ది జెంగాబురు కర్స్’ వెబ్ సిరీస్‌తో అలరించిన ఫరియా, ప్రస్తుతం సిగ్మా , భగవంతుడు వంటి చిత్రాలతో పాటు.. తమిళ, తెలుగు భాషల్లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

Advertisement

also read: తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్:

తన కళ్ళు చెదిరే అందంతో, ఎత్తుతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఫరియా అబ్దుల్లా చేతిలో ప్రస్తుతం వరుస ఆఫర్లు ఉన్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం కూడా ఆమెకు అంతే కీలకంగా మారింది. నటన, గ్లామర్‌తో పాటు ఈ ఆఫర్లను సరైన హిట్లుగా మలుచుకుని సక్సెస్ రేట్ పెంచుకుంటేనే ఇండస్ట్రీలో ఆమె హవా సుదీర్ఘకాలం కొనసాగుతుంది. రాబోయే ప్రాజెక్టులతో ఫరియా ఎలాంటి విజయాలు అందుకుంటుందో వేచి చూడాలి. ఇక గ్లామర్‌తో పాటు నటనలోనూ తనకంటూ ఒక ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకుంటున్న ఫరియా అబ్దుల్లా, ఈ రేంజ్ స్పీడ్ కొనసాగిస్తే టాలీవుడ్‌లోని స్టార్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

?utm_source=ig_web_copy_link&igsi=MzRlODBiNWFlZA==

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×